By: Rama Krishna Paladi | Updated at : 09 Jul 2023 02:42 PM (IST)
కంపెనీ ఫలితాలు ( Image Source : Pexels )
Q1 Results This Week:
భారత స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు సరికొత్త గరిష్ఠాలను తాకుతున్నాయి. అన్ని రంగాల షేర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఈ వారం స్టాక్ మార్కెట్ హాట్ హాట్‌గా చలించనుంది. మేజర్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు రాబోతుండటమే ఇందుకు కారణం.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం నుంచి టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ వంటివి రిజల్ట్స్ ప్రకటించబోతున్నాయి. కొన్ని నెలలుగా ఐటీ సెక్టార్ సవాళ్లను ఎదుర్కొంటుండటంతో వీటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అవెన్యూ సూపర్ మార్కెట్స్, ఏంజెల్ వన్ వంటి కంపెనీల ఫలితాలూ రాబోతున్నాయి. ఇంకా జాబితాలో ఏమేం ఉన్నాయంటే!
జులై 10: ఎమికో ఎల్‌కాన్, కింటెక్ రెన్యూవబుల్స్, ఎస్కార్ట్స్ ఫైనాన్స్, దిప్నా ఫార్మా కెమ్, స్పెక్ట్రమ్ ఫుడ్స్, అథర్వా ఎంటర్‌ప్రైజెస్, ఆస్కార్ గ్లోబల్ కంపెనీలు సోమవారం ఫలితాలు విడుదల చేస్తున్నాయి.
జులై 11: ఎల్కాన్ ఇంజినీరింగ్, పీసీబీఎల్, ప్లాస్టిబ్లెండ్స్ ఇండియా, జెనరిక్ ఇంజినీరింగ్ అండ్ ప్రాజెక్ట్స్, ఎస్‌టీ కార్పొరేషన్, ఎయికో లైఫ్ సైన్సెస్, ఎక్సెల్ రియాల్టీ, ఎన్ ఇన్ఫ్రా, వెల్‌క్యూర్ డ్రగ్స్, సీతా ఎంటర్‌ప్రైజెస్ జూన్ త్రైమాసికం ఫలితాలు విడుదల చేస్తాయి.
జులై 12: ఐటీ రంగంలోని అతి పెద్ద కంపెనీలు ఈ రోజే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయి. టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, నేషనల్ స్టాండర్డ్స్, ఆనంద్ రాఠీ వెల్త్, ఫైవ్‌పైసా క్యాపిటల్, హ్యాథ్‌వే భవానీ కేబుల్, సనత్ నగర్ ఎంటర్‌ప్రైజెస్ ఫలితాలు ప్రకటిస్తాయి.
జులై 13: విప్రో, ఫెడరల్ బ్యాంక్, ఏంజెల్ వన్, స్లెర్టింగ్ అండ్ విల్సన్, టాటా మెటాలిక్స్, భన్సాలీ ఇంజినీరింగ్ పాలిమర్స్, అవన్ టెల్, ఆదిత్యా బిర్లా మనీ, నకోడా గ్రూప్, రోస్‌ల్యాబ్స్ ఫైనాన్స్, థర్డ్‌వేవ్ ఫైనాన్షియల్ ఇంటర్ మీడియరీస్, లాంగ్ వ్యూ టీ కంపెనీలు మొదటి త్రైమాసికం ఫలితాలు విడుదల చేస్తాయి.
జులై 14: సీసీఎస్ ప్రొడక్ట్స్ ఇండియా, వీఎస్‌టీ ఇండస్ట్రీస్, టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్, యూనికెమ్ లేబోరేటరీస్, సస్తాసుందర్ వెంచర్స్, విరించి, అమల్, కోరమాండల్ ఇంజినీరింగ్ కంపెనీ, ఆల్‌ఫ్రెడ్ హార్బర్ట్ కంపెనీల రిజల్ట్స్ వస్తాయి.
జులై 15: డీమార్ట్ మాతృసంస్థ అవెన్యూ సూపర్‌మార్ట్స్, ర్యాలీస్ ఇండియా, కేస్లోవ్స్ ఇండియా వంటి కంపెనీలు శుక్రవారం ఫలితాలు విడుదల చేస్తున్నాయి.
ఫలితాలు విడుదల చేసే రోజు ఆయా కంపెనీల షేర్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతాయి. మంచి ఫలితాలు నమోదు చేస్తే ట్రేడర్లు ఎక్కువగా కొనుగోళ్లు చేపట్టే అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్ అంచనాలను అందుకోలేకపోతే పతనమయ్యేందుకు ఆస్కారం ఉంది. వీటిని అనుసరించి ట్రేడర్లు, ఇన్వెస్టర్లు తమ ట్రేడింగ్ ప్రణాళికను రూపొందించుకోవాల్సి ఉంటుంది.
Also Read: TDS కట్ కాని పోస్టాఫీస్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి, ఫుల్ అమౌంట్ మీ చేతికొస్తుంది
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Gold-Silver Prices Today 07 Nov: పసిడి విలవిల, అతి భారీ పతనం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Gold-Silver Prices Today 06 Nov: పసిడిపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Investment Idea: తక్కువ పెట్టుబడి, ఎక్కువ రాబడి - రిస్క్ లేని స్కీమ్స్ ఇవి
Best Picnic Insurance Policy: పిక్నిక్ ప్లాన్ చేసే ముందు ఇన్సూరెన్స్ చేయించుకోండి- లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!