Pravasthi Aradhya Controversy Row: 'పాడుతా తీయగా' (Padutha Theeyaga) కార్యక్రమం మీద, ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తీరు మీద యువ గాయని ప్రవస్తి ఆరాధ్య (Pravasthi Aradhya) చేసిన ఆరోపణపై ఒక న్యూస్ ఛానల్ డిబేట్ నిర్వహించింది. అందులో మరొక యువ గాయని హారికా నారాయణ్ (Harika Narayan) రూపొందించిన ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియో వీక్షణ ప్రస్తావన తీసుకు వచ్చారు. ఆ ప్రోగ్రాంలో చేసిన వ్యాఖ్యల పట్ల హారికా నారాయణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
లెజెండరీ కీరవాణి గారిపై నెగెటివిటీ ఆపేయండి!లెజెండరీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారి (MM Keeravani) చేతుల మీదుగా తాను రూపొందించిన ప్రైవేట్ సాంగ్ 'వీక్షణ' విడుదల చేశామని, ఆ వీడియో తన సోషల్ మీడియాలో రీల్ కింద పోస్ట్ చేయగా, చాలా తప్పుడు ఉద్దేశంతో ఒక టీవీ ఛానల్ లో ప్రదర్శించడంతో పాటు ఒక జర్నలిస్ట్ నోటికి వచ్చింది మాట్లాడాలని, తనకు నచ్చలేదని హారికా నారాయణ్ తెలిపారు.
కీరవాణి గారి లాంటి లెజెండరీ సంగీత దర్శకుడు చిన్న మ్యూజిక్ వీడియోకి సపోర్టు చేయడం గొప్ప విషయమని, కొత్త వాళ్లకు ఆయన ఎటువంటి ప్రోత్సాహం అందిస్తారనేదానికి ఇదొక చిన్న ఉదాహరణ అని హారికా నారాయణ్ తెలిపారు.
Also Read: ఎంగేజ్మెంట్, మ్యారేజ్ ఫోటోలు డిలీట్... విడాకుల దిశగా సింగర్ హారికా నారాయణ్?
'వీక్షణ' సాంగ్ విడుదల చేసినప్పుడు కీరవాణి గారి ముందు నిలబడడం తన ఛాయిస్ అని హారికా నారాయణ్ స్పష్టం చేశారు. ఆయన దగ్గర పని చేసిన గాయనీ గాయకులతో పాటు కళాకారులు ఎవరినైనా అడిగితే సాటి మనిషికి కీరవాణి గారు ఎటువంటి విలువ ఇస్తారో చెబుతారని ఆమె వివరించారు. సంగీతానికి సంబంధించిన విషయాలు మాత్రమే కాదని జీవితం గురించి నేర్చుకోవాల్సినవి కీరవాణి గారి దగ్గర ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. గొప్ప వ్యక్తి గురించి నిజానిజాలు తెలుసుకోకుండా అబద్ధాలు చెప్పడం తనకు నచ్చలేదని, ఇది ఆయనను ఆ గౌరవపరిచినట్లు అనిపించిందని, ఇకపై నెగెటివిటీ ఆపేస్తారని భావిస్తున్నానని హారిక నారాయణ్ ముగించారు.
Also Read: నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత