సినిమాలు చేయడం మాత్రమే కాదు... ప్రజలను చైతన్యవంతులను చేయడం కూడా తన బాధ్యత అని భావించే కథానాయకులలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఒకరు. 'వరల్డ్ నో టొబాకో డే' (World No Tobacco Day 2025) సందర్భంగా ప్రేక్షకులకు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు.
స్మోకింగ్ కిల్స్...దమ్ము కొట్టొద్దు బ్రదర్!సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కొత్త ఫోటో పోస్ట్ చేశారు. దాన్ని చూశారా? ఆ ఫోటో మీద ఉన్న క్యాప్షన్ గమనించారా? 'స్మోకింగ్ కిల్స్' అని ఉంది. మే 31న 'వరల్డ్ నో టొబాకో డే'.
పొగాకు వల్ల ప్రజలకు కలిగే అనర్థాలను వివరిస్తూ... పొగాకు, పొగాకు ఉత్పత్తులైన సిగరెట్ బీడీ గుట్కా వంటి వాటికి నో చెప్పాలని ప్రజలలో అవగాహన కల్పించడం కోసం 'వరల్డ్ నో టొబాకో డే' పలువురు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో స్మోకింగ్ కిల్స్ క్యాప్షన్ ఉన్న టీ షర్ట్ ధరించి ''బి ఫైర్... (ఫైరులా ఉండండి). పొగలా కాదు. దమ్ము కొట్టొద్దు బ్రదర్'' అని పేర్కొన్నారు. అల్లు అర్జున్ చేసిన పని పట్ల ప్రజల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.
Also Read: మనోజ్ మనుషుల పనే... 'కన్నప్ప' హార్డ్ డిస్క్ చోరీలో తమ్ముడిపై విష్ణు మంచు అనుమానం
ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే... అట్లీ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా ఓకే చేసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి 'ఐకాన్' టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అది పక్కన పెడితే... అందులో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేస్తున్నారని, ఆ మూడు పాత్రలలో విలన్ క్యారెక్టర్ కూడా ఒకటని సమాచారం. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.