By: ABP Desam | Updated at : 21 Jun 2023 03:39 PM (IST)
స్పెషల్ FD గడువు పెంచిన SBI
SBI Amrit Kalash Scheme: దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తన స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ 'అమృత్ కలశ్' (SBI Amrit Kalash Scheme) గడువు పెంచింది.
ఇది ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ (special fixed deposit scheme). ఈ పథకాన్ని ఫిబ్రవరి 15, 2023 నుంచి మార్చి 31, 2023 వరకు ఎస్‌బీఐ అమలు చేసింది. ఆ తర్వాత, ఏప్రిల్ 12 నుంచి రీస్టార్ట్ చేసింది. ఈ నెలాఖరుతో (జూన్ 30, 2023) గడువు ముగియాల్సి ఉంది. అయితే, ఈ లాస్ట్ డేట్‌ను మరోసారి పొడిగించింది, 2023 ఆగస్టు 15ని చివరి గడువుగా ఖరారు చేసింది.
ఎస్‌బీఐ 'అమృత్ కలశ్' స్కీమ్ ఒక పరిమిత కాల ఆఫర్. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌తో మంచి వడ్డీ ఆదాయం సంపాదించాలని మీరు ప్లాన్ చేస్తుంటే, ఈ FDలో పెట్టుబడి పెట్టవచ్చు.
అమృత్ కలశ్ ఫథకంపై వడ్డీ రేటు
SBI అమృత్ కలశ్ పథకం కాల వ్యవధి 400 రోజులు. ఈ డిపాజిట్ పథకంలో పెట్టుబడి పెట్టే సీనియర్ సిటిజన్లకు (60 సంవత్సరాలు లేదా ఆ వయస్సు దాటిన వాళ్లు) ఏటా 7.6 శాతం వడ్డీని స్టేట్ బ్యాంక్ చెల్లిస్తుంది. సాధారణ పౌరులకు (60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వాళ్లు) ఏడాదికి 7.1 శాతం వడ్డీ రేటును బ్యాంక్ జమ చేస్తుంది. ఎస్‌బీఐ ఉద్యోగులు, పెన్షనర్లకు ఒక శాతం వడ్డీరేటు అదనంగా చెల్లిస్తుంది.
వడ్డీ రేటుపై ఒక ఉదాహరణను పరిశీలిస్తే... ఎస్‌బీఐ అమృత్ కలశ్‌లో ఒక సీనియర్ సిటిజన్ ఒక 5 లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే, 7.6 శాతం వడ్డీ రేటు ప్రకారం 400 రోజులకు రూ. 43,000 వడ్డీ వస్తుంది. రూ. 5 లక్షల డిపాజిట్‌కు 7.6 శాతం వడ్డీ రేటు ప్రకారం, ఒక సాధారణ పౌరుడికి లభించే వడ్డీ మొత్తం 40,085 రూపాయలు.
అమృత్ కలశ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
మీకు దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖకు మీరు స్వయంగా వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడి వరకు వెళ్లేంత సమయం మీకు లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్‌బీఐ యోనో (SBI YONO) యాప్ ద్వారా కూడా ఈ స్కీం కోసం అప్లై చేసుకోవచ్చు.
ఈ స్కీమ్‌ను మెచ్యూరిటీ తేదీ కంటే ముందుగానే రద్దు చేసుకునే సదుపాయం ఉంది. దీంతో పాటు, ఈ డిపాజిట్‌ను మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది.
అమృత్ కలశ్ పథకంపై మీరు తీసుకునే వడ్డీపై ఇన్‌కం టాక్స్ రూల్స్ ప్రకారం TDS కట్ అవుతుంది. ఇలా కట్ అయిన మొత్తాన్ని, మీరు ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేసే సమయంలో క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఎవరు ప్రయోజనం పొందుతారు?
రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాల్లో ఉండే దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లు, NRI రూపాయి టర్మ్ డిపాజిట్లు రెండింటికీ ఈ పథకం వర్తిస్తుంది. కొత్తగా డిపాజిట్ చేయడంతో పాటు, పాత డిపాజిట్‌ను కూడా రెన్యూవల్ చేసుకోవచ్చు. ఇందులో, టర్మ్ డిపాజిట్ & స్పెషల్ టర్మ్ డిపాజిట్ సౌకర్యం కూడా ఖాతాదార్లకు అందుబాటులో ఉంది.
మరో ఆసక్తికర కథనం: ఎక్కువ వడ్డీ ఇచ్చే ఎస్‌బీఐ స్పెషల్ స్కీమ్, ఈ నెలాఖరు వరకే ఛాన్స్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Gold-Silver Prices Today 20 Nov: యుద్ధభయంతో పెరుగున్న పసిడి - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Gold Rate: బంగారం ధర ఆకాశాన్ని తాకబోతోంది - గ్లోబల్ కంపెనీ జోస్యం!
Investment Tips: ఆర్థిక సంక్షోభంలో ఆపద్బాంధవి 'గోల్డ్ లోన్' - ఎన్ని రకాల ప్రయోజనాలో తెలుసా?
Gold-Silver Prices Today 19 Nov: మార్కెట్‌లో మళ్లీ 'గోల్డ్ రష్, సిల్వర్ షైనింగ్' - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Stock Market Trading: ట్రేడింగ్‌లో రూ.50 లక్షల కోట్ల నష్టం - ఈ 5 తప్పులతో 'శని'ని రెడ్ కార్పెట్ వేసి పిలిచినట్లే!
Warangal BRS leaders: వరంగల్ సభ నుంచి రేవంత్ కౌంట్‌డౌన్ స్టార్ట్- బీఆర్ఎస్ నేతల సంచలన వ్యాఖ్యలు
Drone Pilot Training: ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలట్ శిక్షణ- కేవలం రూ.2 లక్షలకే డ్రోన్లు అందజేత
Target Revanth Reddy : రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే - పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
Maharashtra Assembly Election 2024: మహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్- ఈ ప్రాంతాలపైనే పార్టీల ఫోకస్