భారత స్టాక్ మార్కెట్లు సోమవారం పరుగులు తీశాయి. బీఎస్‌సీ సెన్సెక్స్ 500 పాయింట్లు లాభపడితే నిఫ్టీ 18000 పైన ముగిసింది. పవర్, మెటల్, ఆయిల్, గ్యాస్ స్టాక్స్ రాణించాయి. బ్యాంకు, ఫార్మాను పక్కనపెడితే మిగతా అన్ని రంగాల సూచీలు అదరగొట్టాయి.
కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉండటం, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోవడం, చమురు ధరలపై పన్నులు తగ్గడం, పీఎంఐ గణాంకాలు బాగుండటం, పండగ సీజన్లో విక్రయ గణాంకాలు పుంజుకోవడంతో మదుపర్లు కొనుగోళ్లకు దిగారు.
క్రితం సెషన్లో 60,067 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ సోమవారం 60,385 వద్ద ఆరంభమైంది. ఒకానొక దశలో 59,779 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం 60,609 వద్ద గరిష్ఠాన్ని అందుకున్న సూచీ 477 పాయింట్ల లాభంతో 60,545 వద్ద ముగిసింది. గ్యాప్ అప్‌తో నిఫ్టీ 18,040 వద్ద ఆరంభమైంది. 17,836 వద్ద కనిష్ఠాన్ని తాకి మధ్యా్‌హ్నం 18,087 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకొంది. చివరికి 151 పాయింట్ల లాభంతో 18,068 వద్ద ముగిసింది.
నిఫ్టీలో ఐవోసీ, టైటాన్, బజాజ్ ఫిన్‌సర్వ్,అల్ట్రా సెమ్‌కో షేర్లు నాలుగు శాతానికి పైగా లాభపడ్డాయి. టెక్ మహీంద్రా 3 శాతం లాభపడింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఏకంగా 10 శాతం నష్టపోయింది. దివీస్ ల్యాబ్, ఎంఅండ్‌ఎం, ఎస్‌బీఐ, హిందాల్కో నష్టాల్లో ముగిశాయి. సన్ నెట్‌వర్క్, వర్క్‌హట్ ఫలితాల్లో అదరగొట్టాయి.
Also Read: Multibagger Share: ఏడాదిలోనే లక్షకు రూ.18 లక్షల రాబడి ఇచ్చిన షేరు
Also Read: FD High Interest Rate: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా? ఈ బ్యాంకుల్లో 7 శాతం వడ్డీ ఇస్తున్నారు
Also Read: Provident Funds: ప్రావిడెంట్ ఫండ్స్ ఎన్ని రకాలు? ఎందులో దాచుకుంటే ఎంత డబ్బొస్తుందో తెలుసా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి