Jatadhara: కృష్ణుడు శివుడు అవ్వడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారు కదా. శివుడైనా, కృష్ణుడైనా పరమాత్ముడు ఒక్కరే. ఏ రూపంలో ఉన్నా, ఎన్ని పేర్లతో పిలిచినా భగవంతుడు ఒక్కరే అని అంతా భావిస్తుంటారు. ఇక కృష్ణుడిని శివుడిని చేశారనే విషయానికి వస్తే.. ఇక్కడ కృష్ణుడు ఎవరో కాదు.. నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ. ఘట్టమనేని అభిమానులు ఎంతగానో అభిమానించే కృష్ణ, శివుని అవతారంలో కనిపిస్తే.. ఆ ఫ్యాన్స్ ఆనందానికి అవధులే ఉండవు. అదే ఆనందాన్ని ‘జటాధర’ చిత్రయూనిట్ ఘట్టమనేని అభిమానులకు, సూపర్ స్టార్ కృష్ణ బర్త్ యానివర్సరీ రోజు ఇచ్చారు. అవును, ఘట్టమనేని అభిమానులకు ఇది నిజంగా అదిరిపోయే ట్రీట్ అని చెప్పకతప్పదు.
మే 31 లెజండరీ యాక్టర్ సూపర్‌స్టార్ కృష్ణ జయంతి అనే విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘జటాధర’ చిత్ర యూనిట్ ఈ ఐకానిక్ యాక్టర్‌కు హృదయపూర్వకంగా నివాళులు అర్పించింది. నటశేఖర కృష్ణ తిరుగులేని చరిష్మా, లార్జర్ దేన్ లైఫ్ స్క్రీన్ ప్రెజన్స్.. ‘జటాధర’ టీమ్‌కి స్ఫూర్తినందిస్తూ క్రియేటివ్‌గా ముందుకు వెళ్లటానికి తోడ్పాడునందిస్తుందని భావిస్తోంది. తెలుగు వెండితెరపై దేవుడిగా భావించే, సిల్వర్ స్క్రీన్ తుఫానుగా చూచే, సినిమా ప్రపంచాన్ని ఎప్పటికీ ప్రభావితం చేసే శక్తిగా లెజండరీ యాక్టర్ సూపర్‌స్టార్ కృష్ణను ‘జటాధర’ చిత్రయూనిట్ స్మరించుకుంది. తమ కథలను ఈ ప్రపంచానికి అందించటానికి కృషి చేస్తోన్న ఈ జట్టుకు ఆయన చూపిన దారి మార్గదర్శకత్వంగా నిలుస్తుందని విశ్వసిస్తోంది.
‘హ్యాపీ బర్త్‌డే టు ది కింగ్ ఆఫ్ చరిష్మా’ అంటూ సినీ పరిశ్రమపై ఆ లెజండరీ నటుడి చిరస్మరణీయ ప్రభావాన్ని శ్లాఘిస్తూ.. ఓ అద్భుతమైన పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నటశేఖరుడు శివుని అవతారంలో దర్శనమిస్తున్నారు. ‘జటాధర’ టైటిల్‌కు జస్టిఫికేషన్ ఇచ్చేలా వచ్చిన ఈ పోస్టర్ ఫ్యాన్స్‌కి మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘జటాధర’ సినిమా షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ చిత్ర నటీనటులు, టెక్నీషియన్స్ సినీ ప్రయాణంలో మైల్‌స్టోన్ మూవీగా నిలిచిపోనుందని యూనిట్ భావిస్తోంది.
పాన్ ఇండియా మూవీగా సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోన్న ‘జటాధర’ను తెలుగు, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సుధీర్ బాబు, శిల్పా శిరోద్కర్, రవి ప్రకాష్, ఇంద్ర కృష్ణ, నవీన్ నేని, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, ఝాన్సి వంటి వారంతా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ప్రేరణ అరోరా, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్ నిర్మిస్తున్నారు. అక్షయ్ క్రేజీవాల్, కుస్సుమ్ అరోరా సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి దివ్యా విజయ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా, భవానీ గోస్వామి సూపర్‌వైజింగ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఫ్యాన్స్‌కు, ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ని ఇచ్చేలా ఈ సినిమా రూపొందుతుందని మేకర్స్ వెల్లడించారు.