మంచు మోహన్ బాబు తనయులు విష్ణు, మనోజ్ మధ్య కొన్నాళ్లుగా జరుగుతున్న గొడవలు తెలుగు ప్రజలు అందరికీ తెలిసినవే. పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం, మీడియా ముందుకు రావడం వంటివి తెలిసిన విషయాలే. తాజాగా అన్నదమ్ముల మధ్య గొడవ కొత్త మలుపు తీసుకుంది. మంచు మనోజ్ దగ్గర పని చేసే రఘు, చరిత 'కన్నప్ప' హార్డ్ డిస్క్ తీశారని విష్ణు మంచు పేర్కొన్నారు. ఎవరైనా చెబితే వాళ్ళిద్దరూ ఆ పని చేశారా? లేదా? అనేది తనకు తెలియదని చెన్నైలో జరిగిన కన్నప్ప ప్రెస్ మీట్ లో పేర్కొన్నారు. అన్నయ్య ఆరోపణలపై తమ్ముడు మంచు మనోజ్ స్పందించలేదు.
'కన్నప్ప' గొప్ప విజయం సాధించాలని కోరుతున్నా!దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత 'భైరవం'తో నటుడిగా మంచు మనోజ్ రీ ఎంట్రీ ఇచ్చారు. సినిమాలో నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేశారు. ఆయన నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అలాగే సినిమా కూడా చక్కటి వసూళ్లు సాధిస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో 'కన్నప్ప' హార్డ్ డిస్క్ ప్రస్తావన వచ్చింది.
'కన్నప్ప' హార్డ్ డిస్క్ మిస్ అయ్యిందని, అది మీ దగ్గర ఉందని (విష్ణు మంచు?) అంటున్నారని ఒక విలేకరి ప్రశ్నించగా... ''మీకు ఇచ్చాను కదా! మీరు ఎక్కడ పెట్టారు? మీరే కదా ఆ రోజు వచ్చి తీసుకున్నారు'' అని మంచు మనోజ్ సరదాగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ''నేను ఇక్కడికి వచ్చింది 'భైరవం' గురించి కాబట్టి ఆ సినిమా విషయం వరకు మాట్లాడతా. ఇటీవల నేను ఒక విషయం చెప్పాను... ఒకప్పుడు ఆ సినిమా గురించి ఫన్ చేశాను. కానీ, ఓ సినిమా వెనుక వందల మంది కష్టం ఉంటుంది కనుక ఇప్పటికీ ఆ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా. 'భైరవం' విజయాన్ని ఈ సినిమాకు వస్తున్న పాజిటివిటీ, ప్రేక్షకులు నా మీద చూపిస్తున్న ప్రేమను చూసి నన్ను రెచ్చగొట్టాలని అనుకుంటే రెచ్చగొట్టలేరు. ఇంత మంది ప్రేమ ముందు అది కనిపించడం లేదు. అందుకని 'కన్నప్ప' హార్ట్ డిస్క్ గురించి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాలని అనుకోవడం లేదు'' అని చెప్పారు.
Also Read: శ్రీలీల ఇంట్లో ఫంక్షన్... ఎంగేజ్‌మెంట్ కాదండీ బాబూ... ఇదీ వైరల్ ఫోటో వెనుక అసలు మ్యాటర్
'భైరవం' విడుదల రోజున తండ్రి మోహన్ బాబుతో కలిసి ఉన్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో మంచు మనోజ్ షేర్ చేశారు. దానికి 'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' అని క్యాప్షన్ ఇచ్చారు. ఆ ఫోటో గురించి, 'భైరవం' సినిమాలో మనోజ్ నటన మంచు మోహన్ బాబును గుర్తు చేసిందని పలువురు ప్రశంసిస్తున్నారని అడగ్గా... ''తండ్రి నుంచి నాకు వచ్చిన ఆస్తి. అది డిఎన్ఏ'' అని సమాధానం ఇచ్చారు. మరి దీనిపై విష్ణు మంచు ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read: థియేటర్లలో చూసిన సినిమా కాదు... ఎక్స్‌టెండెడ్ వెర్షన్... 'లాల్ సలాం' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది