By: ABP Desam, Arun Kumar Veera | Updated at : 19 Jan 2024 12:37 PM (IST)
ఫిబ్రవరి నుంచి NPS కొత్త రూల్స్
NPS Account New Withdrawal Rules: డబ్బు సంపాదిస్తున్నప్పుడు జీవిత ప్రయాణం సాఫీగా సాగుతుంది. సంపాదించే వయస్సు దాటిన తర్వాతే ఆ ప్రయాణంలో ఎగుడుదిగుళ్లు ఎదురవుతాయి. గతుకుల రోడ్డులో జీవితం గుల్ల కాకూడదనుకుంటే, ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ ప్లానింగ్ అవసరం. డబ్బు సంపాదించే వయస్సులో ఉన్నప్పుడే, వీలైనంత త్వరగా పొదుపు/పెట్టుబడి మొదలు పెడితే... కష్టపడే వయస్సును దాటిన తర్వాత ఆ డబ్బు ఉపయోగపడుతుంది. ఇలాంటి ప్లాన్ ఉన్న వ్యక్తుల జీవితాల్లో, రిటైర్మెంట్ తర్వాత కూడా లైఫ్ జర్నీ స్మూత్‌గా ఉంటుంది.
ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ స్కీమ్స్‌లో దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టడం తెలివైన వ్యక్తి లక్షణంగా మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. ప్రస్తుతం ఉన్న బెస్ట్ పెన్షన్ ప్లాన్స్‌లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (National Pension System - NPS) ఒకటి.
సబ్‌స్ర్కైబర్‌కు 60 సంవత్సరాలు రాగానే, NPSలో అప్పటి వరకు పెట్టిన పెట్టుబడి రూ.5 లక్షలు లేదా ఆ లోపు ఉంటే, ఆ డబ్బు మొత్తాన్ని విత్‌డ్రా (withdrawal from NPS account) చేసుకోవచ్చు. ఒకవేళ రూ.5 లక్షలు దాటితే, ఆ మొత్తంలో 60 శాతం డబ్బును ఏకమొత్తంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తంతో తప్పనిసరిగా యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాలి. యాన్యుటీ ప్లాన్ నుంచి ప్రతి నెలా పెన్షన్ రూపంలో డబ్బు వస్తుంది. దీంతోపాటు NPS పెట్టుబడులకు ఆదాయ పన్ను (Income tax saving with NPS) చెల్లించాల్సిన అవసరం లేదు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద, సెక్షన్ 80CCD కింద కలిపి రూ.2 లక్షల వరకు టాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు.
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA), ఈ మధ్యే ఒక సర్క్యులర్ విడుదల చేసింది. NPS అకౌంట్ నుంచి కొంత డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి (partial withdrawal of pension) కొత్త రూల్స్ జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ (01 ఫిబ్రవరి 2024) నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి 01 నుంచి, NSP అకౌంట్‌లో ఉన్న డబ్బులో యజమాన్యం వాటాను మినహాయించి, చందాదార్ల కట్టే వాటా నుంచి మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. అది కూడా 25 శాతం ఉపసంహరణకు మాత్రమే అనుమతి ఉంటుంది.
NPS ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేసేందుకు నిబంధనలు (Rules for withdrawal of money from NPS account)
కొన్ని ప్రత్యేక పరిస్థితుల కోసం మాత్రమే NPS ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేసేందుకు అనుమతి ఉంటుంది. అవి:
- పిల్లల ఉన్నత చదువుల కోసం కొంత డబ్బు వెనక్కు తీసుకోవచ్చు. చట్టబద్ధంగా దత్తత తీసుకున్న పిల్లలు కూడా ఇందులోకి వస్తారు.
- పిల్లల వివాహ ఖర్చుల కోసం పార్షియల్ విత్‌డ్రా చేయవచ్చు. చట్టబద్ధంగా దత్తత తీసుకున్న పిల్లలకు కూడా ఇది వర్తిస్తుంది.
- చందాదారు పేరిట ఇల్లు కట్టుకోవడం లేదా కొనడానికి డబ్బు తీసుకోవచ్చు. జాయింట్ ఓనర్‌షిప్‌ను కూడా ఇది కవర్ చేస్తుంది.
- దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స ఖర్చుల కోసం డబ్బు తీసుకోవచ్చు. క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, ప్రైమరీ పల్మనరీ ఆర్టరీ హైపర్‌టెన్షన్, మల్టిపుల్ స్క్లెరోసిస్, మేజర్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్, ఇతర పెద్ద స్థాయి జబ్బులు ఈ పరిధిలోకి వస్తాయి.
- చందాదారుకు అవయవ వైకల్యం ఉండి, దానికి అవసరమైన వైద్య ఖర్చుల కోసం కొంత డబ్బు విత్‌డ్రా చేయవచ్చు.
- స్టార్టప్ లేదా కొత్త వెంచర్‌ను ఏర్పాటు చేసేందుకు పార్షియల్ విత్‌డ్రా అనుమతి ఉంటుంది.
- నైపుణ్యం పెంచుకోవడానికి ఖర్చు చేయాల్సి వస్తే, దాని కోసం కూడా కొంత డబ్బును వెనక్కు తీసుకోవచ్చు.
NPS కొత్త రూల్స్ (NPS New Rules)
పెన్షన్‌ను ఎలా ఉపసంహరించుకోవాలి (How to withdraw pension from NPS account)
- ఫిబ్రవరి 01 తర్వాత NPS అకౌంట్ నుంచి పాక్షికంగా డబ్బు విత్‌డ్రా చేయాలంటే.. పైన చెప్పిన ఏదోక పరిస్థితిని కారణాన్ని చూపుతూ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. దీనిని, సంబంధిత ప్రభుత్వ నోడల్ ఆఫీస్ లేదా పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ ద్వారా సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీకి (CRA) సబ్మిట్ చేయాలి.
- చందాదారు అనారోగ్యంతో ఉంటే, అతని తరపున కుటుంబ సభ్యుడు కూడా డిక్లరేషన్ సమర్పించవచ్చు. ఆ తర్వాత, CRA చందాదారు బ్యాంక్‌తో ఒక 'పెన్నీ డ్రాప్' టెస్ట్ నిర్వహిస్తుంది. అంటే, డిక్లరేషన్‌లో ఇచ్చిన అకౌంట్ వివరాలు సదరు చందాదారువో, కాదో తెలుసుకోవడానికి అత్యంత స్వల్ప మొత్తాన్ని (ఒక్క రూపాయి కూడా కావచ్చు) చందాదారు బ్యాంక్ అకౌంట్‌కు బదిలీ చేస్తుంది.
- వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయని 'పెన్నీ డ్రాప్' టెస్ట్‌లో తేలితే, ఆ తర్వాత మాత్రమే సబ్‌స్క్రైబర్ కోరిన మొత్తం ఆ ఖాతాకు బదిలీ అవుతుంది.
మరో ఆసక్తికర కథనం: మళ్లీ రూ.63 వేలకు ఎగబాకిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే
Best Mutual Fund SIP: పదేళ్లలో లక్షాధికారి అయ్యే మార్గం SIPతో సులభం- 44 లక్షలు మీవే!
Lower Interest Rates: వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంక్‌లు - SBI FD కష్టమర్లకు షాక్!
Loan Against FD: ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే ఈజీగా లోన్, ఎఫ్డీని రద్దు చేసే పని లేదు
Personal Loan Tips: మీ పర్సనల్ లోన్ అర్హతను మెరుగుపరుచుకునేందుకు ఈ 7 చిట్కాలు పాటించండి
Interest Rates Reduced: లోన్ తీసుకునేవాళ్లకు గుడ్ న్యూస్, ఈ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి
IPL 2025 KKR VS PBKS Result Update: చరిత్ర సృష్టించిన పంజాబ్ .. లీగ్ లో లోయెస్ట్ స్కోరును డిఫెండ్ చేసిన కింగ్స్.. 16 రన్స్ తో కేకేాఆర్ ఓటమి.. రాణించిన ప్రభు సిమ్రాన్, చాహల్
AP Government Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 2,260 టీచర్ పోస్టుల భర్తీకీ గ్రీన్ సిగ్నల్, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
Kalvakuntla Kavitha: కేసీఆర్‌లా కాదు నేను కాస్త రౌడీ టైప్ - కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన కల్వకుంట్ల కవిత
AP Cabinet decisions: ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే