By: ABP Desam | Updated at : 30 Dec 2023 09:26 AM (IST)
సుకన్య సమృద్ధి యోజన ఇన్వెస్టర్లకు న్యూ ఇయర్ గిఫ్ట్
Small Saving Schemes New Interest Rates: సుకన్య సమృద్ధి యోజనలో (SSY) డబ్బులు జమ చేసే ప్రజలకు, నూతన సంవత్సరం (Happy new year 2024) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మంచి గిఫ్ట్ ఇచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి (2024 జనవరి - మార్చి కాలం), ఈ పథకం వడ్డీ రేట్లను 8 శాతం నుంచి 8.2 శాతానికి (SSY new interest rate) పెంచింది.
3 సంవత్సరాల టర్మ్ డిపాజిట్లపైనా వడ్డీ రేటును 7 శాతం నుంచి 7.1 శాతానికి (New interest rate on 3 years term deposit) కేంద్ర ప్రభుత్వం పెంచింది. మిగిలిన చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లలో మాత్రం ఎలాంటి మార్పు లేదు, యథాతథంగా కొనసాగించింది. ముఖ్యంగా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పెట్టుబడిదార్లను మరోసారి నిరాశ పరిచింది.
రెండోసారి పెరిగిన సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు (Sukanya Samriddhi Yojana Interest Rate for Jan-Mar 2024)
ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక వ్యవహారాల విభాగం, 2023-24 నాలుగో త్రైమాసికానికి (Q4 FY24), చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను (small savings schemes) సమీక్షించి ప్రకటించింది. స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లో సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటును మార్చింది. బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తున్న పథకం ఇది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (2023 ఏప్రిల్-జూన్ కాలం) కూడా, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటును 7.6 శాతం నుంచి 8 శాతానికి మోదీ ప్రభుత్వం పెంచింది. ఈ లెక్కన, ఈ ఆర్థిక సంవత్సరంలో SSY వడ్డీ రేటును 0.60 శాతం పెంచింది.
వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేని పథకాలు
ఆర్థిక మంత్రిత్వ శాఖ సర్క్యులర్ ప్రకారం, 2024 జనవరి 1 నుంచి 2024 మార్చి 31 వరకు పొదుపు డిపాజిట్లపై 4 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. 1 సంవత్సరం టైమ్ డిపాజిట్‌పై 6.9 శాతం వడ్డీ, 2 సంవత్సరాల టైమ్ డిపాజిట్‌పై 7 శాతం వడ్డీ, 5 సంవత్సరాల టైమ్ డిపాజిట్‌పై 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లపై 6.7 శాతం వడ్డీ ఉంటుంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై వడ్డీ రేటు (NSC Interest rate) 7.7 శాతంగా కొనసాగుతోంది. కిసాన్ వికాస్ పత్రలో పెట్టుబడి పెట్టే వారికి 7.5 శాతం వడ్డీ (KVP Interest rate) ఇస్తారు, ఇది 115 నెలల్లో మెచ్యూర్ అవుతుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌పై 8.2 శాతం వడ్డీ (SCSS Interest rate) లభిస్తుంది. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ పథకంలో పెట్టుబడిపై 7.4 శాతం వడ్డీ (POMIS Interest rate) ఆదాయం వస్తుంది.
PPF ఇన్వెస్టర్లలో నిరాశ
స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌లో PPF (Public Provident Fund) బాగా పాపులర్ అయింది. దీని మెచ్యూరిటీ అమౌంట్‌కు ఆదాయ పన్ను వర్తించదు. ఈ స్కీమ్ వడ్డీ రేటు ఈసారి కూడా మారలేదు, దీనిపై గతంలోలాగే 7.1 శాతం వడ్డీ (PPF Interest rate) లభిస్తుంది. PPFపై వడ్డీ రేటును 2020 ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం మార్చలేదు.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Bima Sakhi: 'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్ - ఎలా అప్లై చేయాలి?
Silver ETFs: సిల్వర్ ఈటీఎఫ్‌లు, బంగారానికి పోటీగా లాభాలు - ఇలా పెట్టుబడి పెట్టండి
PAN 2.0 - Aadhaar: పాన్ 2.0 కార్డ్‌ను కూడా ఆధార్‌తో లింక్ చేయాలా, సర్కారు ఏం చెప్పింది?
Gold-Silver Prices Today 11 Dec: రూ.80,000 దగ్గరలో పసిడి, రూ.1,000 తగ్గిన వెండి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Gold-Silver Prices Today 10 Dec: అమాంతం పెరిగిన బంగారం, వెండి నగల రేట్లు - ఈ రోజు గోల్డ్, సిల్వర్ కొత్త ధరలు ఇవీ
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
AP 10th Class Exam Date 2025: ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
Kangana Ranaut: వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ? జిన్నా ఆ పేరును ఎప్పుడు ఆమోదించారు?