By: ABP Desam | Updated at : 14 Feb 2023 05:59 PM (IST)
Edited By: nagavarapu
కోహ్లీ పఠాన్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన షారుఖ్ ఖాన్
Kohli's Pathaan Step Viral: బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ప్రస్తుతం పఠాన్ మూవీ విజయోత్సాహంలో ఉన్నాడు. తను ఇటీవల నటించిన పఠాన్ సినిమా బాక్సీఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. రికార్డులు బద్దలుకొడుతోంది. ఇదిలా ఉంటే షారుఖ్ ఖాన్ ఎల్లప్పుడూ తన అభిమానులకు అందుబాటులో ఉంటాడు. సోషల్ మీడియాలో ఆస్క్ ఎస్ ఆర్కే పేరుతో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటాడు. తన ప్రాజెక్టులు, సహ నటుల గురించి అభిమానులతో పంచుకుంటుంటాడు. అలాగే వారు అడిగే సిల్లీ ప్రశ్నలకు అంతే చమత్కారంగా సమాధానాలు ఇచ్చి ఆకట్టుకుంటాడు. ఇప్పుడు షారుఖ్.. కోహ్లీ, జడేజాలు చేసిన డ్యాన్స్ వీడియోపై స్పందించాడు. అది ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇంతకీ ఆ డ్యాన్స్ వీడియో ఏంటో తెలుసా..
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో ఉన్నారు. ఆసీస్ తో తొలి టెస్ట్ సందర్భంగా కోహ్లీ.. షారుఖ్ 'పఠాన్' మూవీలోని 'జూమ్ జో పఠాన్' పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. జడేజా కూడా కోహ్లీతో పాటు కాలు కదిపాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోపై స్పందించమని అభిమానులు అడిగిన ప్రశ్నకు కింగ్ ఖాన్ స్పందించాడు. వారిద్దరి డ్యాన్స్ మూమెంట్స్ పై షారుఖ్ ప్రశంసలు కురిపించాడు. ఆ డ్యాన్స్ వీడియోను రీట్వీట్ చేస్తూ.. 'వారు నాకంటే బాగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇది విరాట్, జడేజా నుంచి మనం నేర్చుకోవాలి.' అని కామెంట్ పెట్టాడు. ఇప్పుడు దీన్ని షారుఖ్ అభిమానులు వైరల్ చేస్తున్నారు.
పఠాన్ మూవీ గురించి
సిద్ధార్ధం ఆనంద్ దర్శకత్వం వహించిన స్పై యాక్షన్ చిత్రం పఠాన్. ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించగా.. జాన్ అబ్రహాం కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. వరుస పరాజయాల్లో ఉన్న షారుఖ్ కు ఈ చిత్రం కొత్త ఊపిరినిచ్చింది. ఇందులోని పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి.
తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా
‘పఠాన్’ విడుదలైన తొలి రోజునే కలెక్షన్ల సునామీ సృష్టించింది. దేశీయంగా తొలి రోజు రూ. 55 కోట్ల వసూళ్లతో బాలీవుడ్ హైహెస్ట్ ఓపెన్ గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లు సాధించింది అబ్బురపరిచింది. రూ.44.97 కోట్లతో షారుఖ్ –దీపిక నటించి ‘హ్యాపీ న్యూ ఇయర్’ రెండో స్థానంలో ఉంది. జాన్ అబ్రహం నటించిన ‘సత్యమేవ జయతే-2’ రూ. 19.50 కోట్లు సాధించి మూడో స్థానంలో కొనసాగుతోంది.
బైకాల్ సరస్సులో చిత్రీకరించిన తొలి భారతీయ సినిమా
సైబీరియాలో గడ్డకట్టిన బైకాల్ సరస్సు దగ్గర చిత్రీకరించబడిన మొదటి భారతీయ చిత్రం ‘పఠాన్’. ఎత్తైన సరస్సు దగ్గర సన్నివేశాలను చిత్రీకరించడానికి మాస్కో నుండి ప్రత్యేక పరికరాలను కొనుగోలు చేసినట్లు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ వెల్లడించారు. అటు స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్, ఇటలీ, యుఎఇ, ఆఫ్ఘనిస్తాన్, ఇండియాలలో ఈ మూవీ షూటింగ్ కొనసాగింది.
They are doing it better than me!! Will have to learn it from Virat And Jadeja!!! https://t.co/q1aCmZByDu
— Shah Rukh Khan (@iamsrk) February 14, 2023
Pathan.....🇮🇳💖💖 pic.twitter.com/QajRS34UpW
— The_anuj_goswami 🇮🇳 (@GoswamiPro) February 5, 2023
Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్
Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?
Chiranjeevi Cancer : నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను - మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు
Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?
Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?
Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!
Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?