SSMB29 Movie Shooting New Schedule Started: మహేష్ బాబు, రాజమౌళి కాంబో 'SSMB29' మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి అంటేనే ఓ క్రేజ్. ఆయనతో సూపర్ స్టార్ మూవీ అంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయనేది చెప్పలేం. ఇప్పటికే ఓ షూటింగ్ షెడ్యూల్ పూర్తి కాగా తాజాగా మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది.
షూటింగ్ ఎక్కడంటే?
ఇటీవల ఈ మూవీ గురించి ఎలాంటి అప్‌డేట్స్ లేవు. తాజా అప్‌డేట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ ఈ నెల 9 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో కీలక సీన్స్ చిత్రీకరించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఒడిశాలో జరిగిన సంగతి తెలిసిందే. సిమిలిగుడ సమీపంలోని మాలి, పుట్ సీల్, బాల్డ ప్రాంతాల్లో మహేష్ బాబుతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రాలపై కీలక సీన్స్ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత షూటింగ్‌కు కొంత గ్యాప్ వచ్చింది. 'ఆర్ఆర్ఆర్' డాక్యుమెంటరీ ప్రమోషన్స్‌కు రాజమౌళి జపాన్ వెళ్లగా.. మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు రోమ్ వెళ్లారు. అలాగే, ప్రియాంక చోప్రా అమెరికా వెళ్లారు. చాలా రోజుల క్రితమే అందరి వెకేషన్స్ పూర్తి కాగా ఇక వర్క్‌లో పడ్డారు మూవీ టీం.
ఆఫర్ రిజెక్ట్ చేసిన బాలీవుడ్ యాక్టర్
ఈ మూవీలో నటీనటులు ఎవరనే దానిపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు రాజమౌళి. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పేర్లు తప్ప ఎవరివీ రివీల్ కాలేదు. తాజాగా.. ఈ మూవీలో కీలక రోల్ కోసం బాలీవుడ్ యాక్టర్ నానా పటేకర్‌ను తీసుకోవాలని రాజమౌళి భావించినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు పుణె వెళ్లి రాజమౌళి ఆయనకు స్క్రిప్ట్ మొత్తం వివరించారట. కేవలం 15 రోజుల షూటింగ్ కోసం రెమ్యునరేషన్ కూడా భారీగానే ఆఫర్ చేశారనే టాక్ వినిపిస్తోంది. దాదాపు రూ.20 కోట్ల వరకూ ఇస్తామని చెప్పినప్పటికీ నానా పటేకర్ ఈ ఆఫర్ తిరస్కరించారని బాలీవుడ్ మీడియా పేర్కొంది. స్టోరీ, రోల్ బాగున్నప్పటికీ.. ఆ పాత్రకు తాను న్యాయం చేయలేనంటూ ఆయన సున్నితంగా తప్పుకొన్నారని తెలిపింది. అయితే, పాత్ర నచ్చకపోవడంతోనే ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు కూడా కథనాలు వచ్చాయి. ఇదంతా తప్పుడు ప్రచారం అని.. రాజమౌళి అడిగితే ఎంతటి స్టారైనా నటించేందుకు ముందుకు వస్తారని.. ఇవన్నీ రూమర్స్ అంటూ టాలీవుడ్ ఫ్యాన్స్ అంటున్నారు.
దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో సాగే ఈ మూవీ ఎలా ఉండబోతోందనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2027లో మూవీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.