By: ABP Desam | Updated at : 21 Apr 2023 02:09 PM (IST)
సావరిన్ గోల్డ్ బాండ్‌లో పెట్టుబడి పెట్టి చూడండి
Sovereign Gold Bonds: అక్షయ తృతీయ రోజు కనీసం ఒక్క గ్రాము బంగారం అయినా కొంటే శుభం జరుగుతుందన్నది ఒక నమ్మకం. ఒకవేళ, మీరు ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని భావిస్తే, భౌతిక నగల రూపంలోనే కాకుండా, సావరిన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. తాజాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత నెల 14న వీటిని జారీ చేసింది. దీంతో పాటు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో SGBని (Sovereign Gold Bond) కొనుగోలు చేసే సౌకర్యాన్ని కూడా అందిస్తోంది.
సావరిన్ గోల్డ్ బాండ్ అంటే ఏంటి?
భౌతిక రూపంలో ఉండే బంగారపు వస్తువులను ఇంట్లో ఉంచుకోవడానికి ప్రజలు కాస్త సంకోచిస్తారు. దొంగల భయంతో నిద్ర పట్టదు. ఈ అనిశ్చితిని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే గోల్డ్ సావరిన్ బాండ్. కేంద్ర ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిని జారీ చేస్తుంది. బంగారంలో మదుపు చేయాలనుకనే వాళ్లు ఈ రూపంలో పెట్టుబడి పెట్టవచ్చు, గోల్డ్ బాండ్లను ఆర్‌బీఐ వద్ద భద్రంగా ఉంచుకోవచ్చు.
ఒక్కో గోల్డ్ బాండ్ కాల పరిమితి ఎనిమిది సంవత్సరాలు. అయితే గోల్డ్ బాండ్ హోల్డర్ కోరుకుంటే, ఈ బాండ్లను ఐదు సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా రిడీమ్ చేసుకోవచ్చు.
సావరిన్ గోల్డ్ బాండ్లను ఎలా కొనాలి?
సావరిన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయడం చాలా సులభం. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, పోస్టాఫీలు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజీల (NSE, BSE) ద్వారా దరఖాస్తు చేసుకుని SGBలను పొందవచ్చు.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
భారతదేశ నివాసితులు, ట్రస్ట్‌లు, HUFలు, స్వచ్ఛంద సంస్థలు సావరిన్ గోల్డ్ బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మైనర్ల తరఫున ఒక సంరక్షకుడు లేదా మరికొందరితో కలిసి ఉమ్మడిగా కూడా వీటిని కొనవచ్చు.
సావరిన్ గోల్డ్ బాండ్ల వల్ల ఏంటి లాభం?
SGBలపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి 2.50% ఫిక్స్‌డ్ రేటుతో (కూపన్ రేట్) వడ్డీ చెల్లిస్తారు. బాండ్ ఇష్యూ తేదీ నుంచి వడ్డీ రేటు లెక్కింపు ప్రారంభం అవుతుంది.
ఎంత బంగారం కొనవచ్చు?
గోల్డ్ బాండ్ ద్వారా కనీసం 1 గ్రాము బంగారాన్ని కొనాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక గ్రాము నుంచి 4 కిలోల వరకు వ్యక్తులు (individuals) కొనుక్కోవచ్చు. HUFలకు కూడా గరిష్ట పరిమితి 4 కిలోలు. ట్రస్టులు, ఆ తరహా సంస్థలకు గరిష్ట పరిమితి 20 కిలోలు.
గత మార్చిలో SGB విడుదలకు, ఇప్పటికి బంగారం ధరలు భారీగా పెరిగాయి. అప్పుడు ఒక్కో బాండ్‌ను రూ.5,611 కి (ఒక గ్రాముకు సమానం) RBI విడుదల చేసింది. 2015లో సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని రిజర్వ్ బ్యాంక్ ప్రారంభించింది. 2016లో SGB రేటు కనిష్ట స్థాయిలో ఉంది, అప్పటి బాండ్ ధర 2,600.
అయితే, ప్రస్తుతం పెరుగుతున్న ధరల దృష్ట్యా బంగారు బాండ్లలో పెట్టుబడి పెట్టడం కొంచెం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. గత సంవత్సరం నవంబర్ నెల నుంచి ఇప్పటి వరకు బంగారం ధరలు 23 శాతం (US డాలర్ ప్రకారం) పెరిగాయి.
Gold-Silver Prices Today 25 Mar: చల్లబడిన పసిడి మంట, తగ్గిన నగల రేట్లు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Jio Cloud Storage Offer: సుందర్ పిచాయ్‌తో ముకేష్ అంబానీ 'ఢీ' - గూగుల్‌పైకి జియో 'మేఘాస్త్రం'
Rupee Rise: వేగంగా బలపడుతున్న రూపాయి - విదేశాల్లో చదివే విద్యార్థులకు గొప్ప ఊరట
Income Tax: కొత్త పన్ను విధానం ఎంచుకునే వాళ్లకు PPF, SSY, NPS పెట్టుబడులు ప్రయోజనమేనా?
Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రత్యేక ఫార్ములా - యవ్వనం కంటే వృద్ధాప్యంలో ఎక్కువ సంపాదన!
SLBC Tunnel Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
LRS In Telangana: ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
Polavaram Banakacherla Interlinking Project : 81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు