అక్కినేని నట వారసుడిగా సినిమాల్లో అడుగుపెట్టాడు నాగచైతన్య. ఆ వంశంలో మూడో తరం హీరోలు చైతూ, అఖిల్. వారిద్దరి సినిమాలు తండ్రి నాగార్జున విని చేయాలో తుదినిర్ణయం తీసుకుంటారని అభిమానులు భావించే వారు. కానీ అది నిజం కాదు అంటున్నాడు నాగ చైతన్య. సినిమాలు చేసే నాన్న ప్రమేయం ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు మాత్రం పూర్తిగా నా విచక్షణ తోనే నిర్ణయం తీసుకుంటున్నాని తెలిపాడు. ఆయన ఈ మధ్య ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నాడు. గైడెన్స్ విషయంలో తన తండ్రి నాగార్జున ఎప్పుడూ అంగా ఉంటాడని చెప్పుకొచ్చాడు.
నాగచైతన్య 2009లో జోష్ సినిమాతో తెరంగేట్రం చేశాడు. అందులో కార్తీక హీరోయిన్ గా చేసింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. 2010లో చేసిన ఏ మాయ చేశావే సినిమా పెద్ద హిట్ కొట్టింది. అదే ఏడాది విడుదలై 100 పర్సంట్ లవ్ కూడా భారీ విజయం సాధించడంతో చైతూ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తరువాత చేసిన తడాఖా, ఆటోనగర్ సూర్య, సాహసం శ్వాసగా సాగిపో, యుద్ధం శరణం... ఇలా చాలా సినిమాలు థియేటర్ దగ్గర బోల్తా పడ్డాయి. కానీ చైతూ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం అతను నటించిన లవ్ స్టోరీ సినిమా విడులవ్వబోతోంది. ఇందులో సాయి పల్లవితో తొలిసారి నటించాడు. ఈ సినిమాపై చాలా అంచాలు పెట్టుకున్నాడు చైతూ.
చైతూ నేరుగా బాలీవుడ్ లో తొలిసినిమా చేస్తున్నాడు. అమీర్ ఖాన్, కరీనా కపూర్ లు ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న ‘లాల్ సింగ్ చద్ధా’లో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమా ఏడాది క్రిస్మస్ కు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాతో పాటూ తెలుగులో బంగార్రాజు, థ్యాంక్యూ సినిమాలలో కూడా నటిస్తున్నాడు. బిజీగా ఉండే హీరోలలో చైతూ కూడా ఒకరు.
Also read: బర్త్ డే బేబీ ప్రియా ఆనంద్ అందాల విందు
Also read: Empty stomach: ఖాళీ పొట్టతో ఈ పనులు చేయద్దు...
Also read: సరిగా వండని అన్నం తింటే క్యాన్సర్ ముప్పు... ఇలా వండితే సేఫ్
Also read: పచ్చి ఉల్లిపాయతో ఆ రోగానికి చెక్ పెట్టొచ్చు
Also read: అధికంగా జుట్టు రాలుతోందా... ఇవి ట్రై చేయండి
Also read: ఈ నల్లకోడి ప్రత్యేకతలు తెలిస్తే.. తప్పకుండా గుటకలు వేస్తారు