'కన్నప్ప'కు సంబంధించిన విజువల్స్ ఉన్న హార్డ్ డిస్క్ మాయం అయ్యిందని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థలో ఎగ్జిక్యూటివ్ నిర్మాత విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన సంగతి తెలిసిందే. 'కన్నప్ప'లో రెబల్ స్టార్ ప్రభాస్ ఒక ప్రత్యేక పాత్రలో నటించారు. ఆయన సన్నివేశాలకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ కొరియర్ ద్వారా రాగా... ఆ డిస్క్ మాయం అయ్యిందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపించింది. ఇప్పుడు ఈ చోరీలో మనోజ్ హస్తం ఉందనే విధంగా విష్ణు వ్యాఖ్యలు సాగాయి. 

Continues below advertisement


వాళ్ళిద్దరిపై విష్ణు మంచు అనుమానం...
మనోజ్ దగ్గర రఘు, చరిత ఉద్యోగులు!
జూన్ 27న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో భారీ ఎత్తున 'కన్నప్ప' విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు విష్ణు మంచు. శుక్రవారం చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు అందులో హార్డ్ డిస్క్ మాయం కావడం గురించి విలేకరులు ప్రశ్నించగా...


''మనోజ్ మంచు దగ్గర పనిచేసే రఘు, చరిత కన్నప్ప హార్డ్ డిస్క్ మాయం చేశారు. వాళ్లంతట వాళ్ళుగా హార్డ్ డిస్క్ తీశారా? లేదంటే ఎవరైనా చెబితే ఆ పని చేశారా? అనేది నాకు తెలియదు. ఈ చోరీ వెనుక ఉన్నది ఎవరనేది తెలియాలి'' అని విష్ణు మంచు వ్యాఖ్యానించారు. మనోజ్ దగ్గర పని చేసే వ్యక్తులు అని చెప్పడం ద్వారా తమ్ముడు మీద ఆయన అనుమానం వ్యక్తం చేసినట్లు అయ్యింది. 


Also Read: ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ అలా చేయడం కరెక్ట్ కాదు... థియేటర్స్ బంద్ ఇష్యూలో నారాయణ మూర్తి సెన్సేషనల్ కామెంట్స్






చెన్నైలో 'కన్నప్ప' ప్రెస్ మీట్ జరిగిన రోజే మంచు మనోజ్ రీ ఎంట్రీ సినిమా 'భైరవం' థియేటర్లలో విడుదలైంది. అందులో ఆయన విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశారు. మనోజ్ నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా విడుదల సందర్భంగా 'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' అని మనోజ్ ఒక ట్వీట్ చేశారు. అందులో తండ్రి మోహన్ బాబు పెదరాయుడు గెటప్ స్టిల్ ఉండగా... 'భైరవం'లో తాను లుంగీ కట్టిన స్టిల్ పోస్ట్ చేశారు మనోజ్. మరి, ఈ అన్నదమ్ముల గొడవ ఎంత దూరం వెళుతుందనేది చూడాలి.






Also Readశ్రీలీల ఇంట్లో ఫంక్షన్... ఎంగేజ్‌మెంట్ కాదండీ బాబూ... ఇదీ వైరల్ ఫోటో వెనుక అసలు మ్యాటర్