By: Arun Kumar Veera | Updated at : 30 Jun 2024 09:43 AM (IST)
మహిళల కోసం పోస్టాఫీస్‌లో ప్రత్యేక పథకం
Post Office Scheme For Women: మహిళల స్వావలంబన కోసం కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలు అమలు చేస్తోంది. వాటిలో ఒకటి... మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్. ఈ పథకాన్ని 2023 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. అదే సంవత్సరం ఏప్రిల్ 01వ తేదీ నుంచి స్కీమ్ ప్రారంభమైంది. మహిళల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ స్కీమ్‌ను డిజైన్ చేశారు.
మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకం వివరాలు
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ పథకం ఉద్దేశం. పేరుకు తగ్గట్లే ఇది కేవలం మహిళల కోసం సృష్టించిన పథకం. ఈ స్కీమ్ కింద కనిష్టంగా 1000 రూపాయల (Minimum Deposit Limit In Mahila Samman Savings Crtificate Scheme) నుంచి గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు (Maximum Deposit Limit In MSSC) పెట్టుబడి పెట్టొచ్చు. సింగిల్ పేమెంట్ ద్వారా పెట్టుబడి పెట్టాలి.
మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకం కింద ఒకే మహిళ చాలా ఖాతాలు ఓపెన్ చేయవచ్చు. కానీ.. ఒక ఖాతాను ప్రారంభించడానికి, మరొక ఖాతాను ప్రారంభించడానికి మధ్య కనీసం 3 నెలల గ్యాప్ ఉండాలి.
డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ
ఈ పథకం కింద, పెట్టుబడిదార్లు డిపాజిట్ చేసిన మొత్తంపై ఏడాదికి 7.50 శాతం వడ్డీ రేటు (Mahila Samman Crtificate Saving Scheme Interest Rate) లభిస్తుంది. ఈ పథకం మెచ్యూరిటీ గడువు 2 సంవత్సరాలు. అంటే, దీనిని స్వల్పకాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా (Short Term Fixed Deposit) భావించొచ్చు. ఒక మహిళ 2024 జులై నెలలో MSSC ఖాతాను ప్రారంభిస్తేస్తే, ఆ పథకం మెచ్యూరిటీ 2026 జులైలో ఉంటుంది. ఖాతా తెరిచిన ఒక సంవత్సరం తర్వాత, అవసరమైతే, డిపాజిట్ చేసిన మొత్తంలో 40 శాతం వరకు విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంది. పాక్షిక ఉపసంహరణ సౌకర్యం ఒక్కసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది.
మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ ఖాతాను ఎలా ప్రారంభించాలి?
మీ దగ్గరలోని పోస్టాఫీసు లేదా బ్యాంక్ బ్రాంచ్‌లో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ ఖాతాను తెరవొచ్చు. ఈ ఖాతాను ప్రారంభించేందుకు ఒక ఫారాన్ని పూరించాలి. దాంతో పాటు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, KYC ఫారం, బ్యాంక్ చెక్ అవసరం.
మహిళలు మాత్రమే కాకుండా బాలికలు కూడా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. వయోపరిమితి లేకుండా, ఏ వయసు వాళ్లయినా పెట్టుబడి పెట్టొచ్చు. మైనర్ బాలిక పేరిట ఖాతా ప్రారంభించాలంటే, ఆమె తల్లిదండ్రులు/గార్డియన్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి.
MSSC కాలిక్యులేటర్ ప్రకారం, 7.50 శాతం వార్షిక వడ్డీ రేటు చొప్పున, ఒక మహిళ ఈ పథకంలో రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయంలో రూ. 2,32,044 రాబడి పొందుతారు. మెచ్యూరిటీ సమయంలో ఫారం-2ను పూర్తి చేసి డబ్బుల్ని తీసుకోవచ్చు.
CBDT నోటిఫికేషన్ ప్రకారం, మహిళ సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్‌లో పెట్టుబడిపై వచ్చే వడ్డీ ఆదాయానికి TDS కట్ అవుతుంది. అయితే, వడ్డీ రూపంలో వచ్చిన ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 40,000 మించకపోతే TDS చెల్లించాల్సిన అవసరం లేదు. అలాంటి సందర్భంలో TDSకు బదులుగా, ఆ వడ్డీ ఆదాయం అకౌంట్ హోల్డర్ మొత్తం ఆదాయానికి యాడ్ అవుతుంది. రిటర్న్ ఫైల్ చేసే సమయంలో ఇన్‌కమ్ స్లాబ్ సిస్టమ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
మరో ఆసక్తికర కథనం: పర్సనల్ లోన్ పెనుభారం - పోటాపోటీగా వడ్డీ రేట్లు పెంచుతున్న బ్యాంక్‌లు
Gold-Silver Prices Today 26 Dec: ఈ రోజు 24K, 22K గోల్డ్ రేట్లలో మార్పులు - తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి కొత్త ధరలు ఇవే
Year Ender 2024: హ్యుందాయ్ నుంచి స్విగ్గీ వరకు - 2024లో మార్కెట్‌ను షేక్ చేసిన IPOల లిస్ట్
Life Insurance Policy: మెచ్యూరిటీకి ముందే జీవిత బీమా పాలసీని సరెండర్ చేస్తే ఎంత నష్టపోతారో తెలుసా?
Lowest Home Loan Rates: ప్రభుత్వ బ్యాంక్‌లు లేదా ప్రైవేట్ బ్యాంక్‌లు - హోమ్ లోన్‌పై ఎక్కడ వడ్డీ తక్కువ?
PMAY 2.0 Scheme: మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
Errolla Srinivas: బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ - తీవ్ర ఉద్రిక్తత, పోలీస్ రాజ్యమంటూ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం