'పాడుతా తీయగా' చూసే ప్రజలకు ప్రవస్తి ఆరాధ్య (Pravasthi Aradhya) తెలుసు. ఆ కార్యక్రమంతో పాటు టీవీల్లో సింగింగ్ రియాలిటీ షోలు ఫాలో అవ్వని ప్రజలకు సైతం ఇప్పుడు ఆమె తెలుసు. ఆస్కార్ విన్నర్స్ ఎంఎం కీరవాణి, చంద్రబోస్, ఇంకా ప్రముఖ గాయని సునీత మీద ప్రవస్తి ఆరాధ్య ఆరోపణలు చేయడం... ఆమె ఆరోపణలకు సునీత, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత ప్రవీణ కడియాల క్లారిటీ ఇవ్వడం తెలిసిన విషయాలే. ఈ కాంట్రవర్సీలోనూ కొందరు కులం ప్రస్తావన తెస్తున్నారని తెలుసా?
ప్రవస్తి ఆరాధ్యది ఏ కులం?ఇంతకీ, ఆ అమ్మాయిది ఏ క్యాస్ట్?మీరు పైన చదివిన ప్రశ్న కొంత మంది మదిలో మెదిలింది... అది నిజమే! ఇప్పుడు మన అందరికీ అందుబాటులోకి, చేతుల్లోకి గూగుల్ తల్లి వచ్చేసిందిగా... ఎవరు ఏ ప్రశ్న అడిగినా తిట్టుకోకుండా, కసురు కోకుండా తనకు తెలిసిన సమాచారాన్ని చక్కగా చెబుతుంది. అందుకని, 'ప్రవస్తి ఆరాధ్యది ఏ కులం?' (Pravasthi Aradhya caste) అని గూగుల్ చేశారు.
లాస్ట్ సెవెన్ డేస్ (వారం) డేటా తీస్తే... ఏప్రిల్ 17వ తేదీన ప్రవస్తి ఆరాధ్య కులం ఏమిటో తెలుసుకోవాలని ఏపీలో జనాలు ఆసక్తి కనబరిచారు. యంగ్ సింగర్ క్యాస్ట్ గురించి గూగుల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 75 మంది 'ప్రవస్తి ఆరాధ్య క్యాస్ట్' అని సెర్చ్ చేశారు. ఆ తర్వాత ఏప్రిల్ 23న మరికొంత మంది వెతికారు. ఎందుకో గానీ తెలంగాణలో ప్రవస్తి ఆరాధ్య కులంపై కాస్త ఆలస్యంగా ఆసక్తి మొదలైంది. ఏప్రిల్ 23న ఆమె క్యాస్ట్ గురించి గూగుల్ చేశారు. ఏపీ, తెలంగాణ ప్రజలకు మాత్రమే ఈ కుల పిచ్చి ఉందని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మన పొరుగున ఉన్న తమిళనాడులో సైతం ప్రవస్తి ఆరాధ్య కులం గురించి గూగుల్ చేయడం విశేషం. ఇదేమీ అబద్ధం కాదు... కావాలంటే ఒక్కసారి కింద ఉన్న డేటా చూడండి.
Also Read: నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
Also Read: లెజెండరీ కీరవాణి గురించి ఆ మాటలేంటి? ఆపేస్తే బెటర్... వీడియో రిలీజ్ చేసిన హారికా నారాయణ్
ప్రవస్తి ఆరాధ్య ఆరోపణల వల్ల రియాలిటీ షోస్ మీద ఎంతో కొంత ఎఫెక్ట్ పడే అవకాశం లేకపోలేదు. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసే చిన్నారులు కాస్త వెనకడుగు వేయొచ్చు. పక్షపాత వైఖరి లేకుండా ప్రతిభావంతులకు చేయూత అందించాలని ఇటువంటి షోలకు న్యాయనిర్ణేతలుగా వచ్చే సెలబ్రిటీలు 'మనకెందుకు ఈ గోల? అనవసరమైన వివాదాల్లోకి వెళ్లడం ఎందుకు?' అని ఆలోచించవచ్చు. షోలకు రావడం మానేసే అవకాశం లేకపోలేదు. ప్రవస్తి ఆరాధ్య ఇష్యూ ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటుందనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.