Sapthagiri's Pelli Kani Prasad OTT Release On ETV Win: కమెడియన్ సప్తగిరి రీసెంట్ కామెడీ మూవీ 'పెళ్లి కాని ప్రసాద్'. మార్చి 21న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నవ్వులు పూయించినా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ ఈ నెల 5 నుంచి ప్రముఖ ఓటీటీ 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ కానుంది. 'మ్యారేజ్.. డ్రామా.. మ్యాడ్‌నెస్.. పెళ్లి కాని ప్రసాద్ మీ స్క్రీన్స్‌పై సందడి చేయబోతున్నాడు. మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించేందుకు సప్తగిరి తిరిగి వస్తున్నాడు.' అంటూ సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది.

ఈ మూవీలో సప్తగిరి, ప్రియాంక శర్మ హీరో హీరోయిన్లుగా నటించగా.. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించారు. కేవై బాబు, భానుప్రకాశ్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, ముత్యాల వైభవ్ రెడ్డి కలిసి మూవీని నిర్మించారు.

Also Read: వెనక్కి తగ్గని కమల్... కన్నడలో 'థగ్ లైఫ్' కిరికిరి - కోర్టుకు వెళ్లిన నిర్మాతలు.. అసలేం జరిగిందంటే?

స్టోరీ ఏంటంటే?

ప్రసాద్ (సప్తగిరి)కు 38 ఏళ్లు వచ్చినా పెళ్లి కాదు. మలేషియాలో మంచి ఉద్యోగం చేస్తూ భారీగా ప్యాకేజీ తీసుకుంటున్నా పెళ్లి లేట్ అవుతుంటుంది. దీనికి కారణం వాళ్ల నాన్నే. తన కొడుకుకి రూ.2 కోట్లు కట్నం ఇచ్చే సంబంధం వస్తే తప్ప పెళ్లి చేయనంటూ భీష్మించుకుని కూర్చుంటాడు ప్రసాద్ తండ్రి (మురళీధర్ గౌడ్). చివరకు ఓ సంబంధం సెట్ అయితే.. దాని కోసం ఇండియాకు తిరిగివస్తాడు ప్రసాద్. అయితే.. అనుకోని కారణాలతో ఆ సంబంధం క్యాన్సిల్ అవుతుంది. 

మరోవైపు.. ప్రియ (ప్రియాంక శర్మ) తన ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో స్థిరపడాలనుకుంటుంది. ఆమె ఫ్యామిలీ మొత్తం ఓ ఎన్నారై సంబంధం కోసం చూస్తుంటుంది. ఈ క్రమంలో ప్రసాద్ గురించి తెలిసి అతన్ని పెళ్లి చేసుకుంటే తన ఫ్యామిలీ అంతా విదేశాల్లో స్థిరపడాలని అనుకుంటుంది ప్రియ. ఈ క్రమంలో ప్రియతో ప్రసాద్ పెళ్లి చేసేస్తారు పెద్దలు. అయితే, పెళ్లి తర్వాత ప్రసాద్ ఇండియాలోనే ఉండాలనుకుంటాడు. ఈ విషయం తెలిసి షాక్ అవుతుంది ప్రియ. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? ప్రసాద్ విదేశాలకు వెళ్లాడా? ప్రియ కోరిక నెరవేరిందా? అసలు రెండు ఫ్యామిలీస్ పెట్టుకున్న కండీషన్స్ ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.