Katrina Kaif Vicky Kaushal Wedding LIVE Updates: కొత్త జీవితంలో అడుగు పెట్టిన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్
Katrina Kaif Vicky Kaushal Wedding LIVE Updates: కొత్త జీవితంలో అడుగు పెట్టిన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్
Advertisement
రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా హోటల్‌లో విక్కీ కౌశల్ , కత్రినా కైఫ్ వివాహం వైభవంగా సాగుతోంది. బాలీవుడ్ ప్రముఖులు వచ్చి కొంత జంటను ఆశీర్వదిస్తున్నారు.
కొత్త జీవితంలో అడుగు పెట్టిన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్
బాలీవుడ్ యాక్టర్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ లో వీళ్లిద్దరి మ్యారేజ్ వైభవంగా జరిగింది. వివాహం అనంతరం కొత్త జంట హహోటల్ నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వివాహ వేడుకకు సన్నిహుతులను క్లోజ్ ఫ్రెండ్స్‌ను మాత్రమే పిలిచారు.
రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో బాలీవుడ్ తారలు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వివాహ వేడుక వైభవంగా సాగుతోంది. ఈ జంట తమ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఇరు సంప్రదాయాల్లో వివాహం చేసుకోనున్నారు. ఛాయాచిత్రకారుడు మానవ్ మంగ్లానీ కత్రినా వధువుగా ఉన్న మొదటి చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో బాలీవుడ్ తారలు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వివాహ వేడుక వైభవంగా సాగుతోంది. ఈ జంట తమ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఇరు సంప్రదాయాల్లో వివాహం చేసుకోనున్నారు. ఛాయాచిత్రకారుడు మానవ్ మంగ్లానీ కత్రినా వధువుగా ఉన్న మొదటి చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
పింక్‌విల్లాలో కత్రినా, విక్కీ జంట తమ సంగీత కేక్ కోసం రూ. 4.5 లక్షలు ఖర్చు చేశారని తెలుస్తోంది. వారు తమ వివాహానికి ముందు జరిగే ఫంక్షన్ కోసం భారీ కేక్ రెడీ చేశారని... ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ సంస్థకు దీని డిజైన్ బాధ్యత అప్పగించినట్టు తెలుస్తోంది.
Katrina Kaif Vicky Kaushal Wedding LIVE Updates: విక్కీ, కత్రినా వివాహ వేడుకలు కాసేపట్లో ప్రారంభం
విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి కోసం ప్రత్యేకంగా రూపొందించిన మండపం సిద్ధమైంది. మండపాన్ని పూలతో అందంగా అలంకరించారు. సుందరమైన మండపంలో కత్రినా, విక్కీ కౌశల్ కొత్త జీవితంలోకి అడుగు పెట్టనున్నారు.
Katrina Kaif Vicky Kaushal Wedding LIVE Updates: మరో పది నిమిషాల్లో పెళ్లి వేడుక
విక్కీ-కత్రినా పెళ్లిలో వధువు ఎరుపు రంగు పెళ్లి దుస్తులను ధరించగా ఆమె ప్రియుడు విక్కీ కౌశల్ తెల్లటి షెర్వానీ మెరిపోయాడు. మరో 10 నిమిషాల్లో ఈ సెలబ్రిటీ కపుల్ పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయని.
ఇవాళ (డిసెంబర్ 9) కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన వేడుకలు జోరుగా సాగుతున్నాయి. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్ జిల్లాలోని సుందరమైన సిక్స్ సెన్సెస్ హోటల్ ఫోర్ట్ బర్వారాలో వివాహం జరగనుంది. ఈ జంట తమ రెండు సంప్రదాయాలను గౌరవిస్తూ రెండు విధాలుగా వివాహం చేసుకుంటారని తెలుస్తోంది. పంజాబీ స్టైల్ వెడ్డింగ్ మధ్యాహ్నం పూర్తైంది. విక్కీ, కత్రినా మధ్యాహ్నం 3.30 నుంచి 3.45 గంటల మధ్య ఫెరాలను తీసుకున్నారు.
విలాసవంతమైన ప్రాంగణంలో వివాహ వేడుకలు జరుగుతున్నాయి. బాలీవుడ్ ప్రముఖులు వస్తున్న వేడుక వేదిక వద్ద పోలీసులు కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కోట ప్రవేశద్వారం వద్ద బారికేడ్‌లు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ సెక్యూరిటీతోపాటు పోలీసు అధికారులను ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు.