Telugu Movies USA Collections: 'హరిహర వీరమల్లు' అడ్వాన్స్ బుకింగ్స్ (ప్రీ సేల్స్) విషయంలో అమెరికాలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న Prathyangira Cinemas సంస్థ, Venky Box Office ట్విట్టర్ హ్యాండిల్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. లీగల్ యాక్షన్ తీసుకుంటామని ప్రత్యంగిరా సినిమాస్ హెచ్చరించే వరకు వెళ్ళింది. ఆ గొడవ ఏమిటి? అనేది చూస్తే...   

ఇండియాలో మూవీ కలెక్షన్స్ ట్రాక్ చేయడానికి సపరేట్ సైట్స్ అంటూ ఏమీ లేవు. బుక్ మై షో, పేటీఎమ్, పీవీఆర్ ఐనాక్స్ వంటి యాప్స్‌లో టికెట్ సేల్స్ బట్టి ఒక అంచనా వేస్తారు. అప్పుడప్పుడూ మల్టీప్లెక్స్ సంస్థలు తమ ఫ్రాంచైజీ థియేటర్లు లేదంటే ఫలానా స్క్రీన్‌లో ఆ సినిమా ఇన్ని కోట్లు కలెక్ట్ చేసిందని పోస్టర్లు విడుదల చేస్తాయి. అమెరికాలో అయితే అలా కాదు... కామ్ స్కోర్, రెంట్రాక్ వెబ్‌సైట్స్‌లో కలెక్షన్స్ అందుబాటులో ఉంటాయి. అయితే... అది సినిమా విడుదల తర్వాత! విడుదలకు ముందు ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయి? అనేది పక్కాగా చెప్పే వెబ్ సైట్స్ లేవు. టికెట్ బుకింగ్స్ యాప్స్‌లో ట్రెండ్, బజ్ బట్టి అంచనా వేయడమే. సరిగ్గా ఈ పాయింట్ దగ్గర గొడవ మొదలైంది. 

లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరికమే 31వ తేదీ రాత్రి ప్రత్యంగిరా సినిమాస్ ఒక ట్వీట్ చేసింది. తమ సినిమాలకు సంబంధించి ప్రీ సేల్స్ విషయంలో కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ పోస్టులు చేస్తున్నాయని, చట్టవ్యతిరేకమైన పద్ధతుల్లో / డేటాను దొంగలిస్తూ... వాస్తవాలను వక్రీకరిస్తూ బాక్స్ ఆఫీస్ నంబర్స్ ఎఫెక్ట్ అయ్యేలా చేస్తున్నారని, సినిమాకు హాని చేస్తున్నారని పేర్కొంది. భవిష్యత్తులో ఈ విధంగా చేస్తే లీగల్ యాక్షన్ తీసుకోవడానికి తాము వెనుకాడబోమని హెచ్చరించింది.

Also Read: రికార్డ్ కోసం 'ఖలేజా' కలెక్షన్స్ పెంచారా? నిజంగా 'గబ్బర్ సింగ్'ను బీట్ చేయలేదా?

ప్రత్యంగిరా సినిమాస్ ట్వీట్ తర్వాత వెంకీస్ బాక్స్ ఆఫీస్ ట్విట్టర్ హ్యాండిల్‌లో మరొక పోస్ట్ వచ్చింది. ప్రీ సేల్స్ డేటా పబ్లిష్ చేయవద్దని డిస్ట్రిబ్యూటర్ అడిగారని అందులో పేర్కొన్నారు. నాలుగేళ్ల నుంచి తాము అడ్వాన్స్ / ప్రీ సేల్స్ డేటా పబ్లిష్ చేస్తున్నామని, ఎప్పుడూ ఏ సినిమాకూ తప్పుడు లెక్కలు రిపోర్ట్ చేయలేదని వివరించారు. సినిమాకు హాని చేసే విధంగా తాము ఎప్పుడూ చేయలేదన్నారు. అందరికీ అందుబాటులో ఉన్న డేటా పబ్లిష్ చేయడం ఇల్లీగల్ కాదని, కొంత మంది డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు తాము చేస్తున్న విధంగా చేస్తున్నారని... తాము చేయడం ఇల్లీగల్ అయితే డిస్ట్రిబ్యూటర్లు చేయడం కూడా ఇల్లీగల్ అని పేర్కొన్నారు.

Also Readనన్ను రెచ్చగొట్టలేరు... నాన్న నుంచి నాకొచ్చిన ఆస్తి అది... 'కన్నప్ప' హార్డ్ డిస్క్ ఇష్యూలో మనోజ్ రెస్పాన్స్

వెంకీస్ బాక్స్ ఆఫీస్ ట్వీట్ తర్వాత బ్యాక్ ఎండ్ డేటా నుంచి తీసుకున్న బాక్స్ ఆఫీస్ నంబర్స్ పబ్లిష్ చేయవద్దని తాము ఎవరినీ అడగలేదని ప్రత్యంగిరా సినిమాస్ పేర్కొంది. కలెక్షన్స్ పోస్ట్ చేసే ముందు క్రెడిబుల్ సోర్స్ కూడా పబ్లిష్ చేస్తే బావుంటుందని చెప్పింది. జూన్ 1వ తేదీ నుంచి తమ సినిమాలకు సంబందించిన నంబర్స్ తాము పోస్ట్ చేస్తామని ప్రత్యంగిరా సినిమాస్ స్పష్టం చేసింది.

డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా ప్రీ సేల్స్ (కలెక్షన్స్) పోస్ట్ చేస్తామని చెప్పారంటే వాళ్ళు కూడా తమలా బ్యాక్ ఎండ్ సోర్స్ నుంచి తీసుకుంటారని... వాళ్ళు పోస్ట్ చేస్తే మేం కూడా పోస్ట్ చేస్తామని స్పష్టం చేసింది. జూన్ రెండో వారంలో విడుదల అయ్యే 'హరిహర వీరమల్లు' సినిమాను అమెరికాలో ప్రత్యంగిరా సినిమాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. అందువల్ల, ఆ సినిమా ప్రీ సేల్స్ కలెక్షన్స్ రిపోర్ట్ చేసే విషయంలో ఈ మాటల యుద్ధం జరిగిందని ట్రేడ్ వర్గాల టాక్.