'గదర్ 2'తో సన్నీ డియోల్ (Sunny Deol) మళ్లీ తన సత్తా చాటారు. బాక్స్ ఆఫీస్ బరిలో ఆ సినిమా ఆల్మోస్ట్ 700 కోట్లు కలెక్ట్ చేసింది.‌ 'గదర్ 2' సక్సెస్ తర్వాత సన్నీ డియోల్ నటించిన సినిమా 'జాట్' (Jaat Movie). టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనికి బాలీవుడ్ డెబ్యూ ఇది. సన్నీ డియోల్ నటన, గోపీచంద్ మలినేని దర్శకత్వానికి ఆడియన్స్ నుంచి అప్లాజ్ వచ్చింది. 

జూన్ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్!Sunny Deol new movie Jaat release date and ott platform: థియేటర్లలో ఏప్రిల్ 10న 'జాట్' సినిమా రిలీజ్ అయింది.‌ బాక్స్ ఆఫీస్ బరిలో రూ.120 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ నెల (జూన్) 5 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో సినిమా స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సదరు ఓటీటీ సంస్థ వెల్లడించింది.

చీరాల నేపథ్యంలో జాట్ సినిమా కథ...పవర్ ఫుల్ లేడీ విలన్‌గా రెజీనా కసాండ్రా!'జాట్' బాలీవుడ్ సినిమా. అయితే కథంతా తెలుగు గడ్డ మీద జరుగుతుంది. ఏపీలో, చీరాలలోని ఒక ఊరు మోతుపల్లిలో కథంతా నడుస్తుంది.

శ్రీలంకలో‌ బోల్డంత బంగారాన్ని చోరీ చేసిన ఒక హార్డ్ కోర్ క్రిమినల్ ఆంధ్ర ప్రదేశ్ సముద్ర తీరానికి వస్తాడు. మోతుపల్లిలో సెటిల్ అవుతాడు.‌ అతడి పేరు రణతుంగ. ఆ క్యారెక్టర్ చేసింది రణదీప్ హుడా. అతడి నేర సామ్రాజ్యాన్ని టచ్ చేయడానికి అందరూ భయపడుతున్న సమయంలో ఒక లేడీ ఎస్సై విజయలక్ష్మి (సయామీ ఖేర్) వెళ్తుంది. ఆమెతో ఒక్క మేల్ పోలీస్ ఆఫీసర్ కూడా ఉండరు. అందరూ భయపడి వెనకడుగు వేస్తుంటే... ఫిమేల్ కానిస్టేబుల్స్ వెళతారు. వాళ్లందరినీ లైంగికంగా వేధించడంతో పాటు ఇంట్లో బంధిస్తారు.

Also Readరాజేంద్ర ప్రసాద్‌ను క్షమించిన అలీ... పుట్టెడు దుఃఖంలో ఉన్నారు... వదిలేయండి!

అయోధ్య వెళ్లాల్సిన ఒక ట్రైన్ చీరాల సమీపంలో ఆగుతుంది.‌ అక్కడ టిఫిన్ చేయడానికి వచ్చిన ఒక ప్రయాణికుడితో లోకల్ గుండాలకు గొడవ జరుగుతుంది. తనకు సారీ చెప్పమని ఆ ప్రయాణికుడు అడుగుతాడు.‌ అక్కడి నుంచి చిన్నగా మొదలైన గొడవ ఏకంగా రణతుంగ దగ్గరకు వెళ్లి ఆగుతుంది. అతడిని సారీ అడుగుతాడు ప్రయాణికుడు. గొడవ పెద్దది ‌ చేయడం ఇష్టం లేక సారీ చెబుతాడు రణతుంగ. అయితే ఆ ఇంటిలో ఏదో తేడా జరుగుతుందని గమనించిన ప్రయాణికుడు అక్కడ పెద్ద ఫైట్ చేసి, ఆ ఇంట్లో బంధించిన లేడీ పోలీసులను బయటకు తీసుకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా చూసి తెలుసుకోవాలి 

రణతుంగ భార్య భారతి పాత్రలో రెజీనా కసాండ్రా పవర్ ఫుల్ విలనిజం చూపించారు. ఆమె క్యారెక్టర్ టాలీవుడ్ ఆడియన్స్ అందరికీ సర్ప్రైజ్ ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం బ్యాక్ బోన్ అని చెప్పవచ్చు.

Also Readవదిలేయండ్రా బాబూ... ఈవిడ 'ఖలేజా'లో దిలావర్ సింగ్ వైఫ్ కాదు... ఇదిగో క్లారిటీ