తెలుగు, తమిళ, హిందీ భాషలకు చెందిన చిత్రసీమలో ఇవాళ ఏం జరిగాయి? టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్డేట్స్ ఏంటి? అనేది ఒక్కసారి చూడండి


'జయం' రవి విడాకుల వ్యవహారంలో కొత్త ట్విస్ట్... భార్య సంచలన ప్రకటన
భార్య ఆర్తి, తాను విడిపోయినట్టు కోలీవుడ్ స్టార్ 'జయం' రవి చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఆయనొక లెటర్ విడుదల చేశారు. ఆ విడాకుల వ్యవహారంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తనను సంప్రదించకుండా 'జయం' రవి విడాకుల ప్రకటన చేశారని ఆర్తి రవి మరొక లేఖ విడుదల చేశారు. 


''నాకు తెలియకుండా విడాకుల గురించి ప్రకటించారు. అది తెలిసి నేను షాకయ్యా. ఎంతో బాధపడ్డా. మేం 18 ఏళ్లుగా కలిసి ఉంటున్నాం. విడాకుల విషయంలో నా నుంచి అనుమతి తీసుకోలేదు. కొంత కాలంగా మా మధ్య మనస్పర్థలు ఉన్నాయి. నేరుగా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని అనుకున్నా. నా భర్తతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా. కానీ, నాకు ఆ అవకాశం దొరకలేదు'' అని ఆర్తి పేర్కొన్నారు. (పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి)


బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న మలైకా ఆరోరా తండ్రి
బాలీవుడ్ భామ మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. ముంబై నగరంలోని బాంద్రా ఏరియాలో నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌ టెర్రస్ మీదకు వెళ్లి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సూసైడ్ లెటర్ ఏదీ కనిపించలేదని పోలీసుల నుంచి ప్రాథమిక సమాచారం అందుతోంది. (పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి)


శర్వా 37లో శాస్త్రీయ నృత్య కళాకారిణి దియాగా సంయుక్త... ఫస్ట్ లుక్ చూశారా?
శర్వానంద్ హీరోగా 'సామజవరగమన' దర్శకుడు రామ్ అబ్బరాజు ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. శర్వానంద్ 37వ చిత్రమిది. అందుకని శర్వా 37 అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో 'విరుపాక్ష', 'డెవిల్', 'బింబిసార' సినిమాల ఫేమ్ సంయుక్త ఓ కథానాయిక. ఇవాళ ఆమె బర్త్ డే కావడంతో మేకర్స్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. (ఆ లుక్ చూడటం కోసం, మరిన్ని వివరాల కొరకు ఈ లింక్ క్లిక్ చేయండి)



'జబర్దస్త్'కు కొత్త జడ్జి... కృష్ణభగవాన్ బదులు శివాజీ వచ్చాడోచ్ 
ఈటీవీలో పాపులర్ కామెడీ షో 'జబర్దస్త్'కి కొత్త జడ్జ్ వచ్చారు. నటుడు కృష్ణ భగవాన్ స్థానంలో హీరో శివాజీని తీసుకొచ్చారు. వచ్చీ రావడమే పంచ్ డైలాగులతో శివాజీ చెలరేగారు. 'జబర్దస్త్' కొత్త ప్రోమో, శివాజీ పంచ్ డైలాగ్స్ నెటిజనులను ఆకట్టుకున్నాయి. (ప్రోమో చూడటంతో పాటు మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి)


నిఖిల్ టీం ఫోన్ చేసి బెదిరించారు... సోనియా గ్యాంగ్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన బెజవాడ బేబక్క
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో మొదటి వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ బెజవాడ బేబక్క తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను బయటపెట్టింది. హౌజ్ లో కిచెన్ సెంటిమెంట్ తో పాటు, తాను చేసిన తప్పులను, ఓ గ్యాంగ్ అంతా కలిసి గేమ్ ఎలా ఆడుతున్నారు అనే విషయాలను, అలాగే నిఖిల్ టీమ్ నుంచి తనకు వచ్చిన బెదిరింపుల గురించి వెల్లడించింది. (పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి