Kamal Haasan's Thug Life OTT Release On Netflix: దాదాపు 37 ఏళ్ల తర్వాత యూనివర్సల్ హీరో కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'థగ్ లైఫ్'. గ్యాంగ్ స్టర్, మాఫియా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.

ఆ ఓటీటీలోకి..

ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. డిజిటల్ రైట్స్ కోసం పలు సంస్థలు పోటీ పడగా.. భారీ ధరకు ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' హక్కులను సొంతం చేసుకుంది. దీని కోసం సదరు సంస్థ దాదాపు రూ.149 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత క్రేజీ కాంబో కావడంతో ఇంత ఆఫర్ చేసిందని సమాచారం. అలాగే, శాటిలైట్ రైట్స్‌ను విజయ్ టీవీ రూ.60 కోట్లకు కొనుగోలు చేసినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. తెలుగులో 'స్టార్ మా' సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

సాధారణంగా ఏ మూవీ అయినా థియేటర్లలో రిలీజ్ అయిన 4 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంది. మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంటే కాస్త ఆలస్యంగా స్ట్రీమింగ్ కావొచ్చు. అయితే, 'థగ్ లైఫ్' విషయంలో మూవీ థియేటర్స్‌లో రిలీజ్ అయిన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనే ఒప్పందం చేసుకున్నారట. ఓటీటీ స్ట్రీమింగ్ విషయంపై కమల్ హాసన్ సైతం మూవీ ప్రమోషన్లలో భాగంగా 8 వారాలు పెడితే మంచిదని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో ఈ మూవీ స్వాంతత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 7న ఓటీటీలోకి అందుబాటులోకి తెచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: 2 వేల మందితో భారీ యాక్షన్ సీక్వెన్స్ - ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కోసం ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగా లేదంతే!

మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ మూవీలో కమల్ హాసన్‌తో పాటు శింబు కీలక పాత్ర పోషించారు. త్రిష, అభిరామి హీరోయిన్లుగా నటించారు. నాజర్, అశోక్ సెల్వన్, తనికెళ్ల భరణి, నాజర్, మహేశ్ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటించారు. కమల్ హాసన్, మహేంద్రన్, మణిరత్నం నిర్మాతలుగా వ్యవహరించారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'కన్నడ' భాషపై కమల్ కామెంట్స్ కారణంగా వివాదం రేగడంతో కర్ణాటకలో ఈ మూవీ రిలీజ్ కాలేదు.

స్టోరీ ఏంటంటే?

ఢిల్లీలో రంగరాయ శక్తిరాజు (కమల్ హాసన్) ఓ పెద్ద డాన్. పోలీసులు రౌండప్ చేసినప్పుడు అతని మనుషులు జరిపిన కాల్పుల్లో అనుకోకుండా  ఓ పేపర్ బాయ్ ప్రాణాలు కోల్పోతాడు. అతని కుమారుడు అమర్ (శింబు) ను చేరదీసి సొంత కొడుకులా పెంచుతాడు శక్తిరాజు. అమర్ చెల్లెలు కూడా మిస్ కాగా ఆమె వెతికి ఇస్తానని మాటిస్తాడు.

నేర సామ్రాజ్యంలో శక్తి రాజుకు అమర్ కుడి భుజంలా ఉంటాడు. ఓ కేసులో జైలుకు వెళ్లే ముందు అనుచరులు అందరికీ తన స్థానంలో అమర్ అన్ని బాధ్యతలు చూసుకుంటాడని చెప్పి మరీ వెళ్తాడు శక్తి రాజు. ఇది ఆ ముఠాలోని ఇతర సభ్యులు మాణిక్యం (నాజర్), పత్రోస్ (జోజు జార్జ్)లకు నచ్చదు. దీంతో ఆ ముఠాలో అలజడి రేగుతుంది. మరోవైపు.. జైలు నుంచి వచ్చిన వెంటనే శక్తిరాజ్‌పై అటాక్ జరుగుతుంది.ఈ క్రమంలో అమర్ మీద అనుమానం వ్యక్తం చేస్తాడు శక్తిరాజు. అసలు ఆ అనుమానం ఎందుకు వచ్చింది? తండ్రీ కొడుకుల్లాంటి ఇద్దరి మధ్య వైరం ఎందుకు వచ్చింది? ఈ స్టోరీలో ఇంద్రాణి (త్రిష), లక్ష్మి (అభిరామి)ల పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.