అక్కినేని వారసుడు అఖిల్ (Akhil Akkineni) పెళ్లి జూన్ 6న. జైనాబ్ రావ్జీ (Zainab Ravdjee)తో ఆయన జీవితాన్ని పంచుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ డిస్కషన్ పాయింట్ అయ్యింది. ఏప్రిల్ 8, 1994లో అఖిల్ జన్మించారు. ఆయన వయసు 31 అయితే జైనాబ్ వయసు 39 ఏళ్లు అని సమాచారం. అది పక్కన పెడితే... వీళ్లిద్దరూ ఎక్కడ పెళ్లి చేసుకోబోతున్నారు? ముహూర్తం ఎన్ని గంటలకు? అతిథులు ఎవరు? వంటి విషయాల్లోకి వెళితే...

పెళ్లి అన్నపూర్ణ స్టూడియోలో కాదు...నాగ చైతన్య, శోభితా ధూళిపాళ వివాహం అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. అఖిల్ పెళ్లి సైతం అక్కడ జరుగుతుందని ప్రచారం జరిగింది. అది పూర్తిగా అవాస్తం. Akhil Akkineni Zainab Ravdjee Wedding Venue: అన్నపూర్ణ స్టూడియోలో కాదు... జూబ్లీ హిల్స్‌లోని నాగార్జున నివాసంలో పెళ్లికి ఏర్పాట్లు జరిగాయి. సొంతింట్లో అఖిల్ ఏడు అడుగులు వేయబోతున్నారు. పెళ్లి ముహూర్తం జూన్ 6వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు అని తెలిసింది (Akhil Akkineni Zainab Ravdjee Wedding Muhurat). 

పెళ్లికి వచ్చే అతిథులు చాలా తక్కువ...ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, సినీ ప్రముఖులకు నాగార్జున కుమారుడి పెళ్లికి తప్పకుండా హాజరు కావాలని ఆహ్వానాలు అందించారు. వాళ్లంతా రిసెప్షన్‌కు వస్తారని తెలిసింది. 

జూన్ 6వ తేదీ ఉదయం వివాహానికి అఖిల్, జైనాబ్ కుటుంబ సభ్యులు కాకుండా మరో 30 మంది మాత్రమే ఉంటారని తెలిసింది. చైతూ - శోభిత దంపతులతో పాటు అక్కినేని - దగ్గుబాటి ఫ్యామిలీ కజిన్స్ నడుమ పెళ్లి జరుగుతుంది. జూన్ 8వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దానికి రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు హాజరు కానున్నారు. 

ఎవరీ జైనాబ్ రావ్జీ? ఆమె నేపథ్యం ఏమిటి?అఖిల్ నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు 'ఎవరీ జైనాబ్?' అనే ప్రశ్న ప్రేక్షకులు చాలా మందిలో ఉంది. ఆవిడ పార్శీ ఫ్యామిలీలో జన్మించింది. జైనాబ్ తండ్రి జుల్ఫీ ఇండస్ట్రియలిస్ట్. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో క్యాబినెట్ ర్యాంక్ హోదా పదవి బాధ్యతలు నిర్వర్తించారు.

Also Read: ప్రవస్తి ఆరాధ్య ఏమిట్లు? 'పాడుతా తీయగా' కాంట్రవర్సీలోనూ కులం గోల... గూగుల్ చేస్తున్న నెటిజన్లు

జైనాబ్ జన్మించినది హైదరాబాద్ సిటీలో. అయితే ప్రొఫెషన్ కోసం ముంబై షిఫ్ట్ అయ్యారు. ఆవిడ ఆర్టిస్ట్. అంటే పెయింటింగ్స్ వేస్తుంటారు. దేశంలోని వివిధ నగరాలతో పాటు దుబాయ్, లండన్‌లోనూ తన ఆర్ట్ వర్క్ ఎగ్జిబిషన్స్‌ ద్వారా ప్రజలకు చూపించారు.

Also Readవదిలేయండ్రా బాబూ... ఈవిడ 'ఖలేజా'లో దిలావర్ సింగ్ వైఫ్ కాదు... ఇదిగో క్లారిటీ

అఖిల్ కెరీర్ చూస్తే... ఊహ తెలియని వయసులో 'సిసింద్రీ' చేశారు. 'మనం'లో తళుక్కున మెరిసిన ఆయన... 'అఖిల్'తో హీరోగా పరిచయం అయ్యారు. 'హలో', 'మిస్టర్ మజ్ను', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్', 'ఏజెంట్' సినిమాలు చేశారు. ప్రస్తుతం 'లెనిన్' సినిమా చేస్తున్నారు.