పర్సంటేజ్ సిస్టం కావాలంటూ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలలో కొందరు ఆ డిమాండ్స్ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేయగా, మరికొందరు సుముఖత వ్యక్తం చేశారు. అయితే ఎవరూ బాహాటంగా‌‌ తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయలేదు. హరిహర వీరమల్లు విడుదల వాయిదా పడటానికి ముందు జరిగిన పరిణామాలు ప్రేక్షకులు అందరికీ తెలిసిందే.‌ ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం తెలుగు ఫిలిం ఛాంబర్ ఒక కమిటీ వేసింది. 

విశాఖలో జరిగిన ఛాంబర్ మీటింగ్!విశాఖపట్టణంలో మే 30వ తేదీన తెలుగు ఫిలిం ఛాంబర్ ‌ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది.‌‌ అందులో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీ వేయడంతో పాటు అందులో ఎవరెవరు ఉండాలనేది నిర్ణయించారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు... ఒక్కో సెక్టార్ నుంచి పదిమంది సభ్యులను ఎంపిక చేశారు.

సమస్యల పరిష్కారం కోసం నియమించిన కమిటీ చైర్మన్‌గా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, కన్వీనర్‌గా  తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రెటరీ కెఎల్ దామోదర్ ప్రసాద్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. 

Also Read'హౌస్‌ ఫుల్ 5' రివ్యూ: అడల్ట్ జోక్స్, హీరోయిన్స్ గ్లామర్ షో నమ్ముకున్న సినిమా... తెలుగు ప్రేక్షకులకు అక్షయ్ కుమార్ సినిమా నచ్చుతుందా? ఇది హిట్టా? ఫట్టా?

ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి దామోదర ప్రసాద్, 'దిల్' రాజు, టి ప్రసన్నకుమార్, సి కళ్యాణ్, పివి రవికిషోర్, వై రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ‌, డీవీవీ దానయ్య, స్వప్న దత్, వై సుప్రియ కమిటీలో ఉన్నారు.‌ డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి భరత్ భూషణ్, ‌ఎన్ సుధాకర్ రెడ్డి, ఎం సుధాకర్, శిరీష్ రెడ్డి, శశిధర్ రెడ్డి, యు వెంకటేశ్వర రావు, ఎం రాందాస్, ఎన్ నాగార్జున, సీడెడ్ కుమార్, సి భరత్ చౌదరి ఉన్నారు. ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి టీఎస్ రాంప్రసాద్, డి సురేష్ బాబు, సునీల్ నారంగ్, జి వీర నారాయణ బాబు, బి శ్రీనివాస రావు, కె అనుపమ రెడ్డి, టి బాల గోవిందరాజ్, జి మహేశ్వర్ రెడ్డి, ‌కే శివప్రసాద రావు, ఎం విజయేందర్ రెడ్డి ఉన్నారు. పర్సంటేజ్ సిస్టమ్ వర్సెస్ థియేటర్స్ రెంట్ గురించి ఈ కమిటీ ఏం నిర్ణయిస్తుందో చూడాలి.

Also Readఘనంగా అఖిల్ పెళ్లి... చిరంజీవి, చరణ్ to ప్రశాంత్ నీల్, తిలక్ వర్మ... అక్కినేని ఇంట స్టార్స్ సందడి... ఎవరెవరు వచ్చారో చూడండి