గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) బర్త్ డే మంత్ వచ్చేసింది. ఈ నెల (జూన్) 10న ఆయన పుట్టిన రోజు (Balakrishna Birthday). దానికంటే ముందు థియేటర్లలో పండగ మొదలు కానుంది. బాలయ్య సూపర్ హిట్ సినిమాలలో ఒకటైన 'లక్ష్మీ నరసింహ' రీ రిలీజ్ అవుతోంది.
జూన్ 7న థియేటర్లలోకి మళ్లీ 'లక్ష్మీ నరసింహ'Lakshmi Narasimha Re Release Date: బాలయ్య పుట్టిన రోజు కంటే మూడు రోజుల ముందు థియేటర్లలోకి 'లక్ష్మీ నరసింహ' సినిమా రానుంది. జూన్ 7వ తేదీన రీ రిలీజ్ చేస్తున్నారు. నైజాం (తెలంగాణ)తో పాటు ఉత్తరాంధ్రలో ఈ సినిమాను అగ్ర నిర్మాత 'దిల్' రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ విడుదల చేస్తోంది.
'లక్ష్మీ నరసింహ'కు జయంతి సి పరాంజి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన అసిన్ హీరోయిన్‌గా నటించారు. తమిళంలో విజయం సాధించిన చియాన్ విక్రమ్ 'సామి'కి తెలుగు రీమేక్ ఇది. అయితే బాలకృష్ణ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని కథలో, పాటల్లో కొంత మార్పులు చేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో బాలకృష్ణ చెప్పే డైలాగులకు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన లభించింది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంత గానో ఎదురు చూస్తున్నారు. ఇటీవల రీ రిలీజ్ సినిమాలకు భారీ వసూళ్లు లభిస్తున్న నేపథ్యంలో 'లక్ష్మీ నరసింహ' ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.
పుట్టినరోజు కానుకగా 'అఖండ 2' టీజర్ రిలీజ్!ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న సినిమాలకు వస్తే... 'సింహా', 'లెజెండ్', 'అఖండ' వంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రాలను తనకు అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ 2' రెండు చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10వ తేదీన విడుదల కానుంది. తొలుత ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేసినా... ప్రస్తుతం అది సాధ్యమయ్యేట్టు కనిపించడం లేదని ఫిలింనగర్ వర్గాల సమాచారం. డిసెంబర్ లేదా సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయట.
Also Read: శ్రీలీల ఇంట్లో ఫంక్షన్... ఎంగేజ్‌మెంట్ కాదండీ బాబూ... ఇదీ వైరల్ ఫోటో వెనుక అసలు మ్యాటర్