By: ABP Desam | Updated at : 21 Nov 2023 12:28 PM (IST)
ఎస్‌బీఐ వికేర్ చివరి తేదీ పొడిగింపు
SBI Wecare Senior Citizen FD Scheme: సీనియర్ సిటిజన్స్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI FD schemes for senior citizens) తీసుకొచ్చిన స్పెషల్ స్కీమ్స్‌లో "ఎస్‌బీఐ వియ్‌కేర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్" ఒకటి. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టి, నిశ్చితంగా ఎక్కువ వడ్డీ ఆదాయం (SBI Wecare scheme interest rate 2023) సంపాదించాలనుకుంటే ఈ స్కీమ్ ఒక బెటర్ ఆప్షన్. ముందుగానే చెప్పినట్లు ఈ పథకం కేవలం సీనియర్ సిటిజన్ల (60 సంవత్సరాలు లేదా నిండినవాళ్లు) కోసం మాత్రమే. ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేయడానికి చివరి తేదీ ఇటీవలే ముగిస్తే, స్టేట్ బ్యాంక్ ఆ గడువును మరోమారు పెంచింది.
ఎస్‌బీఐ వికేర్ తాజా గడువు తేదీ (SBI Wecare FD last date)
2020 మే 20న, ఎస్‌బీఐ వికేర్ సీనియర్ సిటిజన్స్ ఎఫ్‌డీ స్కీమ్‌ను స్టేట్ బ్యాంక్ (SBI) తీసుకొచ్చింది. అదే ఏడాది సెప్టెంబర్ వరకే ఆ పథకాన్ని కొనసాగిస్తామని చెప్పింది. అయితే, ఆ తర్వాత దఫదఫాలుగా గడువును పెంచుకుంటూ వస్తోంది. తాజాగా, లాస్ట్ డేట్‌ను వచ్చే ఏడాది మార్చి 31 వరకు (31 March 2024) ఎక్స్‌టెండ్ చేసింది.
సీనియర్ సిటిజన్స్ కోసం, ముఖ్యంగా పదవీ విరమణ చేసిన వాళ్ల కోసం ప్రత్యేకంగా ఈ స్కీమ్‌ను స్టేట్ బ్యాంక్ డిజైన్ చేసింది. రిటైర్మెంట్ తర్వాత ఆదాయ భద్రతతో పాటు అధిక వడ్డీ ప్రయోజనాన్ని పొందవచ్చు.
వియ్‌కేర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ వడ్డీ రేటు (SBI Wecare FD interest rates 2023)
ఈ ప్రత్యేక FDలో కనీసం 5 సంవత్సరాల కాలానికి డిపాజిట్ చేయాలి. ఆ డిపాజిట్‌ను 5-10 సంవత్సరాల వరకు కొనసాగింవచ్చు. ఈ కాల వ్యవధిపై 7.50 శాతం వడ్డీని బ్యాంక్ చెల్లిస్తోంది. సాధారణ ప్రజలకు అందించే వడ్డీ రేటుకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు (0.50% ఎక్కువ వడ్డీ), కార్డ్ రేటు మీద మరో 50 బేసిస్ పాయింట్లు కలిపి, మొత్తం 100 బేసిస్ పాయింట్లను (1%) అదనంగా వియ్ కేర్ కింద ఎస్‌బీఐ అందిస్తోంది.
స్వయంగా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లిగానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా యోనో ద్వారా ఈ స్పెషల్ FD అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. రూ.2 కోట్ల వరకు ఈ స్కీమ్ కింద డిపాజిట్ చేయవచ్చు. కొత్తగా డిపాజిట్ చేసే వాళ్లు, ఇప్పటికే ఉన్న డిపాజిట్‌ను రెన్యువల్ చేసుకునే వాళ్లు ఈ వికేర్ స్కీమ్‌లో జాయిన్ కావచ్చు. 5 సంవత్సరాల కంటే ముందే డిపాజిట్‌ను వెనక్కు తీసుకుంటే నష్టపోవాల్సి వస్తుంది.
లోన్ కూడా ఇస్తారు (Loan on SBI Wecare FD scheme )
"ఎస్‌బీఐ వికేర్ సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్"లో పెట్టుబడి పెట్టిన వ్యక్తి, ఆ డిపాజిట్‌ను బ్యాంక్ వద్ద తనఖా పెట్టి లోన్ కూడా తీసుకోవచ్చు. ఆదాయ పన్ను విభాగం నిబంధనల (Income Tax Rules) ప్రకారం, వికేర్ స్కీమ్ మీద వచ్చే వడ్డీ ఆదాయంపై TDS కట్ అవుతుంది.
మరో ఆసక్తికర కథనం: మీలాంటి అసమర్థుల దగ్గర మేం పని చేయం, ఉద్యోగాలు వదిలేస్తాం - ఓపెన్‌ఏఐకి భారీ షాక్
Honda SP 125: ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కి.మీ. మైలేజ్! - లోన్‌పై హోండా బైక్ కొంటే ఎంత EMI చెల్లించాలి?
PPF, SSY, NSC: పోస్టాఫీస్ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ప్రకటించిన ప్రభుత్వం
Gold-Silver Prices Today 29 Mar: పసిడి మెరుపు పెరిగింది, వెండి వెనక్కు తగ్గింది - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
ATM Withdrawal Fee: ATM నుంచి డబ్బు తీస్తే రూ.23 బాదుడు, తస్మాత్ జాగ్రత్త!
Canadian Salary: కెనడాలో C$30,000 జీతం సంపాదిస్తే భారత్‌లో దాని విలువ ఎంత? తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు
CM Revanth Reddy: పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి: ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu: ఉగాది నాడు పేదలకు గుడ్‌న్యూస్, కీలక ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం
Actor : మొదటి సినిమాకే నేషనల్ అవార్డు, 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న మహేష్ బాబు విలన్... ఇప్పుడు అవకాశాలు లేక యూట్యూబ్ వీడియోలు
LRS In Telangana: సెలవు దినాలైనా.. నేడు, రేపు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు, ఆస్తి పన్ను చెల్లింపులకు అవకాశం