By: ABP Desam | Updated at : 16 Nov 2022 01:53 PM (IST)
Edited By: Ramakrishna Paladi
పోస్టాఫీస్ ఇన్సూరెన్స్
Post Office Rs 299 Insurance Scheme: ఈ రోజుల్లో బీమా ఒక నిత్యావసర సాధనంగా మారిపోయింది! ప్రీమియం కట్టేందుకు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుందని చాలామంది ఆసక్తి చూపించరు. మనకేం అవుతుందిలే అనుకుంటూ కొందరు దాటేస్తారు. తర్వాత చూద్దాంలే అని మరికొందరు నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలాంటి వారికోసమే ఇండియా పోస్ట్ అత్యంత చవకైన బీమా పాలసీలను తీసుకొచ్చింది. ఏడాదికి రూ.299, రూ.399కే ప్రమాద బీమా పాలసీలను ఆఫర్ చేస్తోంది.
రూ.399 ప్రయోజనాలు
ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంక్ వినియోగదారులు ఈ పాలసీలను ఉపయోగించుకోవచ్చు. 16-65 ఏళ్ల వయస్కులు అతి తక్కువ ప్రీమియం చెల్లించి ఈ పాలసీల ప్రయోజనాలను పొందొచ్చు. రూ.399తో రూ.10 లక్షల బీమాను అందిస్తున్నారు. ఇందులో ప్రమాదవశాత్తు మరణించడం, శాశ్వతంగా వైకల్యం రావడం, పర్మనెంట్ పార్షియల్ డిసెబిలిటీ, యాక్సిడెంటల్ డిస్‌మెంబర్‌మెంట్, పెరాలసిస్ వంటివి కవర్ అవుతాయి. ప్రమాదం జరిగినప్పుడు వైద్యం ఖర్చులకు ఐపీడీ కింద రూ.60,000, ఓపీడీ కింద రూ.30,000 పొందొచ్చు. ఒకవేళ ఆస్పత్రిలో ఉండాల్సి వస్తే రోజుకు రూ.1000 చొప్పున పది రోజులు ఇస్తారు. వీటికి తోడుగా ఎడ్యుకేషన్ బెనిఫిట్ ఉంటుంది. బీమా మొత్తంలో పది శాతం లేదా లక్ష రూపాయిలు ఈ రెండింట్లో ఏది తక్కువైతే దానిని ఇద్దరు పిల్లలకు ఇస్తారు. కుటుంబ ప్రయాణాలకు రూ.25,000, అంత్యక్రియల కోసం రూ.5000 అందిస్తారు.
రూ.299 ప్రయోజనాలు
ఇండియా పోస్టులో కనీస బీమా ప్లాన్ రూ.299కే అందుబాటులో ఉంది. రూ.399తో పోలిస్తే ఇందులో కొన్ని ప్రయోజనాలు తక్కువగా ఉంటాయి. ప్రమాద వశాత్తు మరణించడం, శాశ్వత అంగవైకల్యం, ఏదో ఒక అవయవ వైకల్యం, యాక్సిడెంటల్ డిస్‌మెంబర్‌మెంట్, పెరాలసిస్ వంటివి కవర్ అవుతాయి. ఎడ్యుకేషన్, కుటుంబ ప్రయాణం, అంత్యక్రియలు, ఆసుపత్రిలో రోజువారీ ఖర్చులు ఇవ్వరు. ఐపీడీ కింద రూ.60వేలు, ఓపీడీ కింద రూ.30వేలు పొందొచ్చు.
పాలసీ పరిమితులు
ఈ బీమా పాలసీకి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆత్మహత్య, సైనిక సేవలు, సైనిక ఆపరేషన్లు, యుద్ధం, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, రోగాలు, ఎయిడ్స్, ప్రమాదకరమైన క్రీడల్లో ప్రమాదాలు జరిగితే బీమా కవర్ అవ్వదు.
Year Ender 2024: హ్యుందాయ్ నుంచి స్విగ్గీ వరకు - 2024లో మార్కెట్‌ను షేక్ చేసిన IPOల లిస్ట్
Life Insurance Policy: మెచ్యూరిటీకి ముందే జీవిత బీమా పాలసీని సరెండర్ చేస్తే ఎంత నష్టపోతారో తెలుసా?
Lowest Home Loan Rates: ప్రభుత్వ బ్యాంక్‌లు లేదా ప్రైవేట్ బ్యాంక్‌లు - హోమ్ లోన్‌పై ఎక్కడ వడ్డీ తక్కువ?
PMAY 2.0 Scheme: మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి
ITR: ఐటీఆర్ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్