Dulquer Salmaan's Oka Yamudi Prema Katha OTT Streaming On Aha: సీతారామం, కల్కి, లక్కీ భాస్కర్ వంటి వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు దుల్కర్ సల్మాన్. తన యాక్టింగ్‌తో తెలుగు ఆడియన్స్‌లో స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆయన మూవీస్ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తుండగా.. టాలీవుడ్ స్టార్‌గా మారారు.

Continues below advertisement


తెలుగు ఓటీటీలోకి మలయాళ బ్లాక్ బస్టర్


దుల్కర్ నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ కామెడీ థ్రిల్లర్ 'ఒరు యమండన్ ప్రేమకథ'. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ తాజాగా తెలుగు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ 'ఆహా'లో గురువారం నుంచి ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీని తెలుగులో భవానీ మీడియా రిలీజ్ చేస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.


ఈ సినిమాకు బి.సి.నౌఫల్ దర్శకత్వ వహించగా.. దుల్కర్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే నిఖిలా విమల్, బిబిన్ జార్జ్, విష్ణు ఉన్ని కృష్ణన్, సౌబిన్ షాహిర్ కీలక పాత్రలు పోషించారు. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ అందరి మన్ననలు పొందింది.


Also Read: మహేష్ బాబు, రాజమౌళి మూవీ అప్‌డేట్ వచ్చేసింది - కొత్త షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?


స్టోరీ ఏంటంటే?


మోహన్ లాల్ జాన్ అలియాస్ లల్లూ (దుల్కర్ సల్మాన్) పెయింటర్‌గా పని చేస్తుంటాడు. లవ్ మ్యారేజ్ చేసుకుని ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలంటూ కలలు కంటాడు. ఈ క్రమంలోనే దియా (నిఖిలా విమల్) అనే అమ్మాయి ఫోటోను వార్తా పత్రికలో చూసి ఇష్టం పెంచుకుంటాడు. ఆమె ఆచూకీ కోసం స్నేహితులతో కలిసి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే, ఆమె దొరక్కపోవడంతో తీవ్ర నిరాళకు గురవుతాడు. కొంతకాలం తర్వాత దియాను ఎవరో హత్య చేశారని తెలుసుకుని షాక్ అవుతాడు. హంతకులపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. అసలు ఆమెను ఎవరు హత్య చేశారు?, అసలు సంయుక్తకు దుల్కర్‌కు సంబంధమేంటి?, హంతకులను పట్టుకునే క్రమంలో అతనికి ఎదురైన పరిణామాలేంటి? ఆ తర్వాత ఏం జరిగింది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.


ఇక దుల్కర్ సల్మాన్ తర్వాత ప్రాజెక్టుల విషయానికొస్తే.. 'లక్కీ భాస్కర్' హిట్ జోష్ మీదున్న ఆయన వరుస ప్రాజెక్టులతో బిజీగా మారారు. ప్రస్తుతం, రాణా దగ్గుబాటి స్పిరిట్ మీడియా నిర్మిస్తోన్న 'కాంతా'లో నటిస్తున్నారు. అలాగే.. స్వప్న సినిమాస్ నిర్మాణంలో రూపొందుతోన్న 'ఆకాశంలో ఒక తారా' అనే ప్రాజెక్టులోనూ నటిస్తున్నారు.