By: ABP Desam | Updated at : 07 Nov 2023 12:06 PM (IST)
హోమ్ లోన్, కార్ లోన్ మీద దీపావళి ధమాకా ఆఫర్లు
Home Loan - Car Loan Diwali Offers: దేశంలోని కొన్ని బ్యాంక్‌లు, కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడానికి & ఇప్పటికే ఉన్న ఖాతాదార్లను సంతోషపెట్టడానికి దీపావళి ఆఫర్లు ప్రకటించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వంటివి ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఈ బ్యాంక్‌లు హౌసింగ్ లోన్స్ సహా వివిధ స్కీమ్స్‌పై పండుగ ఆఫర్లు ప్రారంభించాయి.
PNB నుంచి హోమ్ లోన్, కార్ లోన్ ఆఫర్స్
ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్, దీపావళి షాపింగ్ ట్రెండ్‌ను క్యాష్ చేసుకునేందుకు 'దీపావళి ధమాకా 2023' (Deepawali Dhamaka 2023) పేరుతో కొత్త ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద, గృహ రుణాలపై వడ్డీని తగ్గించి, సంవత్సరానికి 8.40% రేటుతో లోన్ అందిస్తోంది. లోన్ తీసుకునే వాళ్లకు ప్రాసెసింగ్ ఫీజ్, డాక్యుమెంటేషన్ ఛార్జీని రద్దు చేసింది. PNB వెబ్‌సైట్ https://digihome.pnb.co.in/pnb/hl/ ద్వారా కూడా హోమ్ లోన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దీంతోపాటు, PNB కస్టమర్లకు 8.75% నుంచి ప్రారంభమయ్యే వడ్డీ రేటుతో కార్ లోన్‌ను ఆఫర్ చేస్తోంది. దీనిపైనా ప్రాసెసింగ్ ఫీజ్, డాక్యుమెంటేషన్ ఛార్జీని పూర్తిగా మినహాయించింది. కారు లోన్ ఎంక్వైరీ కోసం PNB ONE యాప్‌ను ఉపయోగించవచ్చు. లేదా, PNB వెబ్‌సైట్ https://www.pnbindia.in/ ద్వారా కార్ లోన్ వివరాలు తెలుసుకోచ్చు. ఇవి కాకుండా... టోల్ ఫ్రీ నంబర్ 1800 1800/1800 2021 ద్వారా బ్యాంక్‌ను సంప్రదించవచ్చు లేదా సమీపంలోని PNB బ్రాంచ్‌కు వెళ్లి వివరాలు కనుక్కోవచ్చు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ఆఫర్స్
SBI అందిస్తున్న దీపావళి ఆఫర్లు సెప్టెంబర్ 1, 2023న ప్రారంభమయ్యాయి, డిసెంబర్ 31, 2023న ముగుస్తాయి. ఈ కార్యక్రమం కింద, SBI కస్టమర్లు తమ క్రెడిట్ బ్యూరో స్కోర్ ఆధారంగా టర్మ్ లోన్ వడ్డీ రేట్లపై గరిష్ట డిస్కౌంట్ పొందుతారు. ఎంత ఎక్కువ స్కోర్ ఉంటే అంత ఎక్కువ రాయితీ లభిస్తుంది. అత్యధిక క్రెడిట్ స్కోర్ ఉన్న కస్టమర్లకు స్టేట్ బ్యాంక్ 65 బేసిస్ పాయింట్ల (0.65%) వరకు వడ్డీ రేటును తగ్గింపును ఆఫర్ చేస్తోంది. కస్టమర్‌కు వడ్డీ రేటులో డిస్కౌంట్ ఇవ్వడానికి సిబిల్ స్కోర్‌ను (CIBIL Score) ఎస్‌బీఐ చెక్ చేస్తుంది.
కస్టమర్ సిబిల్ స్కోర్ 700-749 రేంజ్‌లో ఉంటే, 8.70% వడ్డీ రేటుతో టర్మ్ లోన్ పొందవచ్చు. ఆఫర్‌కు ముందు ఇది 9.35%గా ఉంది. అదేవిధంగా, సిబిల్ స్కోర్ 750-799 పరిధిలో ఉంటే, ప్రత్యేక రేట్ల పథకం కింద 8.60% వడ్డీకే (కార్డ్ రేటు 9.15%) లోన్ తీసుకోవచ్చు. చివరగా, కస్టమర్ స్కోర్ 800 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, సాధారణ రేటు 9.15%కి బదులుగా 8.6% వడ్డీ రేటుకే రుణం దక్కించుకోవచ్చు.
హోమ్ లోన్ టేకోవర్, రీసేల్, రెడీ టు మూవ్ ప్రాపర్టీ లోన్స్‌లో, సిబిల్ స్కోర్ 700 & అంతకంటే ఎక్కువ ఉంటే, పైన చెప్పిన రేట్ల కంటే మరో 20 బేసిస్ పాయింట్లు (0.20%) అదనపు వడ్డీ రేటు రాయితీ అందుబాటులో ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా హోమ్ & కార్ లోన్ ఆఫర్స్
బ్యాంక్ ఆఫ్ బరోడా, 'ఫీలింగ్ ఆఫ్ ఫెస్టివల్ విత్ BoB' (Feeling of Festival with BoB) పేరిట స్పెషల్ డిస్కౌంట్ కార్యక్రమం తీసుకొచ్చింది, 31 డిసెంబర్ 2023 వరకు ఇది అందబాటులో ఉంటుంది. ఈ కార్యక్రమం కింద BoB ఇచ్చే హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8.40% నుంచి ప్రారంభమవుతాయి. లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజ్‌ను బ్యాంక్ రద్దు చేస్తుంది. సంవత్సరానికి 8.70% వడ్డీ రేటుతో కార్ లోన్ పొందవచ్చు. కార్ లోన్, విద్యారుణానికి కూడా ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజ్ చెల్లించాల్సిన అవసరం లేదు.
మరో ఆసక్తికర కథనం: పడుతూనే ఉన్న పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Bank Account Nominee: ప్రతి బ్యాంక్ ఖాతాలో 4 నామినీ పేర్లు - అతి త్వరలో మార్పులు!
NTPC Green Energy IPO: ఎన్‌టీపీసీ గ్రీన్ ఐపీవో అలాట్‌మెంట్ స్టేటస్‌ను ఇంట్లో కూర్చునే ఇలా చెక్ చేయండి
Money Saving: జీతం నుంచి నెలవారీ సేవింగ్ - ఈ 7 పద్ధతులు పాటిస్తే మీరే 'కింగ్'
Share Market Today: స్టాక్ మార్కెట్‌లో బుల్ పరేడ్ - సెన్సెక్స్ 1300 పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్లు హైజంప్
Gold-Silver Prices Today 25 Nov: ఏకంగా రూ.1000 తగ్గిన పసిడి - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
Vikkatakavi Series : న్యూ సిరీస్‌తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
HMD Fusion: ఈ స్మార్ట్ ఫోన్ బట్టలు మార్చేయచ్చు - స్మార్ట్ అవుట్‌ఫిట్స్‌తో వచ్చిన హెచ్‌ఎండీ ఫ్యూజన్!