జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం (Pahalgam Terror Attack)లో జరిగిన ఉగ్రదాడి యావత్ భారతదేశం ఉలిక్కిపడేలా చేసింది. కాశ్మీర్ అందాలు చూడడానికి వెళ్లిన పర్యాటకుల మీద ఉగ్రవాదులు మారణకాండకు తెగబడ్డారు. ప్రకృతి అందాలు చూస్తున్న ప్రజల మీద పాశవికంగా దాడి చేశారు. ఆ ఘటనలో మొత్తం 28 మంది మరణించారు. ఈ విషాదం పట్ల తెలుగు చలనచిత్ర సీమ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని ఖండించారు. మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదితరుల స్పందన చూడండి.
''జమ్మూ కాశ్మీర్ లో 26 మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న ఉగ్రదాడి హృదయ విదారకరమైనది. ఇది క్షమించరాని క్రూరమైన చర్య. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. వారికి కలిగిన నష్టం ఎవరూ తీర్చలేనిది'' అని చిరంజీవి పేర్కొన్నారు. కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని చీకటి రోజుగా వర్ణించారు సూపర్ స్టార్ మహేష్ బాబు.
Also Read: నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
''పహల్గాం బాధితులను చూస్తుంటే నా గుండె బరువెక్కి పోతుంది. ఈ దాడిలో మరణించిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
''పహల్గాం టెర్రర్ ఎటాక్ వార్త విని షాక్ అయ్యాను. ఎంతో బాధ కలిగింది. ఈ తరహా ఘటనలకు మన సమాజంలో చోటు లేదు. దీనిని ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండించాలి. బాధిత కుటుంబాల కోసం ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను'' అని రామ్ చరణ్ పేర్కొన్నారు.
Also Read: ఎంగేజ్మెంట్, మ్యారేజ్ ఫోటోలు డిలీట్... విడాకుల దిశగా సింగర్ హారికా నారాయణ్?
''పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆ వార్త విని నా హృదయం ముక్కలైంది. మృతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా'' అని అల్లు అర్జున్ చెప్పారు. సాయి దుర్గా తేజ్, విష్ణు మంచు సహా పలువురు తెలుగు సినిమా ప్రముఖులు... బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, సంజయ్ దత్, జాన్వీ కపూర్, సోనూ సూద్ తదితరులు ఈ దాడిని ఖండించారు.