Samantha Ruth Prabhu takes fans through a day in her life: సమంత నెట్టింట్లో తాజాగా ఓ రీల్ వీడియో షేర్ చేసింది. అందులో తాను చేసే డైలీ రొటీన్ వర్కౌట్లు, అలాగే ప్రతి రోజూ చేసే పనులు, తీసుకునే కేరింగ్ గురించి చూపించింది. రోజూ ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు చేసే పనులు అన్నిటి గురించి చెప్పేసింది. ఇది చూస్తే... సమంత ఎంత బిజీగా ఉందో? ఎంత కష్టపడుతుందో? అని అర్థం అవుతుంది. ఇప్పుడు సమంత మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకున్నట్టుగానే కనిపిస్తోంది. మళ్లీ మునుపటిలా సమంత ఫుల్ యాక్టివ్ అయిపోయింది.

కరోనా తరువాత సమంత రూత్ ప్రభు జీవితం పూర్తిగా మారిపోయింది. విడాకులు ఓ పక్క... మయోసైటిస్‌తో మంచాన పడటం మరో పక్క... సినిమాలకు దూరంగా ఉండటం ఇంకో పక్క... ఆరోగ్యాన్ని చక్కదిద్దుకోవడం... అంటూ ఇలా సమంత అనేక సమస్యల్ని ఎదుర్కొంది. తనకు అంతగా బాగా లేకపోయినా కూడా కష్టపడి బయటకు వచ్చి తన 'యశోద', 'శాకుంతల' సినిమాలను ప్రమోట్ చేసుకుంది. ఎలాగోలా శక్తిని కూడగట్టుకుని తన కమిట్మెంట్లైన 'ఖుషి', సిటాడెల్‌' వెబ్ సిరీస్‌లను పూర్తి చేసింది.




ఆ తరువాత సమంత పూర్తిగా రెస్ట్ మోడ్‌లోకి వెళ్లింది. ఎన్నో ప్రదేశాలు, విదేశాలు తిరిగింది. ఎన్నో రకాల చికిత్స పద్దతుల్ని పాటించింది. చివరకు భూటాన్ వెళ్లి ప్రకృతి వైద్యాన్ని కూడా చేయించుకుంది. అలా సమంత అన్ని రకాలుగా ట్రై చేసి.. చివరకు మయోసైటిస్ నుంచి బయట పడింది. ఇప్పుడు సమంత మునుపటిలా బీస్ట్ మోడ్‌లోకి మారిపోయింది. హెవీ వర్కౌట్లు చేస్తోంది. బరువుల్ని ఎత్తేస్తోంది. పూర్తి ఫిట్‌గా మారినట్టు అందరికీ చూపించేస్తోంది.


Also Read: మలైకా ఆరోరా ఇంట విషాదం... బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహ్యత చేసుకున్న తండ్రి



ఇక తాజాగా సమంత తన డైలీ రొటీన్ వర్క్స్ గురించి చెప్పింది. ఉదయం ఆరున్నరకు సూర్య నమస్కారాలు చేస్తాన్ననట్టుగా చెప్పింది. సూర్యుడి ఎండలో కాసేపు అలా ఉంటుందట. ఆ తరువాత ఏడు గంటలకు వర్కౌట్లకు వెళ్తుందట. ఆ తరువాత ఫ్రెష్ అవుతుందట. దేవుడికి పూజ చేస్తుందట. తొమ్మిది గంటల లోపు సెట్స్ మీదకు వెళ్తుందట. ఆ వెళ్లే దారిలో కారులోనే ఐ కేర్ తీసుకుంటుందట.


సాయంత్రం వచ్చాక పికెల్ బాల్‌ను ఆడుతుందట.. ఆ తరువాత కొద్ది సేపు మెడిటేషన్ చేస్తుందట.. చివరకు పది వరకు బెడ్ ఎక్కాల్సిందే.. నిద్రపోవాల్సిందేనట. అలా సమంత తన హెల్త్ కేర్‌ను బాగానే తీసుకుంటూ.. ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.


Also Read: కొరటాల పక్కన సరైన వ్యక్తులు ఉంటే బ్లాక్ బస్టర్స్ ఇస్తాడు - మెగా ఫ్యాన్స్‌కు మంట పెట్టేలా ఎన్టీఆర్ మాటలు