By: ABP Desam | Updated at : 09 Jul 2023 09:25 AM (IST)
TDS కట్ కాని పోస్టాఫీస్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి
Post Office Small Saving Schemes: భారత ప్రభుత్వం పోస్టాఫీసు ద్వారా చాలా పొదుపు + పెట్టుబడి పథకాలు అందిస్తోంది. వీటిలో కొన్ని స్కీమ్స్‌లో TDS కట్ అవుతుంది, కొన్ని స్కీమ్స్‌లో పన్ను మినహాయింపు లభిస్తుంది. కొన్ని పోస్టాఫీస్ పథకాలు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఆదాయ పన్ను మినహాయింపు పరిధిలోకి రావు. ఇలాంటి వాటి గురించి ముందే తెలుసుకుంటే, ఏ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకోవచ్చు.
పోస్టాఫీస్ స్కీమ్ ద్వారా జరిగే ట్రాన్జాక్షన్ మొత్తం కొంత పరిధిని దాటితే TDS (Tax Deducted at Source) వర్తిస్తుంది. ఆ పరిమితి లోపు ఉంటే TDS కట్ కాదు. TDS అంటే, ఒక వ్యక్తి ఆదాయంపై ముందస్తుగానే ఆదాయ పన్ను వసూలు చేయడం. ఇన్‌కమ్ టాక్స్ ఎగవేతను నిరోధించడానికి ప్రవేశపెట్టిన విధానం ఇది. ఇలా కట్ అయిన TDSను, ఆ ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత, ఇన్‌కం టాక్స్ రిటర్న్ ఫైల్ చేసి వెనక్కు తీసుకోవచ్చు. టీడీఎస్‌ను వడ్డీతో కలిసి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ రిఫండ్ చేస్తుంది.
TDS కట్ అయ్యే/ కట్ కాని పోస్టాఫీస్ పథకాలు:
పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ (Post Office Recurring Deposit)
పోస్టాఫీసు RD పథకం కింద, TDS కట్ అయ్యే పరిమితి సాధారణ పౌరులకు (60 ఏళ్ల వయస్సు లోపు వాళ్లు) పరిమితి రూ. 40,000. సీనియర్ సిటిజన్లకు (60 ఏళ్ల వయస్సున్న లేదా దాటిన వాళ్లు) పరిమితి రూ. 50,000.
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (Post Office Time Deposit)
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద (Section 80C of Income Tax Act 1961), ఐదేళ్ల పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లపై రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఒక ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల కాల వ్యవధి కలిగిన టైమ్ డిపాజిట్లకు పన్ను వర్తిస్తుంది. ఈ కాల గడువుల్లో సంపాదించే వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం (Post Office Monthly Income Scheme)
ఈ పథకం కింద వచ్చే వడ్డీ రూ. 40 వేలను దాటితే పన్ను వర్తిస్తుంది. ఈ పథకంలో పెట్టే పెట్టుబడికి ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు రాదు.
మహిళ సమ్మాన్ బచత్ పత్ర యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్
మహిళ సమ్మాన్ సేవింగ్స్ లెటర్ స్కీమ్ కింద TDS కట్ అవుతుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కింద సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు దక్కుతుంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC), పబ్లిక్ ప్రావిండెట్ ఫండ్ (PPF)
NSC పథకం కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ అకౌంట్‌పై వచ్చే వడ్డీపై కూడా TDS వర్తించదు. PPF పథకం కూడా సంపూర్ణ పన్ను మినహాయింపు కిందకు వస్తుంది.
కిసాన్ వికాస్ పత్ర (KVP)
ఈ పథకం పన్ను మినహాయింపు కిందకు రాదు. అయితే, ఈ స్కీమ్ మెచ్యూరిటీ సమయంలో చేతికి వచ్చే మొత్తంపై TDS కట్ కాదు.
మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ: పెరిగిన పసిడి రేటు - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Costly Palace: అంబానీల ఆంటిలియా కంటే ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న మహిళ - భవనం ప్రత్యేకతలు బోలెడు
Unified Pension Scheme: మరో 10 రోజుల్లో 'ఏకీకృత పింఛను పథకం' - ఇలా దరఖాస్తు చేసుకోండి
Toll Deducted Twice: టోల్ గేట్ దగ్గర రెండుసార్లు డబ్బు కట్ అయ్యిందా? - ఇలా చేస్తే మీ డబ్బు తిరిగొస్తుంది
Gold-Silver Prices Today 22 Mar: రూ.90,000కు దిగొచ్చిన పసిడి రేటు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
UPI Payment: ఏప్రిల్ 1 నుంచి ఈ మొబైల్ నంబర్లలో UPI పని చేయదు, చెల్లింపులన్నీ బంద్
YS Jagan: అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి పరుగులు పూర్తి.. ఫిఫ్టీతో సత్తా చాటిన విరాట్, ఫస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Sushant Singh Rajput Case: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ