సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్, డిజిటల్ స్క్రీన్ అని ప్రియమణి తేడాలు చూడడం లేదు. తనకు నచ్చిన కథలు ఎక్కడ లభిస్తే అక్కడ యాక్ట్ చేస్తున్నారు. వెబ్ సిరీస్‌లలో నటించడం మొదలుపెట్టిన సౌత్ హీరోయిన్లలో ప్రియమణి ముందు వరుసలో ఉంటారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు మరొక వెబ్ సిరీస్ చేశారు.
ప్రియమణి... ఒక మంచి భార్య!Good Wife Web Series On JioHotstar: ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందిన తాజా వెబ్ సిరీస్ 'గుడ్ వైఫ్'. 'ఒక్క రాత్రిలో అంతా మారిపోయింది. కుటుంబం కోసం ఆమె చేసే యుద్ధం మొదలైంది' అంటూ ఈ సిరీస్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అందులో సంపత్ రాజు కూడా ఉన్నారు. ఆయన ప్రియమణి భర్త పాత్రలో నటించినట్లు అర్థం అవుతుంది. భార్యాభర్తలతో పాటు ఇద్దరు పిల్లల్ని కూడా చూపించారు.
అమెరికన్ వెబ్ సిరీస్ 'ది గుడ్ వైఫ్' ఆధారంగా ప్రియమణి తాజా వెబ్ సిరీస్ రూపొందినట్లు సమాచారం. ఇదొక లీకల్ పొలిటికల్ డ్రామా. త్వరలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఏడు భాషలలో గుడ్ వైఫ్ రిలీజ్!సాధారణంగా పాన్ ఇండియా రిలీజ్ అనేది ఆడియన్స్ వింటూ ఉంటారు. హిందీతో పాటు దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో సినిమాలను విడుదల చేస్తే పాన్ ఇండియా అనడం అలవాటు. ఇప్పుడు ఈ సిరీస్ రిలీజ్ అంతకు మించి అని చెప్పాలి. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషలతో పాటు మరాఠీ, బెంగాలీలో కూడా సిరీస్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు జియో హాట్ స్టార్ ఓటీటీ పేర్కొంది.