నట కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) ప్రవర్తనను పరిశ్రమలో పలువురు వ్యక్తులతో పాటు సామాన్య ప్రేక్షకులు సైతం తప్పుపడుతున్నారు. నటుడు అలీ (Actor Ali)ని ఆయన 'లం...' అనడం తప్పని రాజేంద్రుడి తీరును ఖండిస్తున్నారు. అయితే... ఈ విషయాన్ని పెద్దది చేయవద్దని, ఇక్కడితో వదిలేయమని అలీ రిక్వెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఆయన ఒక వీడియో షేర్ చేశారు.

అమ్మ లాంటి బిడ్డ పోయింది...ఆయన మంచి ఆర్టిస్ట్... ఏమీ అనొద్దు!Ali Video On Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్ మంచి ఆర్టిస్ట్ అని, కుమార్తె పోయిన దుఃఖంలో ఉన్నారు కనుక ఆయనను ఏమీ అనవద్దని మీడియాను అలీ రిక్వెస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియోలో అలీ మాట్లాడుతూ... ''కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఈవెంట్‌లో అనుకోకుండా ఆయన (నట కిరీటి డా రాజేంద్ర ప్రసాద్) నోటి వెంట మాట దొర్లింది... సరదాగా! దీన్ని మీడియా మిత్రులు వైరల్ చేస్తున్నారు. ఆయన మంచి ఆర్టిస్ట్. పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. మనందరికీ తెలుసు... ఈ మధ్య కాలంలో ఆయన బిడ్డను కోల్పోయారు. అమ్మ లాంటి బిడ్డ మరణించింది. ఆయన కావాలని చెప్పింది కాదు. దీన్ని ఎవరూ రప్చర్ చేయకండి. ప్లీజ్... ఆయన పెద్దాయన'' అని చెప్పారు.

Also Readతప్పుగా అర్థం చేసుకుంటున్నారు... మీ ఖర్మ - అలీకి సారీ చెప్పలేదు... పైగా జనాలకు రాజేంద్రుడి క్లాస్

అలీ రిక్వెస్ట్ చేయడం వల్ల వివాదం ఇక్కడితో ముగుస్తుందని ఒక అంచనాకు రావచ్చు. అయితే... 'షష్టిపూర్తి' సక్సెస్ మీట్‌లో రాజేంద్ర‌ ప్రసాద్ తన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోగా, తనను తప్పుగా అర్థం చేసుకోవడం మీ ఖర్మ అంటే కామెంట్ చేయడం మరో వివాదానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయి. ఒక అలిని మాత్రమే కాదు... ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలలో రోజా పట్ల రాజేంద్ర ప్రసాద్ ఉపయోగించిన భాష అభ్యంతరకరంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. ఇంతకు ముందు డేవిడ్ వార్నర్ ఇష్యూ కూడా ఇప్పుడు హైలైట్ అవుతోంది.

Also Readవదిలేయండ్రా బాబూ... ఈవిడ 'ఖలేజా'లో దిలావర్ సింగ్ వైఫ్ కాదు... ఇదిగో క్లారిటీ