By: Khagesh | Updated at : 15 Apr 2025 06:34 PM (IST)
పదేళ్లలో లక్షాధికారి అయ్యే మార్గం SIPతో సులభం- 44 లక్షలు మీవే! ( Image Source : Other )
Best Mutual Fund SIP: కరోనా తర్వాత మార్కెట్‌పై చాలా మందికి అవగాహన పెరిగింది. ఇందులో పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన పెరిగింది. అయితే ఈ కారణంతో నష్టపోతున్న వాళ్లు కూడా ఉన్నారు. అదే టైంలో లాభాలు కళ్ల చూస్తున్న వాళ్లు కూడా లేకపోలేదు. ఎలాంటి నష్ట భయం లేకుండ ఉండేందుకు SIPను ఉత్తమ మార్గంగా ఎంచుకుంటున్నారు.
మ్యూచువల్ ఫండ్లలో SIP ద్వారా పెట్టుబడులు పెట్టే ధోరణి గత కొన్ని సంవత్సరాల్లో రికార్డు స్థాయిలో పెరిగింది. 2016 ఏప్రిల్‌లో ప్రతి నెలా SIP ద్వారా 3,122 కోట్ల రూపాయల జనం పెట్టుబడిగా పెట్టేవాళ్లు. ఇప్పుడు ఈ సంఖ్య 26,000 కోట్లకు చేరింది. అంటే గత కొన్ని సంవత్సరాల్లో ఎనిమిది రెట్లకుపైగా పెరుగుదల ఉంది.
దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మార్కెట్ సరళతరం కావడంతో అతిపెద్ద కారణం. ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తం పెట్టుబడి పెట్టే ఆలోచన చాలా మందిని ఆకర్షిస్తోంది. ఆ పెట్టుబడి కూడా మార్కెట్‌తో సంబంధం లేకుండా ఎలాంటి నష్టభయం లేకుండా ఉండటం కూడా అందర్నీ అటువైపుగా పరుగులు తీస్తోంది. అందుకే మధ్యతరగతి, చిన్న పెట్టుబడిదారులకు SIP అనేది ఉత్తమమైన మొదటి పెట్టుబడి పెట్టే ఆప్షన్‌గా కనిపిస్తోంది.
SIPతో 44 లక్షల ఫండ్ ఏర్పాటు
ఒక పెట్టుబడిదారుడు గత 10 సంవత్సరాలుగా ప్రతి నెలా 10,000 రూపాయల SIP చేస్తే అది 44 లక్షలకు చేరుకునే అవకాశం ఉంటుంది. పదేళ్లుగా చాలా టాప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు 20 శాతం కంటే ఎక్కువ వార్షిక రాబడి (CAGR)నిచ్చాయి.
SIPలో మంచి గ్రోత్ కలిగిన టాప్-10 ఫండ్లు
ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం... ఈ మ్యూచువల్ ఫండ్లలో ‘Quant Small Cap Fund’ టాప్‌లో ఉంది. ఇది 10 సంవత్సరాలలో 24.56 శాతం CAGR రాబడినిచ్చింది. దీని తరువాత Nippon India Small Cap Fund (22.93 శాతం), Quant ELSS Tax Saver Fund (21.74 శాతం) ఉన్నాయి. మూడో స్థానంలో క్వాంట్ ELSS టాక్స్ సేవర్ ఫండ్ ఉంది. ఇది కూడా 21.74 శాతం వార్షిక రాబడినిచ్చింది.
మిడ్‌క్యాప్ ఫండ్ల ఆధిపత్యం
మిడ్‌క్యాప్ విభాగంలో కూడా క్వాంట్ ఫండ్ల ఆధిపత్యం కనిపించింది. క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ వార్షికంగా 21.60 శాతం రాబడినిచ్చింది. మోతిలాల్ ఒస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్ 21.47 శాతం రాబడితో మంచి గ్రోత్ కలిగి ఉంది. అంతేకాకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లు కూడా ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్టు దూసుకెళ్తున్నాయి.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి చెందిన ఫండ్లు కూడా మంచి రాబడిని ఇస్తున్నాయి. వీటిలో ICICI ప్రూడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వార్షికంగా 21.37 శాతం రాబడినిచ్చింది. ఇన్వెస్కో ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఫ్రాంక్లిన్ బిల్డ్ ఇండియా ఫండ్లు వార్షికంగా 20.67 శాతం. 20.60 శాతం రాబడినిచ్చాయి. నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ వార్షికంగా 20.38 శాతం రాబడితో టాప్ 10 ఫండ్ల జాబితాలో చోటు సంపాదించింది.
జాగ్రత్త, ఓర్పు అవసరం
ఆర్థిక నిపుణులు SIP గ్యారంటీడ్ రాబడి పథకం కాదని భావిస్తున్నారు. మార్కెట్ అస్థిరత కూడా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. లాంగ్ టెర్మ్‌లో ఈ హెచ్చుతగ్గులు సగటున ఉంటాయి. దీనివల్ల యావరేజ్ రాబడి మెరుగవుతుంది.
ఎవరు SIP చేయాలి?
క్రమం తప్పకుండా ఆదాయం కలిగి ఉండే వాళ్లు ఎవరైనా SIPలో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలం పెట్టుబడిని కొనసాగించగలవారికి SIP మంచి ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. యువత, ఉద్యోగులు, పెద్ద ఆర్థిక లక్ష్యాలను ప్లాన్ చేస్తున్న పెట్టుబడిదారులకు SIP ఒక తెలివైన ఎంపిక.
Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
SIP , PPFలో లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?
Investments for Child : పిల్లల ఫ్యూచర్ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్‌తో అధిక రాబడి మీ సొంతం
Children Day: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి
GHMC Property Tax: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ
VB–G RAM G Bill: ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ
Rowdy Janardhana Title Glimpse : ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం
GHMC Delimitation: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు