Kamala Haasan's Thug Life Box Office Collections: దాదాపు 38 ఏళ్ల తర్వాత యూనివర్సల్ హీరో కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'థగ్ లైఫ్'. మాఫియా, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. 

రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

సినిమా రిలీజ్‌కు ముందు మంచి కలెక్షన్లతో ప్రారంభమైనప్పటికీ విడుదలైన తర్వాత అనుకున్నంత అంచనాలు అందుకోలేకపోతోంది. ఫస్ట్ డే దేశవ్యాప్తంగా రూ.15.5 కోట్ల కలెక్షన్లు రాగా.. రెండో రోజు భారీగా పతనం అయ్యాయి. సెకండ్ డే దేశవ్యాప్తంగా అన్నీ భాషల్లో కలిపి రూ.7.50 కోట్ల వసూళ్లు వచ్చాయి. తొలి రోజు రూ.15.5 కోట్లు (తెలుగులో రూ.1.5 కోట్లు, తమిళం రూ.13.35 కోట్లు, హిందీ రూ.65 లక్షలు) వసూళ్లు సాధించింది. రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా దాదాపు రూ.23 కోట్ల వసూళ్లు సాధించింది. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్స్ 55 శాతం పడిపోయాయి.

అక్షయ్ మూవీ దెబ్బకొట్టిందిగా..

ఇక హిందీలో 'థగ్ లైఫ్' మూవీ పేలవమైన ఓపెనింగ్స్ చూసింది. ఫస్ట్ డే రూ.65 లక్షలు, రెండో రోజు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'హౌస్ ఫుల్ 5' మూవీ శుక్రవారం రిలీజ్ కాగా దీని ప్రభావం కమల్ మూవీపై చాలానే పడింది. 'హౌస్ ఫుల్' మూవీ తొలి రోజే రూ.23 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం 'థగ్ లైఫ్' హిందీలో రూ.5 కోట్ల వసూళ్లు సాధించడం కూడా కష్టమేనని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

ఈ నెల 5న ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎక్స్‌పెక్టేషన్స్‌కు అనుకున్నంతగా రీచ్ కాలేదనే టాక్ వినిపిస్తోంది. కన్నడ భాషపై కమల్ కామెంట్స్‌తో కర్ణాటకలో ఈ మూవీ రిలీజ్ చేయలేదు. అది కూడా కలెక్షన్స్ తగ్గేందుకు ఓ కారణంగా చెప్పొచ్చు. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మూవీ థియేట్రికల్ రన్ అవుతోంది.

Also Read: ఇట్స్ అఫీషియల్... అల్లు అర్జున్ సినిమాలో దీపికా పదుకోన్... అట్లీ గట్టిగా ప్లాన్ చేశాడుగా

ఆ ఓటీటీలోకి..

ఈ మూవీలో కమల్ హాసన్‌తో పాటు శింబు కీలక పాత్ర పోషించారు. త్రిష, అభిరామి హీరోయిన్లుగా నటించగా.. నాజర్, అశోక్ సెల్వన్, తనికెళ్ల భరణి, నాజర్, మహేశ్ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటించారు. కమల్ హాసన్, మహేంద్రన్, మణిరత్నం నిర్మాతలుగా వ్యవహరించారు. సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' దాదాపు రూ.149 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్ అయిన 8 వారాల తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

స్టోరీ ఏంటంటే?

ఢిల్లీలో రంగరాయ శక్తిరాజు (కమల్ హాసన్) ఓ పెద్ద గ్యాంగ్ స్టర్. అతని మనుషులు జరిపిన కాల్పుల్లో అనుకోకుండా  ఓ పేపర్ బాయ్ ప్రాణాలు కోల్పోగా.. అతని కుమారుడు అమర్ (శింబు)ను చేరదీసి సొంత కొడుకులా పెంచుతాడు శక్తిరాజు. ఓ కేసులో జైలుకు వెళ్లే ముందు తన స్థానంలో అమర్‌కు బాధ్యతలు అప్పగిస్తాడు. ఇది గ్యాంగ్‌లో వివాదాలకు కారణమవుతుంది. జైలు నుంచి వచ్చిన వెంటనే శక్తిరాజ్‌పై అటాక్ జరుగుతుంది. ఈ క్రమంలో అమర్ మీద అనుమానం వ్యక్తం చేస్తాడు శక్తిరాజు. తండ్రీ కొడుకుల్లాంటి ఇద్దరి మధ్య వైరం ఎందుకు వచ్చింది? ఈ స్టోరీలో ఇంద్రాణి (త్రిష), లక్ష్మి (అభిరామి)ల పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.