రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) అభిమానులు 18 ఏళ్లుగా కంటున్న కల‌‌ ఈ ఏడాది నెరవేరింది. ఆర్సీబీ ఐపీఎల్ కప్పు కొట్టింది.‌ కింగ్ కోహ్లీ అభిమానులతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందులో టాలీవుడ్ స్టార్స్ కూడా ఉన్నారు. ఐపీఎల్ ఫినాలే ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో ఆర్సీబీకి అభినందనలు తెలుపుతూ పోస్టులు చేశారు.

అల్లు అయాన్... కేరాఫ్ కోహ్లీ ఫ్యాన్!ఐపీఎల్ ఫినాలే తర్వాత, ఆర్సీబీ విజయం సాధించాక ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. విరాట్ కోహ్లీకి తన కుమారుడు ఫ్యాన్ అని పేర్కొన్నారు. ఆర్సీబీ విజయం తర్వాత అయాన్ మూమెంట్స్ క్యాప్చర్ చేసి ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. సో క్యూట్ మై చిన్ని బాబు అంటూ పేర్కొన్నారు.

Also Read: సెన్సార్, వీఎఫ్ఎక్స్ సమస్యల నుంచి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వరకు... హరిహర వీరమల్లు వాయిదాపై ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్

ఎన్టీఆర్ డ్రాగన్ సెట్స్‌లో ప్రశాంత్ హ్యాపీ!జూన్ 4న ప్రశాంత్ నీల్ బర్త్ డే. 'కేజిఎఫ్', 'సలార్' సినిమాలతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ కొట్టిన ఈ దర్శకుడు కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమాని. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా 'డ్రాగన్' సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఐపీఎల్ ఫినాలే సందర్భంగా అక్కడ ఒక ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఆర్సీబీ విజయం ప్రశాంత్ నీల్ సంతోషంతో గంతులేశారు. తన భర్త పుట్టిన రోజుకు ఇది పర్ఫెక్ట్ బహుమతి ఎంతో ఆయన సతీమణి లిఖిత సోషల్ మీడియాలో ఆ వీడియో షేర్ చేశారు‌.

Also Readదేవిక & డానీ వెబ్ సిరీస్ ప్రివ్యూ: తాత తర్వాత మనవరాలికి... అమ్మాయి వెంట పడుతున్న ఆత్మ... ఆ ఫ్యామిలీకే ఎందుకిలా? ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయంటే?

క్రికెట్ అంటే టాలీవుడ్ సెలబ్రిటీలలో ముందుగా గుర్తొచ్చే కథానాయకుడు విక్టరీ వెంకటేష్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం తరువాత ఆయన ఆ జట్టుకు శుభాకాంక్షలు చెబుతూ‌ ట్విట్టర్‌లో ఒక పోస్ట్ చేశారు. అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్, సుధీర్ బాబు, సాయి దుర్గా తేజ్ తదితరులు ఆర్సీబీకి కంగ్రాట్స్ చెబుతా సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.