By: Arun Kumar Veera | Updated at : 04 Jan 2025 12:38 PM (IST)
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లు ( Image Source : Other )
Punjab National Bank Revised Fixed Deposit Rates: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన కస్టమర్లకు బంపర్ న్యూ ఇయర్ గిఫ్ట్ అందించింది. ఈ బ్యాంక్, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లను పెంచింది. కొత్త రేట్లు జనవరి 01, 2025 నుంచి అమలులోకి వచ్చాయి. రూ. 3 కోట్ల లోపు డిపాజిట్లకు రెండు కొత్త కాల వ్యవధులను బ్యాంక్ జోడించింది.
PNB, సాధారణ పౌరులకు (60 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు) 303 రోజుల కాలవ్యవధి (Tenure) కోసం 7 శాతం వడ్డీ రేటును నిర్ణయించగా, 506 రోజుల కాలవ్యవధికి 6.70 శాతం వడ్డీ రేటును నిర్ణయించింది. దీని కింద, పెట్టుబడిదారులు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో ఏకమొత్తాన్ని డిపాజిట్ చేయాలి, ఈ డిపాజిట్‌పై పెరిగిన వడ్డీని పొందుతారు.
కొత్త సమాచారం ప్రకారం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సాధారణ పౌరులకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలానికి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.50 శాతం నుంచి 7.25 శాతం వడ్డీని ఇస్తుంది. 400 రోజుల కాలానికి వడ్డీ రేటు 7.25 శాతంగా నిర్ణయించింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లు (New interest rates on Punjab National Bank fixed deposits)
7 రోజుల నుంచి 14 రోజులకు --- సాధారణ పౌరులకు 3.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.0 శాతం & సీనియర్ సిటిజన్లు లేదా సూపర్ సీనియర్ సిటిజన్లకు 4.30 శాతం
15 రోజుల నుంచి 29 రోజులకు --- సాధారణ పౌరులకు 3.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.0 శాతం & సీనియర్ సిటిజన్లకు 4.3 శాతం
30 రోజుల నుంచి 45 రోజులకు --- సాధారణ పౌరులకు వడ్డీ రేటు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.0 శాతం & సూపర్ సీనియర్ సిటిజన్లకు 4.30 శాతం.
46 రోజుల నుంచి 60 రోజులకు --- సాధారణ పౌరులకు 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.0 శాతం & సూపర్ సీనియర్ సిటిజన్లకు 5.30 శాతం వడ్డీ రేటు నిర్ణయించబడింది.
61 రోజుల నుంచి 90 రోజులకు --- సాధారణ పౌరులకు 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.0 శాతం & సూపర్ సీనియర్ సిటిజన్లకు 5.30 శాతం వడ్డీ రేటు.
91 రోజుల నుంచి 179 రోజులకు --- సాధారణ పౌరులకు 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.0 శాతం & సూపర్ సీనియర్ సిటిజన్లకు 6.30 శాతం.
180 రోజుల నుంచి 270 రోజులకు --- సాధారణ పౌరులకు 6.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం & సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.05 శాతం వడ్డీ రేటు నిర్ణయించబడింది.
271 రోజుల నుంచి 299 రోజులకు --- సాధారణ పౌరులకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.0 శాతం & సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం.
300 రోజులకు --- సాధారణ పౌరులకు 7.05 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.55 శాతం & సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.85 శాతం.
301 రోజుల నుంచి 302 రోజుల వరకు --- సాధారణ పౌరులకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.0 శాతం & సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం.
303 రోజులకు --- సాధారణ పౌరులకు 7.0 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం & సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం.
304 రోజుల నుంచి 1 సంవత్సరం వరకు --- సాధారణ పౌరులకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.0 శాతం & సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం.
1 సంవత్సరానికి --- సాధారణ పౌరులకు 6.80 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం & సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం.
1 సంవత్సరం నుంచి 399 రోజుల వరకు --- సాధారణ పౌరులకు 6.80 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం & సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం.
* ఇంతకంటే ఎక్కువ రోజుల వ్యవధి & దానిపై వడ్డీ రేటు కోసం PNB అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
* 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులను సీనియర్ సిటిజన్‌లుగా, 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులను సూపర్ సీనియర్ సిటిజన్‌లుగా పరిగణిస్తారు.
మరో ఆసక్తికర కథనం: 'బ్యాంక్‌నెట్' గురించి తెలుసా? - ఇల్లయినా, పొలమైనా, షాపయినా, ఎలాంటి ఆస్తినైనా చాలా చవకగా కొనొచ్చు!
Baanknet: 'బ్యాంక్‌నెట్' గురించి తెలుసా? - ఇల్లయినా, పొలమైనా, షాపయినా, ఎలాంటి ఆస్తినైనా చాలా చవకగా కొనొచ్చు!
Pension: పెన్షనర్లకు పెద్ద బహుమతి - దేశంలో ఏ ప్రాంతంలోనైనా, ఏ బ్యాంక్ నుంచయినా పెన్షన్
Gold-Silver Prices Today 04 Jan: నగలు కొనేవాళ్లకు లక్కీ డే, రూ.4,900 తగ్గిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
PF Balance Check: మూడేళ్లు పని చేస్తే మీ PF అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉంటుంది?, ఇలా చెక్ చేయండి
ATM Card: ఏటీఎం, క్రెడిట్ కార్డ్ నంబర్ చెరిపేయమంటూ ఆర్‌బీఐ వార్నింగ్ - మీ కార్డ్ పరిస్థితేంటి?
Yadadri Blast News: యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
Breaking News: బుమ్రాకు గాయం.. మైదానం వీడి వెళ్లిపోయిన స్టార్ పేసర్
Human Metapneumovirus: వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం
Haindava Sankharavam: రేపు విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ‘హైందవ శంఖారావం’ భారీ సభ- ప్రధాన డిమాండ్లు ఇవే
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy