అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ఓ ఇంటివాడు అయ్యారు. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న జైనాబ్ రావ్జీ (Zainab Ravdjee)తో ఆయన ఏడు అడుగులు వేశారు. నాగార్జున ఇంటిలో కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో ఘనంగా వివాహ వేడుక జరిగింది. ఈ పెళ్లికి వచ్చిన స్టార్స్ ఎవరో తెలుసా? 

చిరంజీవి, చరణ్ to ప్రశాంత్ ‌నీల్...అక్కినేని ఫ్యామిలీ సందడి సూపర్!అక్కినేని కుటుంబ సభ్యులు అందరూ అఖిల్ వివాహానికి హాజరు అయ్యారు. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలువగా... అక్కినేని కజిన్స్ సుశాంత్, సుమంత్ తదితరులు సందడి సూపర్ ఉందని వివాహానికి హాజరైన వాళ్ళు చెబుతున్నారు.

Also Read అన్నపూర్ణ స్టూడియోలో కాదు... అఖిల్ పెళ్లి ముహూర్తం నుంచి అతిథులు, వేదిక, జైనాబ్ బ్యాగ్రౌండ్ వరకూ... కంప్లీట్ డీటెయిల్స్

సినిమా ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సైతం అఖిల్ వివాహానికి హాజరు అయ్యారు. దర్శకులలో 'కేజీఎఫ్', 'సలార్' వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ తీసిన ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా 'డ్రాగన్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ప్రశాంత్ నీల్ హాజరయ్యారు. క్రికెటర్ తిలక్ వర్మ కూడా వచ్చారు.

శిల్పారెడ్డి సైతం వివాహానికి హాజరైన అతిధుల జాబితాలో ఉన్నారు.‌ త్వరలో నాగార్జున ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా విడుదల చేస్తారని అక్కినేని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.

Also Read'థగ్ లైఫ్' రివ్యూ: కమల్‌ను శింబు డామినేట్ చేశారా? 'నాయకుడు'కు మించి మణి తీశారా? సినిమా హిట్టా? ఫట్టా?