సూపర్ స్టార్ ఘట్టమనేని మహేష్ బాబు నటించిన సినిమాలలో... గురూజీ / మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన 'ఖలేజా'కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందులోనూ ఆ సినిమాలో దిలావర్ సింగ్ వైఫ్ రోల్ చేసిన అందాల లేడీకి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది‌‌. 'ఖలేజా' రీ రిలీజ్ కావడంతో ఆ క్యారెక్టర్ చేసింది ఈ లేడీ అంటూ చాలా మంది పోస్టులు చేస్తున్నారు. దాంతో దివ్య మేరీ సీరియక్ క్లారిటీ ఇచ్చారు.

వందల కొద్దీ మెసేజ్‌లు, ట్యాగ్‌లు...'ఖలేజా'లో నటించింది నేను కాదు!'ఖలేజా' సినిమాలో దిలావర్ సింగ్ భార్య పాత్రలో నటించిన మహిళ పేరు దివ్య మేరి సీరియక్ అని ప్రచారం జరుగుతోంది.‌ సోషల్ మీడియాలో చాలా మంది ఆవిడకు మెసేజ్‌లు చేయడంతో పాటు 'ఖలేజా' రీ రిలీజ్ థియేటర్లలో ఫోటోలు తీసి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలలో ట్యాగ్‌లు చేస్తున్నారు.

Also Readఅమెరికాలో అడ్వాన్స్‌ కలెక్షన్స్ లొల్లి... సోషల్ మీడియాకు ఎక్కిన రచ్చ... పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' కోసమా?

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా 'ఖలేజా' థియేటర్లలో మరోసారి విడుదల అయింది. దాంతో గత రెండు మూడు రోజులలో వందల కొద్దీ మెసేజ్‌లు ట్యాగ్‌లు రావడంతో దిలావర్ సింగ్ భార్య పాత్రలో నటించింది నేను కాదంటూ దివ్య మేరీ సీరియక్ క్లారిటీ ఇచ్చారు.

''వందల మంది మెసేజ్‌లు చేయడంతో పాటు ఎంతో ప్రేమను చూపిస్తున్నారు అందువల్ల మరోసారి నేను క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నట్లు 'ఖలేజా' సినిమాలో అతిథి పాత్రలో నటించినది నేను కాదు. మీరు చూపిస్తున్న ప్రేమను అప్రిషియేట్ చేస్తున్నా. కానీ, ఇది మిస్టేకెన్ ఐడెంటిటీ. వేరెవరో బదులు నేను అనుకుంటున్నారు'' అని దివ్య మేరీ సీరియక్ తెలిపారు. మరి మహేష్ బాబు అభిమానులు ఇప్పటికి అయినా సరే ఆమెను వదిలి పెడతారో లేదో చూడాలి.

Also Readనన్ను రెచ్చగొట్టలేరు... నాన్న నుంచి నాకొచ్చిన ఆస్తి అది... 'కన్నప్ప' హార్డ్ డిస్క్ ఇష్యూలో మనోజ్ రెస్పాన్స్

సోషల్ మీడియాలో దివ్య మేరి సీరియక్ ఫోటోలు, ఆవిడ అందం చూసి ఎవరైనా సరే నటి అని పొరబడతారు. ఆవిడకు పెళ్లయిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని సమాచారం. దివ్య మేరీ సీరియక్ ముంబైలో ఉంటున్నారు. ఫోటో షూట్స్ చాలా చేశారు.