బాలయ్య నటించిన భారీ సూపర్ హిట్ సినిమా అఖండ. అఘోరాగా బాలయ్య విశ్వరూపం చూపించారు మూవీలో. థియేటర్లు మళ్లీ కిటకిటలాడేలా చేసిన సినిమా ఇది. ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని చూస్తున్నారు అభిమానులంతా. ఇదిగో, అదిగో వస్తుందన్న పుకార్లే తప్ప, ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడు హాట్ స్టార్ తొలిసారిగా ఆ సినిమా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. జనవరి 21న అఖండ హాట్ స్టార్లో ప్రసారం కానున్నట్టు తెలిపింది. 


ఎంత పెట్టి కొన్నారు?
అఖండ, పుష్ప సినిమాలు డిసెంబర్లో విడుదలై వసూళ్ల సునామీ సృష్టించాయి. ఈ రెండు సినిమాలు అతిత్వరలో ఓటీటీ రాబోతున్నాయన్న టాక్ కూడా డిసెంబర్ చివరి వారానికే మొదలైపోయింది. దాన్ని నిజం చేస్తూ ఇప్పటికే పుష్ప ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. ఇక మిగిలింది అఖండ. ఇప్పుడు అఖండ కూడా హాట్ స్టార్ రిలీజ్ డేట్ వచ్చేసింది. అయితే అఖండ మూవీ హాట్ స్టార్ కొనుక్కుందన్న వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అందుకే ఓ బాలయ్య అభిమాని నేరుగా ట్విట్టర్లో హాట్ స్టార్‌నే ‘అఖండ మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది’ అని ప్రశ్నించాడు. దానికి హాట్ స్టార్ రిప్లయ్ ఇచ్చింది. ‘అఖండ 2022, జనవరి 21న ప్రీమియర్ అవుతుంది. మరిన్ని అప్‌డేట్‌ల కోసం వేచిఉండండి’ అని ట్వీట్ చేసింది. దీంతో బాలయ్య అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమాను దాదాపు రూ.20 కోట్లతో హాట్ స్టార్ దక్కించుకుంది. 


బోయపాటి శ్రీను - బాలయ్య కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా అఖండ. ఇందులో విలన్‌గా శ్రీకాంత్ నటించాడు. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దుమ్మురేపింది. సినిమాకే హైలైట్‌గా నిలిచింది.



Also Read: సిరికి బ్రేకప్ చెప్పనున్న శ్రీహాన్? ఇన్స్‌స్టా నుంచి సిరి ఫోటోలను తొలగించిన ప్రియుడు


Also Read: దీప్తి బ్రేకప్ స్ట్రాటజీ.. సిరి బాయ్ ఫ్రెండ్ ఫాలో అవుతాడా..?