By: ABP Desam | Updated at : 19 Sep 2022 02:57 PM (IST)
Edited By: Arunmali
ఈ స్కీమ్‌తో నెలనెలా గ్యారెంటీగా రూ.9 వేలు
PMVVY: వరిష్ఠ పెన్షన్ బీమా యోజన -2003 (VPBY-2003), వరిష్ఠ పెన్షన్ బీమా యోజన -2014 (VPBY-2014) పథకాలు విజయవంతం కావడంతో, అదే బాటలో మరో పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. వృద్ధాప్యంలో సామాజిక, ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ‘ప్రధానమంత్రి వయ వందన యోజన (Pradhan Mantri Vaya Vandana Yojana - PMVVY) అనే పింఛను పథకాన్ని ప్రారంభించింది. 60 ఏళ్లు దాటిన వాళ్ల కోసం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ద్వారా తీసుకొచ్చిన పెన్షన్ స్కీమ్ ఇది. భవిష్యత్తులో వడ్డీ రేట్లు పడిపోయినా, కచ్చితమైన వడ్డీ ఆదాయాన్ని అందించడం ఈ పథకం ఉద్దేశం.
కేంద్ర ప్రభుత్వం PMVVYని 2017 మే 4న ప్రారంభించింది. ఈ పథకంలో చేరడానికి తొలుత పరిమిత గడువునే విధించినా, ఆ తర్వాత ప్రతి ఏటా గడువును సంవత్సరం చొప్పున పొడిగిస్తూ వస్తోంది. తాజాగా 2023 మార్చి 31ని తుది గడువుగా నిర్ణయించింది. ఈ పాలసీని ఆన్‌లైన్ ద్వారా, అంటే ఎల్‌ఐసీ ఏజెంటును సంప్రదించి తీసుకోవచ్చు లేదా ఆన్‌లైన్ ద్వారాను కొనుగోలు చేయొచ్చు. పాలసీని కొనుగోలు చేయడానికి గరిష్ట మొత్తం రూ.15 లక్షలు. అంటే, ఈ పరిమితి దాటకూడదు. పాలసీని కొనుగోలు చేసిన తర్వాతి నెల నుంచి ప్రతి నెలా పింఛను అందుతుంది.
స్కీమ్‌లో చేరడానికి అర్హతలు
ఈ పథకంలో చేరాలంటే కనీస వయసు 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువయి ఉండాలి. గరిష్ఠ వయో పరిమితి లేదు. పాలసీ వ్యవధి 10 సంవత్సరాలు. ప్రతి నెలా కనీసం రూ.1,000 పింఛను వస్తుంది. గరిష్టంగా నెలకు రూ.9,250 అందుకోవచ్చు. నెలనెలా డబ్బు వద్దనుకుంటే, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం.. ఇలా మీకు నచ్చిన కాల వ్యవధిని ఎంచుకోవచ్చు. ఈ కాల వ్యవధికి అనుగుణంగానే పింఛను మొత్తం చేతికి వస్తుంది. ఉదాహరణకు.. పాలసీదారు ఆరు నెలలకు ఒకసారి పింఛను కావాలనుకుంటే.. కనిష్టంగా రూ.6,000, గరిష్టంగా 55,500 పొందవచ్చు. ఆరు నెలలంటే కష్టం, మూడు నెలలకు ఒకసారి పింఛను తీసుకోవాలని మీరు నిర్ణయించుకుంటే, కనిష్టంగా రూ.3,000, గరిష్ఠంగా రూ.27,750 పొందవచ్చు.
PMVVY ప్రయోజనాలు
10 ఏళ్ల పాలసీ కాల వ్యవధిలో ఏటా దాదాపు 7.4 శాతం వడ్డీని చెల్లిస్తారు. పాలసీ గడువు వ్యవధి ముగిసిన తర్వాత, పాలసీదారుడికి పాలసీ కొనుగోలు మొత్తాన్ని, పూర్తిగా తిరిగి ఇచ్చేస్తారు. ఒకవేళ పాలసీ ముగిసేలోపే మరణిస్తే, పాలసీ కొనుగోలు ధరను సంపూర్ణంగా నామినీకి చెల్లించేస్తారు. అప్పటివరకు తీసుకున్న పింఛను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు.
రుణం కూడా..
పాలసీ కొని మూడేళ్లు పూర్తయిన తర్వాత, ఒకవేళ అవసరం అనుకుంటే పింఛనుదారు, ఆ పాలసీని హామీగా పెట్టి అప్పు కూడా తీసుకోవచ్చు. సదరు పాలసీ కొనుగోలు మొత్తంలో 75 శాతం వరకు రుణం రూపంలో తీసుకోవచ్చు. ఇచ్చిన అప్పు మీద వడ్డీని, ఇవ్వాల్సిన పింఛను మొత్తం నుంచి ఎల్‌ఐసీ మినహాయించుకుంటుంది. అంటే, మీ చేత్తో కట్టాల్సిన అవసరం లేదు.
రుద్దు చేసుకునే వెలుసుబాటు
పాలసీ కొన్న తర్వాత ఏ కారణం వల్లనైనా దానిని వద్దనుకుంటే రద్దు చేసుకునే సదుపాయం కూడా PMVVYలో ఉంది. కాకపోతే, ఇందుకు 15 రోజుల గడువు మాత్రమే ఉంటుంది. అంటే, పాలసీ కొన్న తేదీ నుంచి 15 రోజుల్లోపు రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆఫ్‌లైన్‌లో తీసుకున్నవారికి వర్తిస్తుంది. ఆన్‌లైన్‌లో పాలసీ కొన్నవారికి 30 రోజుల వరకు వ్యవధి లభిస్తుంది.
ఒకవేళ పాలసీదారు గానీ, వారి జీవిత భాగస్వామికి గానీ ఏదైనా అత్యవసర వైద్య చికిత్స అవసరమైతే పాలసీని రద్దు చేసుకోవచ్చు. ఈ ఒక్క సందర్భంలో మాత్రమే పాలసీ కొనుగోలు మొత్తాన్ని రద్దు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే, చెల్లించిన మొత్తంలో 98 శాతాన్ని తిరిగి ఇస్తారు.
Petrol-Diesel Price 23 September 2023: స్వల్పంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు- ఈ ప్రాంతంలో మాత్రం తగ్గుదల
Gold-Silver Price 23 September 2023: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్- మీ నగరాల్లో గోల్డ్ కొనుగోలుకు ఇదే మంచి టైం
Gold-Silver Price 19 September 2023: గుబులు రేపుతున్న గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Latest Gold-Silver Price 18 September 2023: దయ చూపని పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Gold-Silver Price 18 September 2023: చుక్కల్లోకి చూస్తున్న పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
ఒకేసారి 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రధాని పచ్చజెండా, తెలుగు రాష్ట్రాలకు రెండు రైళ్లు
BRS Candidates : సమయానికే ఎన్నికలు - అభ్యర్థులూ రెడీ ! బీఆర్ఎస్లో సందడేది ?
Chandrababu Arrest: వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు, టెలీకాన్ఫరెన్స్‌లో నారా లోకేశ్ స్పష్టత
Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు
/body>