By: ABP Desam | Updated at : 14 Jul 2022 01:06 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఐటీఆర్ ఫైలింగ్ ( Image Source : Pixels )
ITR Filing FY 2021-22: ఆదాయపన్ను రిటర్ను ఫైలింగ్ తుది గడువు దగ్గరపడింది. 2021-22 ఆర్థిక సంవత్సరం ఐటీఆర్ ఫైల్ (ITR Filing) చేసేందుకు జులై 31 చివరి తేదీ. అయితే చాలామంది పన్ను చెల్లింపుదారులు ఫైల్ చేసేందుకు ఆఖరి క్షణాల వరకు వేచి చూస్తుంటారు. గత రెండేళ్లు తుది గడువును అనేకసార్లు పొడగించడంతో ఈసారీ అలాగే జరుగుతుందని మరికొందరు అంచనా వేస్తున్నారు. మరి నిపుణులు ఏమంటున్నారో చూద్దామా!!
కరోనా వైరస్ మహమ్మారి, ఆదాయపన్ను శాఖా (Income Tax New Portal) కొత్త వెబ్‌సైట్ ఆవిష్కరించడం, అందులో కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో రెండేళ్లుగా ఐటీఆర్ ఫైలింగ్ తుది గడువును చాలాసార్లు పొడగించారు. కాగా 2022, జులై 2న ఆదాయపన్ను శాఖా ఓ ట్వీట్ చేసింది. ఐటీఆర్ వెబ్‌సైట్‌కు (ITR Portal) అవాంఛిత ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ ఇన్ఫోసిస్ చురుగ్గా చర్యలు తీసుకుంటుందని తెలిపింది.
'ఐటీడీ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో పన్ను చెల్లింపుదారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం మా దృష్టికి వచ్చింది. టాక్స్ పోర్టల్‌కు అవాంఛిత ట్రాఫిక్ వస్తున్నట్టు ఇన్ఫోసిస్ గుర్తించింది. పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నారు. కొందరు యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నందుకు చింతిస్తున్నాం' అని ఐటీ శాఖ ట్వీట్ చేసింది.
ఈ ట్వీటును బట్టి ఐటీఆర్ తుది గడువును పొడగించే అవకాశం ఉందని సాగ్ ఇన్ఫోటెక్ ఎండీ అమిత్ గుప్తా అంచనా వేశారు. కొత్త వెబ్‌సైట్ ఆవిష్కరించిన ఏడాదిన్నర తర్వాతా సాంకేతిక ఇబ్బందులు రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. బహుశా యూజర్లు ముందుగానే ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ప్రయత్నిస్తుండటం ఇందుకు ఓ కారణం కావొచ్చని వెల్లడించారు. ఈ ఏడాది ఐటీఆర్ ఫారాలను ముందుగానే విడుదల చేయడంతో తుది గడువు పొడగింపు ఉండకపోవచ్చనీ అంటున్నారు. పోర్టల్ సతాయిస్తే మాత్రం పెంచక తప్పదని స్పష్టం చేశారు.
కోట్ల మంది పన్ను చెల్లింపు దారులు తక్కువ వ్యవధిలోనే ఐటీఆర్ ఫైల్ చేయడం కష్టమని గుప్తా సచ్‌దేవా కంపెనీ ప్రతినిధి గౌరవ్ గుంజన్ అంటున్నారు. నిజానికి 2020-21 ఏడాది తుది గడువును 2022, మార్చి 15 వరకూ పొడగించిన సంగతిని గుర్తు చేశారు. ఇన్‌కమ్ టాక్స్ గణాంకాల ప్రకారం మొత్తం టాక్స్ పేయర్లు 7.5 కోట్ల మందిలో 2022, జులై తొలి వారం వరకు కేవలం 99.20 లక్షల ఐటీఆర్‌లు మాత్రమే ఫైల్ చేశారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే 21 రోజుల్లో 6.5 కోట్ల ఐటీఆర్‌లు ఫైల్ చేయడం అసాధ్యమని అంచనా వేశారు.
స్మార్ట్ కూలింగ్, స్మార్టర్ సేవింగ్స్: బజాజ్ బ్లాక్ బస్టర్ ఈఎంఐ రోజులలో హిటాచి ఏసిలను కొనండి
Children Bank Account: పిల్లల బ్యాంక్ ఖాతా ఎలా ఓపెన్ చేయాలి ? ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి?
Tax Saving Tips: రూ.18 లక్షల జీతంపైనా "జీరో టాక్స్" - చట్టాన్ని మీ చుట్టం చేసుకోవచ్చు!
Multiple Credit Cards: ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే క్రెడిట్ స్కోర్ పెరుగుతుందా, తగ్గుతుందా?
Dividend: 17 నెలల పసివాడు సంపాదించిన డివిడెండ్ రూ.3.3 కోట్లు - ఎవరీ ఏకాగ్ర?
డేట్ ఫిక్స్ చెయ్, నీ బచ్చాగాళ్లు వద్దు, అసెంబ్లీలో చర్చకు నువ్వే రావాలి- కేసీఆర్‌కు మంత్రులు ఛాలెంజ్
PM Modi AP Tour: అమరావతిలో ప్రధాని రోడ్ షో రద్దు.. మోదీ పర్యటన లో స్వల్ప మార్పులు
KCR On Fire: తులం బంగారం ఏమైంది! పింఛన్ రూ.4 వేలు ఇస్తున్నారా? కాంగ్రెస్ హామీల అమలుపై కేసీఆర్ ప్రశ్నల వర్షం
IPL 2025 RCB VS DC Result Update: టాప్ లేపిన ఆర్సీబీ.. సీజన్ లో ఏడో విక్టరీ నమోదు.. ఫిఫ్టీలతో రాణించిన కోహ్లీ, క్రునాల్, చేతులెత్తేసిన ఢిల్లీ
Nani: మహాభారతంలో నాని ఫిక్స్... కన్ఫర్మ్ చేసిన రాజమౌళి