By: ABP Desam | Updated at : 16 Jan 2022 12:52 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఎస్‌బీఐ
ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త!! ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు బాటలోనే ఎస్‌బీఐ నడుస్తోంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. రూ.2 కోట్ల కన్నా తక్కువ మొత్తం, ఏడాది నుంచి రెండేళ్ల కన్నా తక్కువ కాల పరిమితితో కూడిన ఎఫ్‌డీలపై వడ్డీరేట్లను పది బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ప్రస్తుతం 5 శాతంగా ఉన్న ఈ వడ్డీరేటు- 5.1 శాతానికి పెరుగుతుంది. సీనియర్ సిటిజన్లకైతే 5.5 నుంచి 5.6 శాతానికి పెరుగుతుంది. జనవరి 15 నుంచి సవరించిన వడ్డీరేట్లు అమల్లోకి వచ్చాయి.
పరిస్థితులను గమనిస్తుంటే వడ్డీరేట్ల పెరుగుదల ట్రెండ్ మొదలైనట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఎస్‌బీఐ 2021, డిసెంబర్లోనే 10 బేసిస్ పాయింట్ల మేర వడ్డీని పెంచింది. కొత్త బేస్‌రేట్ వార్షిక ప్రాతిపదికన 7.55 శాతంగా ఉంది. దీంతో తక్కువ వడ్డీరేట్ల కాలం ముగిసినట్టేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇది రుణ గ్రహీతలకు బేస్‌రేట్‌గానూ పనిచేస్తుంది. ఆర్థిక వ్యవస్థలో మొత్తం వడ్డీరేట్ల దిశకు చిహ్నంగా పనిచేస్తుంది. బేస్ రేట్ పెరుగుతుందంటే తక్కువ వడ్డీరేట్ల ట్రెండ్ పోయినట్టేనని అంటున్నారు. రానురాను ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెరుగుతాయని పేర్కొన్నారు.
ఇంతకు ముందే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచిన సంగతి తెలిసిందే. 2021, జనవరి 12 నుంచి ఎంపిక చేసిన కాల పరిమితి ఎఫ్‌డీలకు ఇది వర్తించనుంది. రెండేళ్లకు మించి కాలపరిమితితో కూడిన రెండు కోట్ల రూపాయాల కన్నా తక్కువ ఎఫ్‌డీలకు వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.
Also Read: ఇంటి వద్దకే బ్యాంకు! ఒక్క లావాదేవీకి ఎంత తీసుకుంటారో తెలుసా!
Also Read: Condom Use: లాక్‌డౌన్‌లో సెక్స్ మర్చిపోయారో ఏంటో!! ప్రపంచంలో అతిపెద్ద కండోమ్ కంపెనీకి నష్టాల సెగ!!
Also Read: Budget 2022: టాక్స్ పేయర్లకు బడ్జెట్ కానుక!! పన్ను మినహాయింపు పరిమితి పెంచనున్న కేంద్రం!!
Also Read: Union Budget 2022: జనవరి 31 నుంచి బడ్జెట్! ఈ సారి పార్ట్1, పార్ట్2గా విభజన!
Also Read: Budget 2022: క్రిప్టో రాబడికి బడ్జెట్లో నిర్వచనం!! 42% IT, 18% GST వేయడం ఖాయమేనట!!
Also Read: Budget 2022: ఇళ్లు అమ్ముకుంటాం! వడ్డీరేట్లు, రెంటల్ ఇన్‌కంపై పన్ను తగ్గించండి మేడం!!
Our OTP based cash withdrawal system for transactions at SBI ATMs is vaccination against fraudsters. Protecting you from frauds will always be our topmost priority.#ATM #OTP #SafeWithSBI #TransactSafely #SBIATM #Withdrawal #AmritMahotsav #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/872Q0X4Wyv
— State Bank of India (@TheOfficialSBI) January 16, 2022
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?