By: Arun Kumar Veera | Updated at : 10 Apr 2024 08:15 AM (IST)
పోస్టాఫీస్ పథకాల్లో ఎంత వడ్డీ వస్తుంది?
Small Saving Scheme Interest Rates From 01 April 2024: పెట్టుబడుల విషయంలో.. చిన్న మొత్తాల పొదుపు పథకాలు చాలా సురక్షితమైన మార్గాలు. బ్యాంక్‌లు, పోస్టాఫీస్‌ల ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేసే స్కీమ్‌లు ఇవి. కాబట్టి వీటిలో జమ చేసే డబ్బును నష్టపోతామన్న భయం ఉండదు.
ప్రతి త్రైమాసికం ప్రారంభానికి ముందు, కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపు పథకాలపై కొత్త వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25 ప్రారంభం కూడా స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌కు సంబంధించిన వడ్డీ శాతాలను నిర్ణయించింది. ఈ రేట్లు జూన్ త్రైమాసికంలో, అంటే ఏప్రిల్ 01 నుంచి జూన్ 30 వరకు అమల్లో ఉంటాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (జూన్ త్రైమాసికం) చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదని గత నెలలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే.. ఈ ఏడాది ఏప్రిల్ త్రైమాసికంలో ఏ రేట్లు అమల్లో ఉన్నాయో, జూన్ త్రైమాసికంలోనూ అవే రేట్లు అమల్లో ఉంటాయి.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ - సుకన్య సమృద్ధి యోజన
ఏప్రిల్ త్రైమాసికంలో, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై (PPF) 7.10 శాతం వడ్డీ రేటు ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు ఉండదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది కాబట్టి, తర్వాతి సమీక్ష వరకు ఇదే వడ్డీ రేటు కొనసాగుతుంది. PPFపై వడ్డీ రేటును 2020 ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం మార్చలేదు. స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌లో PPF బాగా పాపులర్ అయిన పథకం. ఈ అకౌంట్‌లో పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయంలో చేతికి అందే డబ్బుకు ఆదాయ పన్ను వర్తించదు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లాగానే సుకన్య సమృద్ధి యోజన (SSY) కూడా బాగా పాపులర్ అయింది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకంలో ప్రతి ఆర్థిక సంవత్సరం రూ.500 నుంచి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. సుకన్య సమృద్ధి యోజనలో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 నుంచి రూ.1.50 లక్షల వరకు జమ చేయొచ్చు. ఈ రెండు పథకాల్లో పెట్టుబడులకు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు.
వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు (Small Saving Scheme New Interest Rates)
సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana Interest Rate) ---- వడ్డీ రేటు 8.20 శాతం
సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS Interest rate) ---- వడ్డీ రేటు 8.20 శాతం
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC Interest rate) ---- వడ్డీ రేటు 7.70 శాతం
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF Interest rate) ---- వడ్డీ రేటు 7.10 శాతం
కిసాన్ వికాస్ పత్ర (KVP Interest rate) ---- వడ్డీ రేటు 7.50 శాతం (115 నెలల మెచ్యూరిటీ కాలం)
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS Interest rate) ---- వడ్డీ రేటు 7.40 శాతం
పొదుపు ఖాతా ---- వడ్డీ రేటు 4.00 శాతం
1 సంవత్సరం టైమ్ డిపాజిట్ ---- వడ్డీ రేటు 6.90 శాతం
2 సంవత్సరాల కాల డిపాజిట్ ---- వడ్డీ రేటు 7.00 శాతం
3 సంవత్సరాల కాల డిపాజిట్ ---- వడ్డీ రేటు 7.10 శాతం
5 సంవత్సరాల కాల డిపాజిట్ ---- వడ్డీ రేటు 7.50 శాతం
5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్ ---- వడ్డీ రేటు 6.70 శాతం
మరో ఆసక్తికర కథనం: మే 20న స్టాక్ మార్కెట్‌కు సెలవు, కారణం ఏంటో చెప్పిన NSE
పర్సనల్ లోన్ కొరకు అర్హత: బజాజ్ ఫైనాన్స్ తో త్వరిత నిధులకు సులభమైన మార్గదర్శకం
EPFO Update: ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
Investment Tips: వెండి లేదా గోల్డ్ ఎందులో ఇన్వెస్ట్ చేయాలి ? ఏది లాభదాయకం, బెనిఫిట్స్ ఎక్కువ
Year Ender 2025 : ఉద్యోగస్తులకు కలిసి వచ్చిన 2025- పెద్ద ఊరటనిచ్చిన అంశాలు ఇవే!
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
Australia terror attack: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
BRS Party Key Meeting: ఈ 19న జరగాల్సిన బీఆర్ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
YSRCP Kukatpalli: కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?
Jai Akhanda: 'జై అఖండ'కు కొత్త నిర్మాతలు... 14 రీల్స్ ప్లస్ నుంచి మరొకరికి!