టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై నెటిజన్లు మండిపడుతున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి వన్డే ప్రారంభానికి ముందు జాతీయ గీతం పాడుతున్నప్పుడు కోహ్లీ చేసిన పనికి సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలని కోహ్లీకి సూచిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డే ముందు జాతీయ గీతాలపన సమయంలో కోహ్లీ చూయింగ్ గమ్ నములుతూ కనిపించాడు. కోహ్లీ చేసిన పని అభిమానులను తీవ్రంగా కలిచి వేసింది. తోటీ ఆటగాళ్లు జాతీయ గీతం పాడుతుంటే కోహ్లీ మాత్రం చూయింగ్​గమ్​నములుతున్నాడు. ఈ వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. 










Also Read: పరాజయం పరిపూర్ణం... సిరీస్ వైట్ వాష్ చేసిన దక్షిణాఫ్రికా.. చాహర్ పోరాటం సరిపోలేదు!


ఇండియా తరఫున ఆడటం ఇష్టం లేకపోతే తప్పుకోవాలని నెటిజన్లు కోహ్లీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ ఇలా చేయడానికి బీసీసీఐ తన పట్ల వ్యవహరిస్తున్న తీరే కారణమని మరో కొందరు కామెంట్లు పెడుతున్నారు. అందుకే విరాట్ ఇలా ప్రవర్తించాడని అభిప్రాయపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విరాట్​కోహ్లీ ఇలా ప్రవర్తించడంతో అభిమానులు ఆశ్చర్యానికి లోనయ్యారు. 






నెట్టింట రచ్చ
విరాట్ కోహ్లీపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. కోహ్లీ ప్రవర్తన అసలు బాగోలేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నందున కోహ్లీ తీవ్ర నిరాశలో ఉన్నాడని అంటున్నారు. జాతీయ గీతం ఆలపించే సమయంలో అలాంటి ప్రవర్తన తగదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై ప్రస్తుతం సోషల్‌మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో టీమ్ ఇండియా కెప్టెన్సీకి ఇటీవల కోహ్లీ గుడ్ బై చెప్పాడు. అతడు జట్టులో ఓ బ్యాటర్ గా మాత్రమే కొనసాగుతున్నాడు. మైదానంలో ఎప్పుడూ చాలా ఫైర్ మీద ఉండే కోహ్లీ ఇప్పుడు కొంచెం నెమ్మదించాడు. బీసీసీఐ నిర్ణయాల వల్లే కోహ్లీ ఇలా మారడాని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. గంగూలీ, జై షా... కోహ్లీని జట్టు నుంచి తప్పిస్తామని వార్నింగ్‌ ఇచ్చారని అందుకే కోహ్లి ఇలా వ్యవహరిస్తున్నాడని ఊహాగానాలు వస్తున్నాయి.


Also Read: క్లీన్‌స్వీప్ ఓటమి మాకు కనువిప్పు.. టీమిండియా దారుణ వైఫల్యంపై హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఏమన్నాడంటే..!