ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు... ఎందుకలా అంటారో ఎప్పుడైనా ఆలోచించారా? ఉల్లిపాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు కూడా ఆ నానుడి నిజమే అని ఒప్పుకుంటారు. రోజూ బ్రేక్ ఫాస్ట్ లోనో లేదా రాత్రి అన్నంలోనో పచ్చి ఉల్లిపాయ తినడం అలవాటుగా మార్చుకోండి. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. 


ఉల్లిపాయ లేని కూరను ఊహించలేం. తెలుగు వారి కూరల్లో ఉల్లిపాయ కచ్చితంగా ఉండాల్సిందే. కూరలో వేసిన ఉల్లిపాయ కన్నా పచ్చి ఉల్లిపాయను తింటేనే చాలా ఆరోగ్యం. వీటిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. పెరుగన్నంతో పాటూ పచ్చి ఉల్లిపాయ తినడం అలవాటు చేసుకుంటే మరీ మంచిది.  


డయాబెటిస్ ఉన్న వారికి ఉల్లిపాయ చాలా మేలు చేస్తుంది. డయాబెటిస్ లేని వారికి కూడా ఉల్లిపాయ తరచూ తింటే ఆ రోగం వచ్చే అవకాశాలు తగ్గుతాయి. కొరియాకు చెందిన  శాస్త్రవేత్తలు ఉల్లిపాయ మధుమేహు రోగులకు ఎలా మంచి చేస్తుందో తెలుసుకునేందుకు పరిశోధన చేశారు. అందులో ఉల్లిపాయలో ఉండే ఫ్లేవనాయిడ్స్ రక్తంలోని షుగర్ స్థాయులను క్రమబద్దీకరిస్తాయని బయటపడింది. దీని వల్ల హఠాత్తుగా షుగర్ లెవెల్స్ పెరగడం వంటివి జరుగవు. 


ఉల్లిపాయలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. కాబట్టి క్యాన్సర్ వంటి రోగాలు దరిచేరవు. వీటిని తినేప్పుడు దంతాల్లోని ఇన్ఫెక్షన్ కూడా దూరమవుతుంది. క్రిములు నాశనం అవుతాయి. శరీరంలోని వేడిని తగ్గించి ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. ఉల్లిపాయ రక్తంలోని కొవ్వు శాతాన్ని తగ్గించి రక్తపోటును నియంత్రిస్తుంది. 


ఉల్లిపాయ ముక్కలుగా కోసి నీటిలో మరిగించి, ఆ నీటిని తాగితే మూత్రంలో మంట తగ్గుతుంది. పచ్చిఉల్లిపాయ తింటే మహిళల్లో రుతుక్రమం సమస్యలు కూడా చాలా తగ్గుతాయి. 


పురుషుల్లో వీర్య కణాల సంఖ్యని పెంచేందుకు ఉల్లిపాయ సహకరిస్తుంది. దీన్ని రోజూ తినడం అలవాటు చేసుకుంటే గుండెపోటు, అలర్జీలు, దగ్గు, జలుబు, ఊబకాయం, నిద్రలేమి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందచ్చు. 


మూడు టీస్పూన్ల పచ్చి ఉల్లిపాయ రసాన్ని రోజులో రెండు సార్లు, మూడు నెలల పాటూ తాగితే కిడ్నీల నొప్పి, పొత్తికడుపు నొప్పి, కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుంది. 


కొందరికి నిత్యం నీరసంగా అనిపిస్తుంది. అలాంటివారు ఉల్లిపాయ రసంలో, నెయ్యిని కలిపి తీసుకుంటే బలహీనత దూరమవుతుంది. చురుగ్గా ఉంటారు. 


రుతుక్రమం కొందరిలో సరిగా అవ్వదు. అలాంటి మహిళలు రోజూ ఉల్లిపాయ తినడం అలవాటు చేసుకోవాలి. రుతుక్రమ సమస్యలను ఉల్లిలోని గుణాలు దూరం చేస్తాయి. 


Also read: సరిగా వండని అన్నం తింటే క్యాన్సర్ ముప్పు... ఇలా వండితే సేఫ్
Also read: అధికంగా జుట్టు రాలుతోందా... ఇవి ట్రై చేయండి
Also read: ఈ నల్లకోడి ప్రత్యేకతలు తెలిస్తే.. తప్పకుండా గుటకలు వేస్తారు