JioHotstar web series Devika And Danny first two episodes review: జియో హాట్‌స్టార్ ఓటీటీలో జూన్ 6 నుంచి స్ట్రీమింగ్ కానున్న వెబ్ సిరీస్ 'దేవికా అండ్ డానీ'. రీతూ వర్మ, సూర్య వశిష్ట టైటిల్ రోల్స్ చేశారు. శివ కందుకూరి, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటించారు. 'శ్రీకారం' ఫేమ్ కిశోర్ బి దర్శకత్వం వహించారు. ఓటీటీలో స్ట్రీమింగ్ కంటే ముందు ఈ సిరీస్‌లో మొదటి రెండు ఎపిసోడ్స్ మీడియాకు చూపించారు. ఆ ప్రివ్యూ ఎలా ఉందో చూడండి. 

Continues below advertisement


కథ (Devika And Danny web series story): దేవిక (రీతూ వర్మ) ఓ స్కూల్‌లో మ్యూజిక్ టీజర్. తన ఊరి నుంచి పక్క ఊరిలో ఉన్న స్కూల్‌కు వెళ్లి రావడం, తండ్రి చెప్పింది చేయడం తప్ప ఆమెకు పెద్దగా ఏమీ తెలియదు. తండ్రి చూసిన అబ్బాయి జగ్గీ అలియాస్ జగన్నాథం (సుబ్బరాజు)ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తుంది. నిశ్చితార్థం కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఆమె జీవితంలోకి డానీ (సూర్య వశిష్ట) వస్తాడు. అతడి మాటలు ఆమెకునచ్చుతాయి. స్కూల్ సెలవు రోజున అతడితో కాఫీ తాగడానికి ఇంట్లో అబద్ధం చెప్పి బయటకు వస్తుంది. ట్విస్ట్ ఏమిటంటే... డానీ ఒక ఆత్మ.


దేవికకు ఆత్మ ఎందుకు కనిపించింది. దేవిక తాతయ్య ఎవరు? ఆయనకూ ఆత్మలు ఎందుకు కనిపిస్తాయి? ఇప్పుడు డానీ ఆత్మ దేవికకు కనిపించడానికి గల ప్రత్యేక కారణం ఏమిటి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ (Devika And Danny Review Telugu): 'దేవికా అండ్ డానీ'లో ఏడు ఎపిసోడ్స్ ఉన్నాయి. కేవలం రెండు ఎపిసోడ్స్ మాత్రమే చూపించారు. ముఖ్యంగా మొదటి ఎపిసోడ్‌లో పాత్రల పరిచయం కోసం దర్శకుడు కిషోర్ బి ఎక్కువ సమయం తీసుకున్నారు. అయితే... క్వాలిటీ పరంగా హై స్టాండర్డ్స్ మైంటైన్ చేశారు.


మ్యూజిక్ టీచర్‌గా దేవికతో పాటు పాటు ఆమె కుటుంబ సభ్యులను, స్కూల్‌లో స్నేహితులు, ఆమెను పెళ్లి చేసుకోబోయే జగన్నాథాన్ని, మరీ ముఖ్యంగా ఆమె తాతయ్యను పరిచయం చేశారు. మొదటి ఎపిసోడ్ పాత్రల పరిచయానికి, రెండో ఎపిసోడ్ దేవిక, డానీ మధ్య పరిచయానికి సరిపోయాయి. అయితే... రెండో ఎపిసోడ్ ఎండింగ్‌లో డానీ ఆత్మ అని పరిచయం చేసి అందరికీ షాక్ ఇచ్చారు దర్శక రచయితలు కిశోర్ బి, దీపక్ రాజ్.


రెండు ఎపిసోడ్స్ చూసిన తర్వాత ప్రేక్షకుల మదిలో ఎన్నో సందేహాలు, సిరీస్ మీద మరింత ఆసక్తి కలుగుతాయి. దేవికకు, ఆమె తాతయ్యకు ఆత్మలు ఎందుకు కనిపిస్తున్నాయి? దేవిక తాతయ్య ఏం చేసేవారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అలాగే డానీ కోసం వెతుకున్నది ఎవరు? అతడిని ఎవరు చంపారు? అనేది మరొక థ్రెడ్. డానీ మరణానికి, దేవికకు సంబంధం ఏమిటి? దేవిక దగ్గరకు డానీ ఎందుకు వచ్చాడు? అనేది సిరీస్ చివరి వరకు చూస్తే తెలుస్తుంది.


Also Readరాజేంద్ర ప్రసాద్‌ను క్షమించిన అలీ... పుట్టెడు దుఃఖంలో ఉన్నారు... వదిలేయండి!


మొదటి రెండు ఎపిసోడ్స్‌లో రీతూ వర్మ, సూర్య వశిష్ఠ, సుబ్బరాజు కనిపించారు. శివ కందుకూరి, కోవై సరళ పాత్రలను ఇంకా పరిచయం చేయలేదు. వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయనేది కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే అంశమే. కామెడీ  క్యారెక్టర్లతో తెలుగు ప్రేక్షకులను నవ్వించిన కోవై సరళ, 'దేవికా అండ్ డానీ'లో సీరియస్ రోల్ చేశారని దర్శకుడు కిశోర్ బి తెలిపారు. ఆమె రోల్ సర్‌ప్రైజ్ ఇస్తుందని అంటున్నారు. ఫుల్ వెబ్ సిరీస్ చూసేందుకు జూన్ 6 వరకు వెయిట్ చేయాలి. జియో హాట్‌స్టార్ ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.


Also Readవదిలేయండ్రా బాబూ... ఈవిడ 'ఖలేజా'లో దిలావర్ సింగ్ వైఫ్ కాదు... ఇదిగో క్లారిటీ