Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి గదిలోనే ఉండిపోవడంతో సహస్ర ప్రశ్నిస్తుంది. వర్క్ ఉందని విహారి చెప్తాడు. సహస్ర మనసులో ఏం యాక్టింగ్ బావ గది బయట ఆదికేశవ్ అంకుల్ ఉన్నారని గది దాటడం లేదు.. నువ్వు ఆ లక్ష్మీని కలవకుండా చేయడమే నా పని.. మీ ఇద్దరినీ ఆదికేశవ్‌ అంకుల్‌కి పట్టించను కానీ ఆ లక్ష్మీ టెన్షన్ పడేలా చేస్తా అనుకుంటుంది. 

లక్ష్మీ వంట గదిలో వంట చేస్తుంటే గౌరీ భర్తకి కాఫీ ఇవ్వాలని ఎవరూ పని వాళ్లు కనిపించడం లేదని తానే వంట గదికి వెళ్తుంది. లక్ష్మీని పిలుస్తుంది. లక్ష్మీ విని అమ్మ వచ్చింది ఇంకేమైనా ఉందా అనుకుంటుంది. గౌరీ దగ్గరకు వెళ్తుంటే పండు వచ్చి ఎదురుగా నిల్చొంటాడు. నేను తీసుకొస్తా మీరు వెళ్లండి అమ్మా అంటాడు.  ఆ అమ్మాయి ఏంటి పిలిచినా పటకం లేదు అని గౌరీ అంటే తను కొత్తవాళ్లతో మాట్లాడదు అని పండు అంటాడు. గౌరీ లక్ష్మీ దగ్గరకు వెళ్లబోతే వసుధ వచ్చి అడ్డుకుంటుంది. లక్ష్మీ వసుధతో నా తలరాత ఏంటో కన్న తల్లిదండ్రులు కనిపిస్తే దాక్కోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదని అనుకుంటుంది. వసుధ లక్ష్మీని ఓదార్చుతుంది. 

పండు హాలో పని చేస్తుంటే ఆదికేశవ్ కిందకి వచ్చి పొద్దున్న పేపర్ చదవడం నాకు అలవాటు వస్తుందా అని అడిగి తీసుకెళ్తాడు. విహారి ఫ్రెండ్‌ సత్య విహారికి కాల్ చేసి మినిస్టర్ లక్ష్మీని పొడుగుతూ ఓ ఆర్టికల్ రాశాడు అది లక్ష్మీ తండ్రి చూస్తే ఇంకేమైనా ఉందా అంటాడు. మామయ్య పేపర్‌లో న్యూస్ చూస్తే ఇంకేమైనా ఉందా అని విహారి కంగారుగా పండుకి అడుగుతాడు. పండు లక్ష్మీమ్మ తండ్రి తీసుకెళ్తారు అంటే విహారి వెంటనే తీసుకురమ్మని చెప్తాడు. పండు పరుగున వెళ్లి పేపర్ చదువుతున్న ఆదికేశవ్ లక్ష్మీ పేపర్ చూడకుండా ఆపేస్తాడు. పద్మాక్షిమ్మ పేపర్ అడిగిందని కంగారుగా పట్టుకెళ్లిపోతాడు. 

పండు పేపర్ తీసుకొని వస్తుంటే యమున అడిగి తీసుకొని చూస్తుంది. లక్ష్మీ గురించి వచ్చిన యాడ్ చూసి యమున చాలా సంతోషపడుతుంది. విహారికి సంతోషంగా చెప్తుంది. యమున లక్ష్మీ అని పిలుస్తుంది. ఆదికేశవ్ గౌరీతో మనకు పిలుస్తున్నాడేమో అంటే మనకు కాదు అని గౌరీ అంటుంది. యమున అందర్ని పిలుస్తుంది. అంబిక యమునతో లక్ష్మీకి పేపర్‌లో కంటే ఎక్కువ ప్రచారం మన ఇంట్లోనే ఇస్తున్నారని అంటుంది.   సహస్ర అందర్ని టిఫెన్‌కి పిలవమని ఆదికేశవ్ వాళ్లని కూడా పిలవమని చెప్తుంది. వాళ్లని మనతో పాటు పిలవడం ఏంటి అని పద్మాక్షి అంటే వాళ్లు నా గెస్ట్‌లు అని అంటుంది. ఆదికేశవ్‌ కిందకి వస్తుంటే పండు టిఫెన్ గదికి తీసుకొస్తాడు. ఆదికేశవ్‌ వాళ్లు కిందకి వచ్చి అందరితో పాటు కలిసి తింటామని అంటారు. ఆదికేశవ్ వాళ్లు కిందకి వస్తారు. 

ఆదికేశవ్ వాళ్లని చూసి లక్ష్మీ, విహారి ముఖం దాచుకుంటారు. చాలా కంగారు పడతారు. వాళ్లు కిందకి వచ్చేటైంకి సహస్ర ఆపి మీతో మాట్లాడాలి చిన్న డౌట్ ఉంది ఒక్క  5 నిమిషాలు పైకి వెళ్దామా అని మీదకు తీసుకెళ్తుంది. గౌరీ కాఫీ తీసుకొస్తూ కాలు బెనుకుతుంది. ఆదికేశవ్ గౌరీని కూర్చొపెట్టి సేవలు చేస్తాడు. హాస్పిటల్‌కి ఒక్కడినే వెళ్తానని అంటాడు. విహారి లక్ష్మీని తీసుకొని ఆదికేశవ్ వాళ్లు చూడకుండా బయటకు వెళ్తాడు. ఇద్దరూ చాలా టెన్షన్ పడతారు. లక్ష్మీ విహారికి సారీ చెప్తుంది. తన వల్లే అంతా అయింది అంటే విహారి నిజం తెలిస్తే తెలియని ఏం కాదులే నేనే చెప్పేస్తా అంటాడు. లక్ష్మీ వద్దని అంటుంది. ఇక ఆదికేశవ్ ఆటోలో ఉంటారు.  పక్కనే విహారి వాళ్లు కారులో ఉంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: రాఘవ కొడుకే ఆనంద్.. రుక్మిణి, ఆనంద్‌ల ప్రేమ కథ వెనక పెద్ద కథే ఉందిగా!