రాత్రి తిన్నాక ఉదయం మళ్లీ ఏదో ఒకటి పొట్టలో పడేవరకు కనీసం తొమ్మిది నుంచి పది గంటల గ్యాప్ ఉంటుంది. ఉదయం లేచేసరికి ఖాళీ పొట్టతో మొదట ఏం తినాలి? ఎలాంటి ఆహారపదార్థాలతో రోజు మొదలుపెడితే మంచిది? ఏ పనులకు దూరంగా ఉంటే ఆ రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది? ఈ విషయాల్ని సెలెబ్రిటీ న్యూట్రిషనిస్టు పూజా మఖీజా పంచుకుంటున్నారు. 


1. కాఫీ శరీరానికి మేలు చేస్తుంది. కానీ ఖాళీ పొట్టతో కాఫీ, టీలు తాగడం మంచి అలవాటు కాదు. అందులోనూ కెఫీన్ అధికంగా ఉండే కాఫీ ఖాళీ పొట్టలోకి చేరడం చిన్న నష్టం కూడా ఉంది. ఎసిడిటీ సమస్య పెరిగిపోతుంది. కెఫీన్ పొట్టలో హైడ్రోక్లోరిక్ ఆమ్లాం ఎక్కువ ఉత్పత్తి అయ్యేలా ప్రేరేపిస్తుంది. కనుక గ్లాసుడు నీళ్లు తాగాక కాఫీ తాగండి. 


2. బీర్, వైన్ లాంటివి ఉదయాన ఖాళీ పొట్టతో మొదలుపెట్టేయకూడదు. ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. ఇవి రక్తంలో చేరాక త్వరగా శరీరమంతా పాకేస్తాయి.  దీని వల్ల పల్స్ రేటులో తాత్కాలిక తగ్గుదల, రక్తపోటు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది పొట్ట, కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం పై ప్రభావం పడుతుంది. ఆల్కహాల్ తాగిన కేవలం నిమిషం లోపలే ఈ ప్రక్రియ మొత్తం మొదలైపోతుంది. కనుక ఖాళీ కడుపుతో ఇలాంటి పానీయాలు తీసుకోకూడదు. 


3. చాలా మంది ఉదయాన జాగింగ్ కు వెళ్లారు. జాగింగ్ చేస్తూ చూయింగ్ గమ్ లు నములుతారు. ఇలా పొట్టలో ఏమీ లేకుండా, ఇలా చూయింగ్ గమ్ నమలడం వల్ల జీర్ణ వ్యవస్థలో ఆమ్లం అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఆ ఆమ్లం పొట్టలోని పైపొరకు నష్టం కలిగిస్తతుంది. అల్సర్ గా కూడా మారొచ్చు. 


4. ఖాళీ పొట్టతో ఎప్పుడూ షాపింగ్ చేయకండి. కార్నెల్స్ యూనివర్సిటీ వారి అధ్యయనాల ప్రకారం ఏమీ తినకుండా షాపింగ్ కు వెళితే హై కెలరీ ఫుడ్, జంక్ ఫుడ్ ను ఎక్కువగా కొనే అవకాశం ఉంటుంది. 


5. మరో ముఖ్యమైన విషయం ఆకలిగా ఉన్నప్పుడు ఎవరితోనూ వాదనకు దిగకండి.  వాదనయ్యే పరిస్థితి ఉంటే అక్కడ్నించి వెళ్లిపోవాలి. ఖాళీ పొట్టతో కోపం పెరుగుతుంది. 


ఖాళీ పొట్టతో పై పనులేవీ చేయకండి. ఇవి చిన్నవిషయాలే కావచ్చు, ఆరోగ్యకరమైన జీవనానికి ఇవన్నీ బాటలు వేస్తాయి. 


Also read: అధికంగా జుట్టు రాలుతోందా... ఇవి ట్రై చేయండి
Also read: సరిగా వండని అన్నం తింటే క్యాన్సర్ ముప్పు... ఇలా వండితే సేఫ్
Also read:పచ్చి ఉల్లిపాయతో ఆ రోగానికి చెక్ పెట్టొచ్చు